Pages

Friday, December 25, 2009

గొబ్బిళ్ళపాటగోదావరి జిల్లాల వైపు సంక్రాంతి పండుగ కి నెల రోజుల ముందునుంచీ ధనుర్మాసం నెల పట్టు అని పడతారు. ఇంటి ముందు రంగవల్లికలు తీర్చిదిద్దటంతో పాటు, ఇంట్లో ఉన్న కన్నెపిల్లలు రోజూ గొబ్బెమ్మలు పెట్టి, స్నేహితులతో కలిసి ,చుట్టూ తిరుగుతూ, పాటలు పాడుతూ, రోజూ ఒకరింట్లో పేరంటం పెట్టుకుంటారు. అల్లాంటి గొబ్బిళ్ళ పాట ఇది. ఆకాశవాణి లో పదేళ్ళక్రితం ప్రసారమయింది. సంక్రాంతి నెలపట్టు సందర్భంగా మళ్ళీ ఒకసారి పాడుకుందాం. ఈ క్రింది లింక్ కి వెడితే ఈ పాట వినొచ్చు.http://www.divshare.com/download/9923041-d79

గొబ్బిళ్ళోయ్ గొబ్బిళ్ళు గొబ్బిళ్ళోయ్ గొబ్బిళ్ళు
గొబ్బిళ్ళోయ్ గొబ్బిళ్ళు గొబ్బిళ్ళోయ్ గొబ్బిళ్ళు //

కన్నెపిల్లల కలల పంటల గొబ్బిళ్ళోయ్ గొబ్బిళ్ళు
కనులకు విందౌ గుమ్మడి పువ్వుల గొబ్బిళ్ళోయ్ గొబ్బిళ్ళు // గొబ్బిళ్ళోయ్ గొబ్బిళ్ళు //

ముచ్చటైన ముంగిళ్ళల్లో ముగ్గుల వేడుక గొబ్బిళ్ళు
గడప గడపకూ పసుపు కుంకుమల రాశులు పోసిన గొబ్బిళ్ళు// గొబ్బిళ్ళోయ్ గొబ్బిళ్ళు //

రాజ మహరాజ రైతు బిడ్డల గాజుల చేతుల గొబ్బిళ్ళు
కలికి కలలలో వలపులు కురిసే వన్నెల వరునికి గొబ్బిల్లు// గొబ్బిళ్ళోయ్ గొబ్బిళ్ళు //#####################################################################

3 వ్యాఖ్యలు:

సిరిసిరిమువ్వ said...

గొబ్బిళ్ళపాటలు వినిపిస్తున్నారా, బాగుంది.
అన్నట్టు లలిత గారు, "గోదావరి జిల్లాల వైపు సంక్రాంతి పండుగ కి నెల రోజుల ముందునుంచీ ధనుర్మాసం నెల పట్టు అని పడతారు"...అన్యాయం లలిత గారు..ఇది గోదావరి జిల్లలకే పరిమితం కాదు..అన్ని కోస్తా జిల్లాలలో పెడతారు. చిన్నప్పుడు పోటీలు పడి గొబ్బెమ్మలు పెట్టిన చేతులు ఇవి మరి.

శ్రీలలిత said...

సిరిసిరిమువ్వగారూ,
గోదావరి జిల్లా పిల్లని కదా.. అందుకని ఆ మాట వచ్చేసింది. మీరన్నది నిజమే.. కోస్తా జిల్లాలన్నిట్లో పెడతారు..గొబ్బెమ్మలు పెట్టిన చేతులంటే ఎంత అదృష్టం అండీ..

పరిమళం said...

లలిత గారూ ! సిటీ కొచ్చాక గొబ్బిళ్ళు కనుమరుగైపోయాయి ..కాని పిండితో నెలముగ్గులు నెలంతా పెడతాను మా ఫ్లాట్ ముందు గచ్చుమీదే :)