అలల గోదారి కలలు కనమంటె
కలలొ నీరూపె కలత పెడుతుంటె
ఏమని రాసేది ఈ లేఖ
నా మది విప్పేటి ప్రేమలేఖ...
ఎదురుగా నీవె ఎదలొ నీవేలె
సుధలు కురిసేటి కథవు నీవేలె
మధురమైన మనసుతోనె
ఎదను తెరిచాను చదువుకోలేవ...
కనులలోన నీ బొమ్మ
కనబడునేమోనని
కాలమంత అద్దమెదుట
కదలకుండ గడిపాను
ఎదుట నీవు లేకుండా
బొమ్మ ఎలా వస్తుంది
మనిషి మనసు పిచ్చిది
వద్దన్నా వినని పసిది..
నా మనసు నీకు తెలియదా
మరి తెలిసి నీవు అడగవా
నీ జీవితం నను పంచుకొమ్మని
నా బతుకునే నీ కంకితమిమ్మని..
ఎందుకలా చూస్తావు
నిను మరిచిపొమ్మంటూ
మరవడమంటే మాటలా
మరణమే మేలు కదా..
మాటి మాటికీ మారే మనసులంటే
రాసి రాసి చెరిపేసిన పలకల్లాంటివి
కొత్తబొమ్మ పైన రాసినా
పాతబొమ్మ ఆనవాళ్ళు పట్టినట్టు తెలుస్తాయి..
నిన్న చూసా నీకోసం
నేడు కూడా రాలేదు సంతోషం
అంతే నోచుకున్నానా
చెప్పరాదా చివరికైనా....
13 వ్యాఖ్యలు:
శ్రీ లలిత గారు చాల చక్కగా రాసారు...లోతైన భావాన్ని తేలికైన పదాలతో రాయడం చాలా కష్టం...మీరు అది చాల తేలికగా చేసారు...All the best and keep writing more...
చాలా బాగారాసారండి...
Excellent
chaalaa bagaa undi chinna,chinna padaalatoo lotaina bavaana chepparu.- Hema
కలలో ని నా రూపు కంటి ముందుకు తేవ...
పిచ్చి మనసును కోరి చెరవచ్చిన నేను
పిచ్చి వాడయ్యేను నీ రూపు చూసి
మరువమన్నానా....
మార మన్నానా ....
మరువమన్నది నిన్ను నిన్నటి వెతలను
మార మన్నది చూడూ ప్రేమ లోకం లోకి
జాగు చెయ్యక నువ్వు నా చిట్టి ఎంకి
గుండెలోనికి చేరే నెలవంక తునకా...
శ్రీ లలిత గారు చాల చక్కగా రాసారు మీ ప్రేమలేఖ.
కిషన్ రెడ్డిగారూ, పద్మార్పితగారూ, రవింద్రగారూ, స్నేహితగారూ, శివరంజనిగారూ అందరికీ ధన్యవాదములు.
పూబాలల ఊసులను, శరదృతు లాంటి వర్ణనలను తేకుండా మామూలు మాటలలో ప్రేమలేఖ వ్రాయగలనా అని ప్రయత్నించా.. కాని నా బలహీనత మా గోదారిని వదలలేకపోయా..
శ్రీ లలిత గారు. చాలా అద్భుతంగా ఉంది మీ కవిత. ఇంత ఎదురుచూపులా! తోందరగానే సంతోషం కలగాలని కోరుకుంటున్నాను. భావన గారు మీ ప్రతిస్పందన కూడా చాలా బాగుంది.
భావనా,
ఎదురు పడదామంటె ఎదను దడ మొదలు
మరుగు నుందామంటె మనసూరుకోదు
ఇంక పిలవకు నన్ను ఊరుకోలేను
గుండె నిండా నీకు గుడి కట్టినాను
ఉండనీ నన్నికడ నిన్ను పూజిస్తూ
హాయిగా ఉండకడ నన్ను ప్రేమిస్తూ...
హ హ హ క్లాప్స్ క్లాప్స్.. బాగా సమాధానమిచ్చేరు శ్రీలలితా.. బలే సమాధానమిచ్చారు. నాకెంత నచ్చావె చిన్నారి చిలక ;-)
నీ బావఏడున్న పిలుచుకొస్తానే
నీ వూసులను చెప్పి ఒకటి చేస్తాలే.. ;-)
జయగారూ,
కవిత మీకు నచ్చినందుకు చాలా సంతోషంగా ఉందండీ. మదిలో భావాలు మనసు చదివేవారితో పంచుకోవడం అదృష్టమే కదా..
ఎందుకలా చూస్తావు
నిను మరిచిపొమ్మంటూ
మరవడమంటే మాటలా
మరణమే మేలు కదా..
idi exactly correct...
superb lines........
www.tholiadugu.blogspot.com
ఇక్కడేదో చక్కని కవి[తా] సమయం గడిచిపోయినట్లుంది. నాకు కొన్ని పదకట్లు మహా నచ్చేసాయి. అలా మనసులో ఖచితమైపోయాయి. అందుకే అనేది ప్రేమ జిందాబాద్. ఎవరినైన కవితావాహినిలోకి లాగేస్తుంది. ప్రేమను చెప్పటానికి కవితని మించిన వైనం కలదా ఈ ఇలలో.
Post a Comment