Pages

Monday, November 30, 2009

పదహారేళ్ళ వయసు
ఓ నవతరమా....

పదహారేళ్ళ వయసంటే పంచరంగుల కలలు కనే
బంగారు ప్రాయమనే భ్రమలో నీవున్నావా...
కాదమ్మా కాదులే కఠినమైన వాస్తవమది
కనులు తెరచి..నిజమూ తెలిసీ
నీ భవితను దిద్దుకో....

కాకమ్మ కథలలోని కలల రాకుమారునికై
ఆదమరచి నిదురించే అలసత్వం తగదమ్మా
కంప్యూటరు యుగంలోన క్షణ క్షణం మారిపోవు
పోటీకై తట్టుకునే ధీరమతివి కావాలి...

విరిసీ విరియని పూవుల అందాలను తిలకించీ
మనసున మల్లెల నూపే తలపులు వదిలెయ్యమ్మా
పరిశ్రమల కాలుష్యం మనిషిని పీల్చేస్తుంటే
పూవులోని ఏ అణువో విరుగుడుగా కావాలని
నిరంతరం శ్రమించే శాస్త్రవేత్త కావాలి...

మధుమాసం తొలిప్రొద్దున కోయిలతో గొంతు కలిపి
కూ కూ రాగాలు పలుకు సమయం నీ కేదమ్మా
వేకువనే పరుగులతో ఉరకలతో మొదలయ్యే
జీవన గానం నువ్వు చెయ్యక తప్పదు తల్లీ..

తరతరాలుగా వచ్చిన సంస్కృతి సాంప్రదాయాలను
అయినచోట విస్తరించి కానిచోట కత్తిరించి
అందించాం మిమ్మల్నే అందల మెక్కించాలని
మే నడిచిన ముళ్ళబాట మీ పాలిటి రాచబాట
కావాలని ఆశిస్తూ అట్లాగే దీవిస్తూ


నింగినంటు సౌధానికి కనపడని పునాదులమై
భావితరపు జీవానికి హవిస్సులో సమిధలమై
తరలిపోవు మా తరం... నిలబడండి నవ తరం..
తరలిపోవు మా తరం... నిలబడండి నవ తరం..


*****************************************************************

11 వ్యాఖ్యలు:

మైత్రేయి said...
This comment has been removed by the author.
మైత్రేయి said...

లలిత గారు , చాలా బాగా రాసారండి.
అయితె నాకు అనిపిస్తుంది, ఎన్ని బాద్యతలో కదా అమ్మాయిలకు. మంచి కొసం అంటు అమ్మలం నాన్నలం కూడా ఎంత బరువు పెదుటున్నమొ వారిపై.
పిచ్చి తల్లులు వెబ్ కాం నుండి, సెల్ ఫొటొల నుండి ధనాశ తొ విచక్షన లేక ప్రసారం చెసే టివి ల నుండి కూడా తమను తాము రక్షించు కొవాలి ఈ కమ్యునికెషన్ యుంగం లొ .
పొరపాటు అనే మాటే లేదు ఆడపిల్ల జీవితం లొ . అన్ని "తప్పు" లె .
పదహారు అంటున్నారు పది ఏళ్ళ పసి ప్రాయం నుండె పాపను పదుచు గా చూస్తున్నారు ఈ చిత్త కార్తె కుక్కలు .
ఈ విషయంలొ కొంత తెలంగాణా ప్రాంతం ముఖ్యం గా హైదరాబాదు చాలా నయం కోస్తా జిల్లాల కంటె.
అమ్మయిలను నీచంగా మాట్లాడె విషయం లొ కోస్తా వాళ్ళ సంస్కారం వెనక బడె ఉన్నది. రెండు ప్రాంతాల్లొ చాలా రొజులు గడిపిన అనుభవం తొ ఖచ్చితం గా చెప్పగలను.

లలిత said...

శ్రీ లలిత గారు బావుంది.
తరాలు మారేకొద్దీ బరువులూ బాధ్యతలూ పెరుగుతున్నయే కానీ తరగటం లేదు. వొకప్పుడు వంటావార్పూ, ముగ్గులూ కుట్లూ అల్లికలూ, నేర్చుకుంటే సరిపోతే ఇప్పుడు వాటన్నిటితోపాటూ చదువుల్లోనూ, ఉద్ద్యోగాల్లోనూ , చివరికి తమని తాము రక్షించుకోవటంలోనూ ఎన్నెన్ని మెళకువలు నేర్చుకోవాలో
మైత్రేయిగారూ మీరు కొస్తా జిల్లలోని ఏ ప్రాంతాన్ని చూసి ఈ అభిప్రాయానికొచ్చారో తెలీదుకానీ....... మీ భిప్రాయం తప్పని నేను ఖచ్చితంగా చెప్పగలను. వెనకబాటు తనం అనేది అన్ని ప్రాంతాల్లోనూ వుంది. ఇక మనిషి ముసుగేసుకున్న రాక్షసులు అడుగడునా వున్నారు దీనికీ ప్రాంతీయ బేధం లేదు.

