Pages

Saturday, August 1, 2009

గొప్ప బహుమతి..

ఇచ్చట ఉచితముగా సలహాలు ఇవ్వబడును.

సమయం: అన్నివేళలా (మీరు క్యూలొ వున్నారు. దయచేసి వేచియుండండి.)

గమనిక: ఒకసారి తీసుకున్న సలహా వాపసు తీసుకొనబడదు.

హెచ్చరిక: ఎవరు చేసుకొన్న ప్రయోగానికి వారే బాధ్యులు.

మొన్నీమధ్యనే మా దోస్తు కొడుకు పెళ్ళయింది. సాధారణంగా మేము ఒక పదిమంది పైన మా కాలనీ లో కలిసి తిరుగుతుంటాం. ఎప్పుడూకుడా అందరం కలిసి ఇంత అని వేసుకుని ఇలాంటి సమయాల్లో ఒక పెద్ద వస్తువేదైనా బహుమతిగా కొని ఇచ్చే అలవాటు. ఈసారి మరికాస్త ఎక్కువగానే వేద్దామనే నిర్ణయానికొచ్చేం. ధరలన్నీ మండిపొతున్నాయిగా మరి. దానికి ఏమీ అభిప్రాయభేదం రాలేదు కాని బహుమతే యేది కొనాలా అన్నదాని మీద వాడిగా, వేడిగా చర్చలు జరిగాయి. ఆఖరికి నాలాంటి పెద్దతలకాయలం పూనుకొని అందరి నోళ్ళూ మూయించి బహుమతి కొనేసేం. ఆ బహుమతి చూసి మా దోస్తు ఎంత సంబరపడిపొయిందో..మరో రెండు నెలలపాటు కొడుకూ, కోడలూ కాస్త సరదాగా నెలకో సినిమాకీ, నెలకోసారి సిటీలొ షికారుకీ వెళ్ళొచ్చని మహదానందపడిపొయింది. ఇంతకీ ఆ బహుమతి ఏమిటా అని కుతూహలంగా వుందా.. ఇదిగో వినండి.. మేము కొన్నవి.. పది కిలోల బియ్యం, రెండు కిలోల కందిపప్పు, రెండు కిలోల మినప్పప్పు, ఇలాగ సంసారానికి కావలసిన సంభారాలన్నీ(ఒక్క ఉప్పూ, నూనె తప్ప) (అవి ఇవ్వకూడదని సెంటిమెంటు కదా) కొని ఇచ్చేసాము. ఎలాగుంది మా బహుమతి? మీకు కూడా ఇలాంటి వాటికి సలహాలు కావాలంటే నన్ను సంప్రదించండి.

3 వ్యాఖ్యలు:

psm.lakshmi said...

హమ్మయ్య. క్యూలో నేను ఫస్ట్. భవిష్యత్ లో పనికొస్తుందని ముందుచూవు.
బ్లాగ్ ప్రవేశ మహోత్సవ శుభాకాంక్షలు.
వరలక్ష్మీ దేవి పూల అలంకరణ చూసి కొంచెం తికమక పడ్డాను. మీరు విదేశంలో వున్నారా అని. మా వూరి వారేనన్నమాట.
psmlakshmi
psmlakshmi.blogspot.com

ప్రియ said...

మీరు ఉండేది ఏకాడా?

హీహీహీ

తెలుగోడు_చైతన్య said...

హా హా...గమనిక...హెచ్చరిక...అంటూనే సరకుల అమరిక చేశారు...బాగున్నది మీ సలహా...ఇప్పుడు ఇదే అందరూ చేసే సేవ...ధన్యవాదాలు.. తెలుగోడు.