జ్యోతిగారు వ్రాసిన కాదనలేని సత్యాలు అనే టపాకు స్పందించి...
వరము లిచ్చేది దేవత
వలచి మురిసేది వనిత
జన్మ నిచ్చేది జనని
తోడు నిలిచేది తరుణి
ఓ పురుషుడా... అడుగడుగునా
నీ ప్రగతియే తన జగతిగా
నీ ఉనికికై తన ప్రాణమే
పణము పెట్టే పడతిపై
ఎందుకీ భేదభావం.... నీ కెందుకీ హీన భావం...
పుట్టి పెరిగిన ఇంటిని విడిచి నీ ఇంటికి వెలుగిస్తుంది
పేగు తెంచుకుని పుట్టిన బిడ్డను నీ వారసునిగ చేస్తుంది
కరిగే కొవ్వొత్తిలా జీవనము గడుపు స్త్రీలపై
ఒక తల్లిపై , ఒక చేల్లిపై, ఇల్లాలిపై, నీ నేచ్చేలిపై
ఎందుకీ భేద భావం...నీ కెందుకీ హీన భావం....
ధర్మ శాస్త్రాలు ఒక్కటియై స్త్రీని దేవతను చేసాయి
చరిత్ర పుటలను తిప్పితే మాతృమూర్తి నీ వన్నాయి
ఈ నవీన సమాజ జీవన వేగంలో
ప్రతి దినము జరిగే పరుగుల పోటీలో
బేల కాదు ఈ బాల...నిను మించులే నవరసాల..
బేల కాదు ఈ బాల...నిను మించులే నవరసాల..
##########################################
6 వ్యాఖ్యలు:
లలితగారు
బాగా చెప్పారండి. ఎంత ప్రగతి చెందినా ఈ వివక్ష ఇంకా ఉందండి... కాని నూటికో కోటికో ఒక్కరు మహానుభావులు ఉన్నారు..
లలిత గారు ,
బాగుందండి మీ కవిత .
జ్యోతీ, మాలా... థాంక్యూ....
అద్భుతంగా ఉంది.
మీ ఆవేదన కవితలో ప్రస్ఫుటమయ్యింది. ఆకాశంలో సగమైన మహిళాలోకం ప్రతిఘటించాల్సిన అవసరం వుంది.
Eppatinuncho nenu adagalanukune prashnalu mee kavitha lo kanabaddayi....chala bagundhi...matalu karuvouthunnayi!!
Post a Comment