మా లలితా మహిళామండలి
సభ్యులందరం ప్రతియేడూ International women's day కి బయటకెక్కడికైనా
వెళ్ళి lunch చేసి వస్తుంటాం. (హి హి యేదో ఆ పేరు చెప్పుకుని
కాస్త సరదాగా friends తో గడపడానికి ఒక వంక అంతే..)
అలాగే ఈ యేడు కూడా యెక్కడికెడదామా అనుకుంటుంటే
మా సభ్యురాలు ఒకామె వాళ్ళు కొత్త ఇల్లు కట్టుకుంటున్నారనీ, మమ్మల్నందరినీ అక్కడకొచ్చి ఇల్లు చూసేక, అక్కడి నుంచి
lunch కి వెడదామనీ అన్నారు. ఇంకనేం.. సెబాసో అంటూ రెండు కార్లూ,
ఒక వేన్ లో బయల్దేరాం. నేనైతే కావాలని వేనే యెక్కేను. యెంచక్క బోల్డుమందితో
కలిసి కూర్చుని అంత్యాక్షరి ఆడుకోవచ్చు కదా.. అందుకన్న మాట. అలాగే అంబర్పేట నుంచి
జూబిలీహిల్స్ వెళ్ళేవరకూ గంటపైగా పాత, కొత్త సినిమా పాటలతో అందరం
అదరగొట్టేసాం. పాపం.. ఆ వేన్ డ్రైవర్.. తర్వాత బహుశా ఎర్రగడ్డకి దారి వెతుక్కునుండొచ్చు. పాపం శమించుగాక.
ఆ friend పేరు రత్నావతి.
వాళ్ళు jubilee hills లో ఇల్లు కట్టుకుంటున్నారు. చాలావరకూ అయిపోయింది.
ఇంక painting అయ్యాక fittings మాత్రం వున్నాయి.
ఇల్లు చాలా బాగుంది. మూడంతస్తులు. ఇంట్లోనే సౌకర్యంగా lift పెట్టించుకున్నారు. ఒక్కొక్క అంతస్తులోనూ అన్ని రూములూ వరసగా చూసుకుంటూ
మూడో అంతస్తు బాల్కనీలో సెటిల్ అయ్యాం.
దుర్గ
అంతర్జాతీయ మహిళాదినోత్సవం యే దేశంలో యెప్పటినుంచీ ప్రారంభం అయిందో చెపుతూ, మహిళల హక్కులను మహిళలే పరిరక్షించుకోవాలని చెప్పారు. విద్యుల్లత పరిపూర్ణమహిళకి
నిర్వచనం చెప్పారు. అందరం కొన్ని కొన్ని సందేహాలు వారినడిగి తీర్చుకుంటూ వాళ్ళు చెప్పినవి
శ్రధ్ధగా విన్నాం.
అప్పటికి మధ్యాహ్నం మూడైంది. యెవరికీ ఇళ్లకి వెళ్లబుధ్ధవలేదు. అందరం కలిసి తంబోలా ఆడడం మొదలుపెట్టాం. నాలుగు దాటేదాకా సరదాగా కాలక్షేపం చేసుకుని "పోదామా ఇక పోదామా.." అనుకుంటూ ఇళ్ళకి చేరేటప్పటికి సాయంత్రం అయిదయింది.
వీళ్ళిద్దరూ...రత్నావతి, ఆవిడ కోడలు లక్ష్మి.
అవండీ...
ఈ సంవత్సరం మా మహిళామండలి జరుపుకున్న మహిళాదినోత్సవ సంబరాల వివరాలు.. బాగున్నాయా...?
----------------------------------------------------------------------------------------
9 వ్యాఖ్యలు:
భలే మంచిరోజు.పసందైన రోజు.
అభినందనలు లక్ష్మి అక్కయ్య గారు, చాలా చాలా బాగా గడిపారు...
అవును చాలా బాగా గడిపారు.అభినందనలు.
మీ అందరికీ మహిళాదినోత్సవ శుభాకాంక్షలు.
నాకు ఇలాటి చాన్స్ దొరకదు అందుకని నాకు బాగా కుళ్ళుగా వుంది!మరీ ఫోటోల తో సహా!!!!!
నాకు ఇలాటి చాన్స్ దొరకదు అందుకని నాకు బాగా కుళ్ళుగా వుంది!మరీ ఫోటోల తో సహా!!!!!
ఉమాదేవిగారూ,
ఇప్పుడే కదండీ పోస్ట్ చేసాను.. అప్పుడే మీ స్పందనా.. అమ్మో.. మీకు నమో నమః...
కరుణా, థాంక్యూ..
మాలాకుమార్గారూ, ధన్యవాదాలండీ...
లక్ష్మీరాఘవగారూ, హి..హి...
Post a Comment