రఘు-- అమ్మా, నేను రెడీ.. బయల్దేరదామా
సావిత్రమ్మ-- ఇప్పుడొద్దులేరా.. రజని రాలేనని కబురుపెట్టింది. వచ్చేవారం చూద్దాంలే..
రఘు-- రజనీని ఒట్టినే సాయానికే కదా రమ్మన్నాం. పెళ్ళికూతురు నచ్చాల్సింది మనకి కదా..
సావిత్రమ్మ-- అబ్బే, అలా ముగ్గురూ వెళ్ళడం సాంప్రదాయం కాదురా..తర్వాత చూద్దాంలే..
కొన్నాళ్ళ తర్వాత---
రఘు--అమ్మా, నాకు టిఫిన్ బాక్స్ ఇవ్వకు.
సావిత్రమ్మ-- ఎందుకురా?
రఘు--ఇవాళ మధ్యాన్నం తొందరగా వచ్చెయ్యాలికదా..ఎవరో అమ్మాయిని చూడాలనుకున్నాం కదా..
సావిత్రమ్మ--- అఖ్ఖర్లేదులేరా..ఆ అమ్మాయిది ఆశ్రేష నక్షత్రంట.. ఆశ్రేషకి అత్తగారుండరని చెప్తారు. ఇంకో అమ్మాయిని చూద్దాంలే...
ఇంకొన్నాళ్ళ తర్వాత---
రఘు--- అమ్మా, ఈ ఫొటో బాగుందమ్మా..ఈ అమ్మాయిని వెళ్ళి చూసొద్దామా?
సావిత్రమ్మా-- ఈ పిల్ల వద్దులేరా.. వాళ్ళ తాతలు గరిటె తిప్పారుట..అలాంటి సంబంధం ఎలా చెసుకుంటాం?
మరికొన్నాళ్ళ తర్వాత--
రఘు---అమ్మా, మామయ్యేదో సంబంధం గురించి రాసినట్టున్నాడు.
సావిత్రమ్మ-- అబ్బే, అది అసలు కుదర్దురా..ఆ పిల్ల జాతకం అస్సలు బాగులేదుట. ఆ పిల్ల ఏ ఇంట్లో అడుగు పెడితే ఆ ఇంట్లో అరిష్టమేట..
ఇంకా మరికొన్నాళ్ళ తర్వాత--
రఘు--- అమ్మా, ఈ రోజు పోస్ట్ లో ఏదో సంబంధం గురించి వచ్చినట్టుంది?
సావిత్రమ్మ--- అవున్రా, కానీ వాళ్ళది మన శాఖ కాదు. శాఖాభేదం పనికిరాదు..
రఘు--- నిన్న పక్కింటి పిన్నిగారు చెప్పిన సంబంధం మన శాఖే కదమ్మా..
సావిత్రమ్మ--- మరే, అదేదో ముష్టి సంబంధం లాగుంది. వాళ్ళు ఒట్టి కొబ్బరిబొండాం, పిల్లనీ చేతిలో పెట్టేట్టున్నారు..మనకి సరిపోదులే..
ఇంకా కొన్నిరోజులు పోయాక-----
రఘు, ఇంకో అమ్మాయి మెడలో పూలదండల్తో వస్తారు.
సావిత్రమ్మ--- అయ్యో, అయ్యో, ఇలాంటి పెళ్ళిళ్ళు మన ఇంటా వంటా లేవురా...
రఘు-- అందుకేనమ్మా మేం శాస్త్రప్రకారం పెళ్ళి చేసుకోలేదు. రిజిస్టర్ మేరేజ్ చేసుకున్నాం..
సావిత్రమ్మ---ఆఆఆఆఆఆఅ
##########################################################

3 వ్యాఖ్యలు:
పాపం, కోడలు వొస్తే తన ఉనికికి భంగం అని మనసులో ఏమైనా భయం ఉందేమో, అందుకే అన్ని సంబంధాలకు ఎన్నో ఒంకలు కనబడ్డాయి.

జయగారూ,
మీకలా అర్ధమైందా? అంతేనేమో...
Post a Comment