Pages

Monday, March 25, 2013

కాపురం అంటే ఇదీ...







       రంజిత అందమైంది, తెలివైంది, చురుకైంది, శ్రీమంతురాలూ కూడానూ. అందుకనే మరి రెండో ఆలోచనే లేకుండా వెంఠనే పెళ్ళి కొప్పేసుకున్నాడు రణధీర్.
అప్పటిదాకా ఉన్న ఊరు వదిలి ఒక్కతీ బైటకి వెళ్ళని రంజితని కాపరానికి రాగానే హోటల్ కి తీసికెళ్ళేడు. అక్కడ పదార్ధాలన్నీ బల్లమీద ఒకచోట లైన్ గా పెట్టి ఉన్నాయి. తినడాని కొచ్చినవాళ్లందరూ వాళ్ళంతటవాళ్ళే అక్కడ దొంతరగా పేర్చిన ప్లేట్లు ఒక్కొక్కటీ తీసుకుని, ఒక్కొక్క అయిటమూ చూసుకుంటూ వడ్డించుకుని, టేబిల్ దగ్గరికి తెచ్చుకుని కూర్చుని తింటున్నారు. రంజిత ఆశ్చర్యపోయింది. ఎప్పుడైనా ఏదైనా ఊరు వెళ్ళినప్పుడు తండ్రి భోజనానికి హోటల్ కి తీసికెడితే, హాయిగా సోఫాల్లో కూర్చుంటే టేబిల్ మీద మొత్తం అన్నీ తెచ్చి వడ్డించేవాడు సర్వర్. అలాంటిది ఇలా ఎవరికి వారే తెచ్చుకోవడమేంటని అడిగింది రణధీర్ ని.
ఏమీతెలీని రంజితకి వివరంగా అన్నీ చెప్పేడు రణధీర్.                       
"చూడు రం..(ముద్దుగా రంజితని అలాగే పిలుస్తాడు రణధీర్..అలా ఒద్దు..ఆ పేరు నాకు నచ్చదన్నా అలా పిలుస్తేనే నాకు బాగుంటుంది అంటాడు..అంతేకాదు..రంజితకి కూడా తన పేరుని ఆమె కిష్టమైనట్టు పిల్చుకునే స్వాతంత్ర్యం కూడా ఇచ్చేసేడు. కాని ఏవిటో..ఇంకా రం అతనిని ఏవండీ..అనే పిలుస్తోంది). దీన్ని బఫే అంటారు. మీ ఊళ్ళో హోటల్ లో లాగ ఇక్కడ అన్నీ పట్టుకొచ్చి వడ్డించెయ్యరు. అక్కడ వాళ్ళు ఏం వడ్డిస్తే అదే తినాలి.  అందరికీ అన్నీ ఇష్టముండవు కదా..అక్కడ కన్న ఇక్కడ అయిటమ్సూ ఎక్కువుంటాయి. ఎవరికేది కావలిస్తే వాళ్ళు అది ఎన్నిసార్లైనా వెళ్ళి తెచ్చుకోవచ్చు. అందుకని ఇష్టమైనవే తినే ఛాన్సు ఇక్కడే ఎక్కువన్న మాట.”
రణధీర్ చెప్పింది శ్రధ్ధగా వింది రంజిత.
భోజనమయ్యేక కాఫీ అడిగితే ఒక ట్రేలో కెటిల్ లో డికాషన్, విడిగా పాలు, పంచదార, ఖాళీకప్పులూ తెచ్చేడు. రణధీర్ మళ్ళీ క్లాస్ తీసుకున్నాడు.
"చూసేవా.. కొంతమంది డికాషన్ ఎక్కువ వేసుకుంటారు. కొంతమంది పాలు ఎక్కువేసుకుంటారు. వాళ్ళిష్టమొచ్చినట్టు వాళ్ళు కలిపేసింది మనం తాగక్కర్లేకుండా మన టేస్ట్ కి కావలసినట్టు తాగొచ్చన్నమాట."
