Pages

Monday, March 18, 2013

మా మహిళామండలి మహిళా దినోత్సవం కబుర్లు.. (కాస్త ఆలస్యంగా,,,)






   మా లలితా మహిళామండలి సభ్యులం అందరం కలిసి మార్చి9న మహిళాదినోత్సవం జరుపుకున్నాం. ఈ సారి అందరం రాజ్యలక్ష్మిగారింట్లో కలిసాం. ఈవిడే రాజ్యలక్ష్మిగారు. ఎంత బిందాస్ గా ఉన్నారో చూసేరా.. ఆవిడెప్పుడూ అంతే. పేద్ద సమస్యతో ఆవిడ దగ్గరి కెడితే అంతా దూదిపింజెలా తేల్చేసి, మనసుకి హాయి నందిస్తారు.

ఇరిగో..వీరందరూ లలితా మహిళామండలి సభ్యులే...













ఈ బుజ్జిగాడే ఆరోజు అక్కడ అందరికి ముద్దుల మనవడు...





కాసేపు అందరం మహిళల్లో ఉన్న గొప్ప గుణాల గురించి మాట్లాడుకున్నాం.
తెలుగుభాషలో మాకు ఎంతవరకు పాండిత్యముందో  తెలుసుకుందుకు రాజ్యలక్ష్మిగారు మాకందరికి తెలుగులో ఒక పరీక్ష పెట్టేరు. అందరం ఒకరికొకరం చెప్పెసుకుంటూ, కాపీలు కొట్టేసుకుంటూ సరదాగా ఆ పరీక్ష రాసేసాం.
అందరికంటే ఎక్కువ మార్కులు వచ్చినవారికి రాజ్యలక్ష్మిగారు ఎంచక్కా బహుమతులు కూడా ఇచ్చేరు. 

తర్వాత అన్నింటికంటే ముఖ్యమైనపని.. అదేనండి..భోజనం..
 అందరం తలొక రకం తెచ్చుకుని ఎంచక్కా భోంచేసాం.
ఏవేం తెచ్చుకున్నామంటారా..
ఇవిగో...






ఇవన్నీ మీకు చూపించడానికి కొన్ని ఫోటోలు అందించిన గాయత్రిగారు వీరే...



  అలాగ మా మహిళా దినోత్సవం సందర్భం గా ఆరోజంతా సరదాగా గడిపి సాయంత్రానికి ఇళ్ళకు చేరాం..

---------------------------------------------------------------------------------------

21 వ్యాఖ్యలు:

భమిడిపాటి సూర్యలక్ష్మి said...

బావున్నాయండీ! మీ సభ్యుల ఫోటొలూ, వంటకాలునూ! అందులో ఒకావిడ మా వదిన గారి లా వున్నారు. మా వదిన గారి పేరు "దుర్గ". ( దుర్గ అక్కయ్య అంటారు. నల్లకుంట లొ వుంటారు.)

జలతారు వెన్నెల said...

లలిత గారు, అందరు "ఎర్ర రంగు" చీరలలో ఉన్నారు.డ్రెస్స్ కోడాండి?
మీ వంటకాలన్ని ఫోటొలు చూస్తుంటే కడుపు నిండిపోతుంది.. :)

Zilebi said...

వామ్మో వామ్మో,

ఇంత 'Thin Day'? (తెలుగలో చదవ వలె !)

శుభాకాంక్షలు శ్రీ లలిత గారు,

గో రెడ్ - మహిళాలోకం!

జిలేబి

సి.ఉమాదేవి said...

ఆసాంతం ఎరుపు మెరుపు
అతివలకందిన ఆటవిడుపు
మంచి మనసుల కలగలపు
పంచుకున్నషడ్రుచుల మేళవింపు
మీ అందరికీ అభినందనలు శ్రీలలితగారు.

చెప్పాలంటే...... said...

bhale vundi mi tapaa baagaa enjoy chesaaru gaa pics kudaa chakkagaa vunnayi

శ్రీలలిత said...


అవునండీ లక్ష్మిగారూ, ఆవిడ పేరు దుర్గే. మాకు కూడా బీరకాయపీచు చుట్టరికమేదో ఉండి కానీ అంతకన్న ఎక్కువగా ఇద్దరం మంచి స్నేహితులం...

శ్రీలలిత said...


జలతారు వెన్నెలగారూ,
నిజమేనండీ..డ్రెస్ కోడే..క్రితం యేడాది ఆకుపచ్చ.. ఈ యేడు ఎరుపూ నన్నమాట. మరి వచ్చే యేడు ఏ రంగు చెప్తారో మావాళ్ళు.
ఖంగారుపడకండీ.. అందరం కలిసి ఒక్కసారే రోడ్డు మీదకి వెళ్లలేదులెండి..

శ్రీలలిత said...


జిలేబీగారూ,
హ.హ..తెలుగులోనే చదివానండీ..
తిండి కలిగితె కండ కలదోయ్
కండ కలిగితె వండగలమోయ్..
అదన్నమాట ...

శ్రీలలిత said...


ఉమాదేవిగారూ,
మీ అభినందన మనసుకు హాయి కలిగించిందండీ. ధన్యవాదాలు.

శ్రీలలిత said...


చెప్పాలంటే గారూ,
మీకు నచ్చినందుకు ధన్యవాదాలండీ...

నవజీవన్ said...

మీ పిండివంటల ఛాయాచిత్రం నోరూరించేలా ఉందండి!!

జయ said...

బాగుందండి మీ మహిళామండలి. డ్రెస్ కోడ్ సరదాగా, లౌలీ గా ఉంది. మీ అందరికీ నా అభినందనలు...శుభాకాంక్షలు.

మాలా కుమార్ said...

చాలా సరదాగా వున్నాయండి మీ మహిళామండలి కబుర్లు . మమ్మలినీ చేర్చుకోవచ్చుగా మీ మహిళామండలిలో :)
అవును మీ ఫొటో లేదేమిటి అన్యాయం కదా !

మాలా కుమార్ said...
This comment has been removed by the author.
శ్రీలలిత said...


జయగారూ,
మా కబుర్లు నచ్చినందుకు ధన్యవాదాలండీ. ఎవరూ మనకి ఓ రెండుగంటలు బైటకెళ్ళి స్నేహితులతో సరదాగా గడిపిరమ్మని చెప్పరు. మనకి మనమే కల్పించుకోవాలి. మేం అలాగే మాకు ఉన్న టైమ్ లోనే కాస్త సమయం అందరం కలిసి గడుపుతుంటాం..

శ్రీలలిత said...


మాలాగారూ,
మా కబుర్లు మీకు నచ్చినందుకు ధన్యవాదాలండీ.
అలాగే రండి.. మీకోసమే వైటింగ్. వెంటనే జేర్చుకుంటాం..
ఫొటోలు తీస్తూ కేమెరా వెనకాల ఉన్నాను కదండీ.. అందుకు కనపడలేదన్నమాట...

తృష్ణ said...

nice.
డ్రెస్ కోడ్ బావుందండి..:)

Unknown said...

బావున్నాయి.. మహిళాదినోత్సవాన మీ మహిళా మండలి విశేషాలు..

శ్రీలలిత said...


నవజీవన్ గారూ,
ఛాయాచిత్రమే కాదు రుచులు కూడా నోరూరించేలాగే ఉన్నాయండీ...

శ్రీలలిత said...


తృష్ణగారూ,
ధన్యవాదాలండీ...

శ్రీలలిత said...


ప్రసీదగారూ,
ధన్యవాదాలండీ...