Pages

Wednesday, October 17, 2012

పాపం మాలతి...


పాపం మాలతి.. అనే ఈ కథ ఆటా 2008 కథలపోటీలో  ప్రథమబహుమతి పొందింది.
 చదివి మీ అభిప్రాయాలు కూడా చెప్పండి మరి...











2008 ఆటా మహాసభల ప్రత్యేక సంచిక సౌజన్యంతో...

--------------------------------------------------------------------------------------------------------

Sunday, October 14, 2012

సంతోషం_విచారం...


 ఇంతేరా ఈ జీవితం..
తిరిగే రంగుల రాట్నము...
ఎంతటి నగ్న సత్యం. కాసేపు రంగులరాట్నం మీద పై పైకి చేరిపోతాం.
మరు నిమిషంలో అథః పాతాళానికి జారిపోతాం..
ఈ నిమిషంలో సంతోషం. మరో నిమిషంలో దుఃఖం.
అందరూ అయినవాళ్ళే..ఒకరింటిలో విషాదం. మనకి గుండె పిండేస్తూ వుంటుంది.
మరొకరూ అయినవాళ్ళే.. వాళ్ళింటిలో సంతోషం. నవ్వుతూ వుండాల్సిన పరిస్థితి.
దుఃఖాన్ని దాచుకోలేక, నవ్వుని తెచ్చుకోలేక మనసు పడే బాధ ఎవరికి చెప్పుకోగలం?
ముఖానికి నవ్వు అరువు తెచ్చుకుని, ఏడవకూడదు కనుక పెదాల వెనుక కొండంత బాధని అదిమిపెట్టి,
అంతా ఎంత బాగుందో అంటూ అర్ధంలేని వ్యాఖ్యానాలు చేస్తూ, మన ముఖానికి మనం తొడుగులు తగిలించుకుంటున్నాం.
అయినా ఆ దేవుడికి కూడా ఇంత నాటకీయత ఏమిటో..
అన్ని రసాలూ ఏకకాలంలో పండించెయ్యాలంటే మానవమాతృలం..మనకి సాధ్యమా..



తగిలించుకున్న బంధాలు
తగులుకున్న బాధ్యతలు
మనసు రోదిస్తున్నా
మెదడు పనిచేయకతప్పని పరిస్థితుల్లో
బాధను అగాధాల్లో పాతిపెట్టి
పెదవులకు చిరునవ్వు అతికించుకుని
ఎంత హాయిగా వున్నానో.. అనుకున్నాను.
 కాని---
హాయనేది వుండేది మనసులోనేనని
కావాలని తెచ్చుకుంటే వచ్చి పెదవులపై వాలేది కాదని
ఈ పిచ్చి మనసుకి ఎప్పటికైనా తెలుస్తుందా..?

-------------------------------------------------------------------------------------------------------

Saturday, October 13, 2012

మా మహిళామండలి వార్షికోత్సవం...



ప్రతి సంవత్సరం ఆనవాయితీగా జరుపుకునే మా మహిళామండలి వార్షికోత్సవం ఈ రోజు జరుపుకున్నాము.
అసలు ప్రతి యేడూ ఒక్కొక్కరం ఒక్కొక్క అయిటమ్ చేసుకుని తీసుకువెడుతుంటాం. కాని అదేమిటో ఈ మధ్య అందరూ ఎవరూ ఏమీ తేవద్దు.. అన్నీ మేమే వండేస్తాం అనే అన్నపూర్ణలు యెక్కువైపోతున్నారు మా సభ్యుల్లో. ఈసారి ఆ అన్నపూర్ణ పాత్రని శ్రీమతి లక్ష్మీ ఆచార్య బహు ప్రీతిగా పోషించారు. ఇరుగో..ఈవిడే ఇవాల్టి మా అన్నపూర్ణ శ్రీమతి లక్ష్మీ ఆచార్య.

   ఇవిగో ఒంటిచేత్తో ఆవిడ వండిన వంటలు..చూడ్డానికే కాదు తినడానికి కూడా బహు రుచికరంగా వున్నాయి.



విందారగించడానికి వచ్చిన మా మహిళామండలి సభ్యులం.

















  మా సంతోషాన్ని పెంచడానికా అన్నట్టు ఈసారి నలుగురు ప్రత్యేక అతిథులు కూడా వచ్చారు.
అందరం సరదాగా కబుర్లు చెప్పుకుని, కాసేపు తంబోలా ఆడుకుని, "పోదామా.. ఇక పోదామా.." అనుకుంటూ ఇళ్ళకు చేరాం.  

------------------------------------------------------------------------------------------------------------

Tuesday, October 9, 2012

చందమామ రావె..


 వాడ్రేవు పతంజలి స్మారక కథలపోటీలో బహుమతి నందుకున్న కథ.
రచన ఇంటింటిపత్రిక ఫిబ్రవరి, 2002 పత్రికలో ప్రచురించబడింది.
కన్నడభాషలోకి అనువదించబడి, అనువాద కథలపోటీలో ప్రథమబహుమతి నందుకున్నది.
చదివి మీ అమూల్యమయిన అభిప్రాయాలు చెపుతారు కదూ..









రచన ఇంటింటిపత్రిక సౌజన్యంతో...

----------------

Monday, October 1, 2012

ఏ వయసుకా ముచ్చట


 జూలై 2012
నది మాసపత్రికలో ప్రచురించబడిన పోస్టుకార్డు కథ..
పోస్టుకార్డు మీద రాసే కథలపోటీ పెట్టారు నది మాసపత్రికవారు. సరిగ్గా కార్డుకు సరిపడా మాత్రమే వుండాలి. చిన్న ప్రయత్నం చేసాను. సాధారణప్రచురణకి నోచుకుంది. ఇట్టే చదివేసి మీ అభిప్రాయం చెపుతారుకదూ...


















నది మాసపత్రిక సౌజన్యంతో...