Pages

Wednesday, July 29, 2009

వరలక్ష్మీదేవికి నివేదన



ఎప్పటినుంచో మేము ఈ వరలక్ష్మి శుక్రవారానికి లక్ష్మీదేవికి నైవేద్యం పెట్టి ఒక పాట పాడుకుంటుంటాం. ఆ పాట ఏదో పాత భక్తి సినిమాలోది. ఏ సినిమా లోదో గుర్తులేదు. పాటకూడా మధ్యలో కొన్ని మాటలు గుర్తు లేవు. అయినా పాట పాడడం రాకపోయినా మాట చెప్పినట్లే దానిని చెప్పుకునే సంప్రదాయంలో పడిపొయాము. ఈ పండుగకి అందరూ కూడా అమ్మవారి దగ్గర అది పాడుకుంటే బాగుంటుందని అనిపించి రాస్తున్నాను. ఇది ఏ సినిమా లోదో ఎవరికైనా తెలిసినా, దానిని అప్ లోడ్ చేసి అందరికి అందించినా నాకన్న సంతోషపడేవారు మరొకరుండరు. వారికి ముందుగానే ధన్యవాదములు తెలుపుకుంటున్నాను.


పల్లవి-- వరమహాలక్ష్మీ కరుణించవమ్మా చరణాల శరణంటినమ్మా వరమహాలక్ష్మీ కరుణించవమ్మా
నా వేదనను బాప నీ దేవుతో కూడి నైవేద్యమందుకోవమ్మా//వరమహాలక్ష్మీ కరుణించవమ్మా//

చరణం-- పాలకడలిని పుట్టి శ్రీహరిని చేపట్టి వైకుంఠలోకాన లక్ష్మివైనావే మాంపాహి మాతా మాంపాహి మాతా
సత్వగుణమూర్తివే సంపత్ స్వరూపివే ఇల సకల సంపదలదాయినీవమ్మా
నా వేదనను బాప నీ దేవుతో కూడి నైవేద్యమందుకోవమ్మా//వరమహాలక్ష్మీ కరుణించవమ్మా//

చరణం-- వాగీశురాణివై వరవీణపాణివై సత్యలోకమ్మున వాణివైనావే మాంపాహి మాతా మాంపాహి మాతా
సత్వగుణమూర్తివే సంపత్ స్వరూపివే ఇల సకల విద్యలకు తల్లి నీవమ్మా
నా వేదనను బాప నీ దేవుతో కూడి నైవేద్యమందుకోవమ్మా//వరమహాలక్ష్మీ కరుణించవమ్మా//

చరణం-- గిరిరాజ తనయవై పరమేశు తరుణివై కైలాసలోకాన గౌరి వైనావే మాంపాహి మాతా మాంపాహి మాతా
సత్వగుణమూర్తివే సంపత్ స్వరూపివే ఇల సకల సౌభాగ్య దాయినీవమ్మా
నా వేదనను బాప నీ దేవుతో కూడి నైవేద్యమందుకోవమ్మా//వరమహాలక్ష్మీ కరుణించవమ్మా//

3 వ్యాఖ్యలు:

మాలా కుమార్ said...

లలిత గారూ,
కంగ్రాట్యులేషన్స్ .మంచి పాట తో బ్లాగ్ మొదలు పెట్టారు.
ఈ పాట మా అత్తగారు వ్రతం రోజు పాడేవారు.చాలా ఏండ్ల తరువాత మల్లి ఈ పాట విన్నాను.

భావన said...

వెల్కం అండి బ్లాగ్లోకానికి. మీ అమ్మవారు చాలా బాగుంది. పువ్వులు బాగా పెట్టేరు..

Srujana Ramanujan said...

Very nice. Ammavaariki naa namaskaaraalu koodaa cheppandi.