Pages

Saturday, October 13, 2012

మా మహిళామండలి వార్షికోత్సవం...



ప్రతి సంవత్సరం ఆనవాయితీగా జరుపుకునే మా మహిళామండలి వార్షికోత్సవం ఈ రోజు జరుపుకున్నాము.
అసలు ప్రతి యేడూ ఒక్కొక్కరం ఒక్కొక్క అయిటమ్ చేసుకుని తీసుకువెడుతుంటాం. కాని అదేమిటో ఈ మధ్య అందరూ ఎవరూ ఏమీ తేవద్దు.. అన్నీ మేమే వండేస్తాం అనే అన్నపూర్ణలు యెక్కువైపోతున్నారు మా సభ్యుల్లో. ఈసారి ఆ అన్నపూర్ణ పాత్రని శ్రీమతి లక్ష్మీ ఆచార్య బహు ప్రీతిగా పోషించారు. ఇరుగో..ఈవిడే ఇవాల్టి మా అన్నపూర్ణ శ్రీమతి లక్ష్మీ ఆచార్య.

   ఇవిగో ఒంటిచేత్తో ఆవిడ వండిన వంటలు..చూడ్డానికే కాదు తినడానికి కూడా బహు రుచికరంగా వున్నాయి.



విందారగించడానికి వచ్చిన మా మహిళామండలి సభ్యులం.

















  మా సంతోషాన్ని పెంచడానికా అన్నట్టు ఈసారి నలుగురు ప్రత్యేక అతిథులు కూడా వచ్చారు.
అందరం సరదాగా కబుర్లు చెప్పుకుని, కాసేపు తంబోలా ఆడుకుని, "పోదామా.. ఇక పోదామా.." అనుకుంటూ ఇళ్ళకు చేరాం.  

------------------------------------------------------------------------------------------------------------

5 వ్యాఖ్యలు:

మాలా కుమార్ said...

చాలా బాగున్నాయండి మీ మహిళా మండలి కబుర్లు . ఇలాగే మరిన్ని వార్షికోత్సవాలు జరుపుకోవాలని కోరుకుంటూ , మీ సబ్యులందరికీ "లలిత మహిళామండలి వార్షికోత్సవ శుభాకాంక్షలు ".

పరిమళం said...

మ్మ్....నోరూరించే వంటలు...
మహిళలందరికీ అభినందనలు!

శ్రీలలిత said...


ధన్యవాదాలు పరిమళంగారూ...

మధురవాణి said...

మీరందరినీ చూస్తుంటే ముచ్చటేస్తుందండీ.. పంతొమ్మిదేళ్ళ నుంచీ ఇంత స్నేహంగా, కలిసికట్టుగా ఉన్నారంటే మీ అందర్నీ బోల్డు అభినందించాలి.. మీరిలాగే మరిన్ని వార్షికోత్సవాలు జరుపుకోవాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నానండీ..
వంటలు మాత్రం అదిరిపోయాయి.. :)

శ్రీలలిత said...


మధురవాణిగారూ,
మీ అభినందనలకు ధన్యవాదాలండీ.
వంటలు చూడ్డానికే కాదు తినడానికి కూడా చాలా బాగున్నాయండీ...