    అంతేకాకుండా సెల్ఫ్ సర్వీస్ అంటే ఏవిటో చాలా వివరంగా చెప్పేడు. బైటకెళ్ళినప్పుడు స్లాట్ లో డబ్బు ఎలా వేసి, కూపన్ తీసుకోవాలో, ఆ కూపన్ తో కాఫీ మెషిన్ నుంచి కాఫీ, టీ ఎలా తీసుకోవాలో దగ్గరుండి చూపించేడు. తను స్వయంగా దగ్గరుండి గుడికి వెళ్ళినప్పుడు అర్చన కోసం కూపన్ ని రంజిత చేతే తీయించేడు. మురిసిపోయింది రంజిత.
అంతే కాదు..రంజితకి ఇంకా చాలా నేర్పేడతను. ముఖ్యంగా కంప్యూటర్ ఎలా వాడాలో నేర్పించేడు. ఆన్ లైన్ లో ఫోన్ బిల్లులూ, పవర్ బిల్లులూ ఎలా కట్టాలో చెప్పేడు. ట్రైన్ టికెట్లూ, బస్ టికెట్లూ ఎలా కొనాలో చూపించేడు. ఆఖరికి సినిమా టికెట్లు కూడా కంప్యూటర్ లో కొనడం మరీ నచ్చేసింది రంజితకి.
ఎంతో చురుకైన రంజిత అన్నీ అట్టే నేర్చేసుకుంది.
 అంతేకాదు తనెంత తెలివైనదో రణధీర్ కి తెలియడం కోసం ఒకరోజు ఆన్ లైన్ లో చీరలు కొంటోంది. ఇంకోరోజు సినిమా టిక్కెట్లు కొంటోంది. రెండు మూడు సోషల్ నెట్ వర్కుల్లో అక్కౌంట్లు పెట్టేసుకుంది.  రణధీర్ స్నేహితులందరితో ఎంతో చనువుగా ఆన్ లైన్ లో చాటింగ్ చెసేస్తోంది.
రం తెలివితేటలకి ముగ్ధుడైపోయేడు రణధీర్. అందిస్తే అల్లుకుపోయే ఆమె చాకచక్యం చూసి ఆమెని భార్యగా ఎన్నుకున్నందుకు తన తెలివితేటలకి తనకి తనే అభినందించేసుకున్నాడు.
  ఆ రోజు రణధీర్ ఆఫీస్ నుంచి ఇంటికొచ్చేటప్పటికి కంప్యూటర్ ముందు కూర్చుని సీరియస్ గా ఆన్ లైన్ షాపింగ్ చేసేస్తోంది రంజిత.
"రం..ఆకలేస్తోంది. భోంచేద్దారా.." ప్రేమగా పిలిచేడు.
"ఓహ్..రణ్..నేను తినేసేను. నీకు ఆమ్లెట్ వేడిగా ఉండాలి కదా. ఫ్రిజ్ లో ఎగ్స్ ఉన్నాయి.. వేడిగా వేసేసుకో. ఉడికిన పప్పు ఫ్రిజ్ లో కప్పులో అట్టిపెట్టేను. కాస్త చింతపండు పులుసు కలుపుకుని నీకు కావల్సినట్టు పోపు ఎక్కువగా వేసుకో.. నీకు జీలకర్ర బాగా వేగితే ఇష్టం కదా.. అలా చేసేసుకో. నాకు అది నచ్చదు. అందుకే తినలేదు. నీకు సెల్ఫ్ సర్వీస్ ఇష్టం కదా. తొందరగా తినేసి రా.. ఇక్కడ నీ ఫ్రెండ్ చైతూ చాటింగ్ లోఉన్నాడు.."
రం మాటలకి రణధీర్ వంటింటికీ డైనింగ్ టేబిల్ కీ మధ్య నిశ్చేష్ఠుడై నిలబడిపోయేడు.