జయ said...

పదహారేళ్ళ వయసు ఆడపిల్లలకు ఎంత పదిలమైందో. మొగ్గను తుంచి నాశనం చేసే కరకు తనం ఎప్పుడు తగ్గుతుందో... ఆడపిల్ల విలువ ఎప్పుడు తెలుస్తుందో... ఆడపిల్ల లేని ప్రపంచాన్ని ఊహించుకో గలమా? చాలా బాగా రాశారండి శ్రీలలిత గారు.

శ్రీలలిత said...

మైత్రేయిగారూ, లలితగారూ, జయగారూ,
కవిత నచ్చినందుకు ధన్యవాదాలు. కాని మైత్రేయిగారూ , మీ అనుభవం ఎలాంటిదో నాకు తెలీదు కాని ప్రాంతం ఏదైనా మనుషుల స్వభావం మటుకు ఒక్కటే అనిపిస్తుందండి నాకు.

కార్తీక్ said...
This comment has been removed by the author.
Jaggu said...

చాలా బాగుంది మీ కవిత. ఈ కాలంలో తెలుగు ఇంత బాగా మీరంత అనుసరిస్తుంటే ఇంకా బాగుంది. మీరన్నది ఖచ్చితంగా నిజం. ప్రాంతం ఏదైనా మనుషుల స్వభావం చాలా ముఖ్యం. కానీ ఈ కాలం లో ప్రాంతానికే ప్రాముఖ్యత ఇస్తున్నారు. అది మన దురద్రుష్టం.

సాహితి said...

చాలా బాగుంది మీ కవిత

కార్తీక్ said...

శ్రీ లలిత అక్క బాగుంది ...
జయక్క మాటే నా మాట
నేను త్వరలోనే ఆడపిల్లల గురించి ఒక టపా రాయబోతున్నాను మీ అంత సున్నితంగాకాదు కాని
అది ఒక ,విసిరే పులి పంజా, నెత్తురు పూసిన మాంజా,

జయక్క చెప్పనట్టు "ఆడపిల్ల విలువ ఎప్పుడు తెలుస్తుందో... ఆడపిల్ల లేని ప్రపంచాన్ని ఊహించుకో గలమా? "
ఎవరో మహానుబావులు చెప్పారు "అమ్మ ఋణం తీరాలంటే , అమ్మకు అమ్మ అయి పుట్టాలి అని "
అలా అని
ఆడ పిల్ల విలువ తెలియాలంటే,ఆడపిల్లై పుట్టనవసరం లేదు, ఆ పిల్లకు తండ్రి అయి పుట్టాలి , అప్పుడు బాగా తెలుస్తుంది ఆడ పిల్లవిలువ ...
ఇక స్త్రీ లేని ప్రపంచం = గాలి లేని ప్రపంచం ..
WWW.THOLIADUGU.BLOGSPOT.COM

మరువం ఉష said...

స్ఫూర్తి నింపుకోవాల్సిన హృదయాలన్నీ ఈ మాదిరి ఉద్భోధలకి కాస్తైనా నిలబడితే చాలు. ఒక్కోసారి కేవలం డబ్బు సూత్రంగా సాగుతున్న యువతరాన్ని చూస్తే బాధ కలుగుతుంది. ఇలాగే నేను వ్రాసుకున్న కవితిది. "నీలోనే లోకంవుంది, గమ్యం వుంది, సమస్త జగత్తువుంది!" http://maruvam.blogspot.com/2009/03/blog-post_11.html

మీ చివరి పలుకులు నా కవితలోని చివరి పంక్తులు నావీ ఒకటే...

"మన వెనుకతరం మాదిరే మనంకావద్దా ముందుతరానికి మార్గదర్శకం?
వినరా మన విజయగాథలు రానున్న తరం? కృషితో నాస్తి దుర్బిక్ష్యం."

Navya said...

Vaasthavaniki daggaraga chala adbutham ga rasaru...