-------------------------------------------------------------------------------------

చిత్రం--గూగులమ్మ సౌజన్యంతో...


                                                                                      

18 వ్యాఖ్యలు:

శ్యామలీయం said...

భలే.
చం.చదవన్నేర్తురు పూరుషుల్ బలెనె శాస్త్రంబుల్ పఠింపించుచో
నదమన్నేర్తురు శత్రుసేనల ధనుర్వ్యాపారముల్ నేర్పుచో
నుదితోత్సాహము తోడ నేలగలరీ యుర్విన్ బ్రతిష్ఠించుచో
ముదితల్ నేర్వగరాని విద్య గలదే ముద్దార నేర్పించినన్.

చెప్పాలంటే...... said...

baavundi andi :)

జలతారు వెన్నెల said...

మీరు కథే రాసారో, నిజ జీవితంలో అనుభవం రాసారో తెలీదు కాని, నాకు అచ్చం ఇలాంటి కాపురం ఒకటి తెలుసు. :)

జలతారు వెన్నెల said...

మీరు కథే రాసారో, నిజ జీవితంలో అనుభవం రాసారో తెలీదు కాని, నాకు అచ్చం ఇలాంటి కాపురం ఒకటి తెలుసు. :)

Zilebi said...


జిలేబి ల'సొరాజ్జెం' జిందా బాద్ !

చీర్స్
జిలేబి

మాలా కుమార్ said...

అహా ఏమి కాపురం ఏమి కాపురం బహు సొగసుగా వుంది :)

చాతకం said...

>> రంజిత అందమైంది, తెలివైంది, చురుకైంది, శ్రీమంతురాలూ కూడానూ.
అయినా రణధీర్ అడ్డంగా బుక్కయ్యాడుగా ;)
కధలో నీతి ఏమిటంటే ఎలాంటి అమ్మాయిని చేసుకున్నాగానీ బుక్కవటం ఖాయం ;) విధి రాత ఎవ్వరూ తప్పించుకోలేరు.

Unknown said...

I like this!

Lakshmi Raghava said...

ippati కాపురం మరి!
బాగుంది ..అప్పుడప్పుడు ఇలా జలక్ లు ఇస్తూ వుండండి

శ్రీలలిత said...


శ్యామలీయంగారూ...
ఎంత గొప్పగా చెప్పేరండీ. మీ భలే కి నా సరే...

చెప్పాలంటే గారూ,
ధన్యవాదాలండీ..

జలతారు వెన్నెలగారూ,
కథలు వచ్చేవి జీవితంలోంచే కదండీ...

శ్రీలలిత said...


జిలేబిగారూ,
మీ జిందాబాద్ కి నా జోహార్లండీ...

మాలాకుమార్ గారు,
సొగసైన కాపురం చూడముచ్చట కదండీ.. :)

శ్రీలలిత said...


చాతకంగారూ, అంతేనండీ.. అమాయకురాలిని చేసుకుంటే వారికి ఏమీ చేతకాక బుక్కవుతారు. తెలివైనవారిని చేసుకుంటే ఇలా బుక్కవుతారు. అంతా విధి రాత.

Hima,
Thank you..

లక్ష్మీరాఘవగారూ,
నచ్చినందుకు ధన్యవాదాలండీ...

జ్యోతిర్మయి said...

తానొటి తలిస్తే...అని. బావుంద౦డి కథ.

Mauli said...

చివరి పేరా మళ్ళీ మళ్ళీ చదవాలనిపిస్తోంది అండీ. నవ్వి నవ్వి కళ్ళమ్మట నీళ్ళు వచ్చేలా ఉన్నాయి. రణధీర్ పెళ్లి చేసుకొన్నది అమాయకురాలిననే అండీ లలితా గారు. :)

రుక్మిణిదేవి said...

nice story ,,,nijamgaane navvu vachhindi chaduvutunnappudu..

ABS Rama Rao said...

కాపురం అంటే ఇదీ....
చదువు wisdom (సంస్కారం అన్న మాట అనువాదానికి సరిపోదేమో)ఇవ్వదు.ఇప్పుడు టెక్నాలజీ,ఉన్న పిసరంత సంస్కారాన్ని మంటగలిపేస్తోంది............... మంచి ఉదాహరణతో చెప్పారు.బాగుంది.
రామారావు.....బెంగుళుారు.

ABS Rama Rao said...

కాపురం అంటే ఇదీ....
చదువు wisdom ని(సంస్కారం అన్న మాట అనువాదానికి సరిపోదేమో)ఇవ్వదు.ఇప్పుడు టెక్నాలజీ,ఉన్న పిసరంత సంస్కారాన్ని మంటగలిపేస్తోంది............... మంచి ఉదాహరణతో చెప్పారు.బాగుంది.
రామారావు.....బెంగుళుారు.

శ్రీలలిత said...


రామారావుగారూ,
నా రచన మీకు నచ్చినందుకు ధన్యవాదాలండీ...