Pages

Thursday, October 29, 2015

లలితామహిళామండలి యిరవైరెండవ వార్షికోత్సవం






ఈ నెల 28న మా లలితామహిళామండలి యిరవైరెండవ వార్షికోత్సవం అత్యుత్సాహంగా జరిగింది.

వార్షిక నివేదిక సమర్పిస్తున్న కార్యదర్శిని భారతీప్రకాష్.



 

     ఎప్పటిలాగానే మా సభ్యులు ఈ సంవత్సరం కూడా కొన్ని పోటీలు నిర్వహించారు. వ్యతిరేకపదాలపై పోటీ పెట్టి సభ్యుల తెలుగు పాండిత్యాన్ని పరీక్షించి, బహుమతు లందించారు దుర్గ.
 
     మహాభారతం మీద సుమారు అరవై ప్రశ్నలవరకు సంధించి, భారతంలో యెవరి కెవరు యేవిధంగా బంధువులో, యెవరెవరికి యే దేవతలు యే అస్త్రాలు యిచ్చారో అనే ప్రశ్నలతో సభ్యులని మహాభారతంలోకి తీసికెళ్ళి, గెలిచినవారికి బహుమతులందజేసారు రాజ్యలక్ష్మి.
 
  సభ్యులందరూ ఉత్సాహంగా పోటీల్లో  పాల్గొన్నారు.
 
 
 
 
 
 
ఆపైన సభ్యులు కొందరు తమ ప్రతిభాపాటవాలను చాటుకున్నారు.
కమల చక్కటి కథను వినిపించారు.
 
 
 
దుర్గ అందరికీ అవసరమయే చక్కని కథను చెప్పారు.
 
 
రామలక్ష్మి నాటకం వేసినప్పటి అనుభవాలు చెపుతూ సహజనటి అనిపించుకున్నారు.
 
రాజ్యలక్ష్మి అందరూ ఆమోదించే తెలుగు సామెతలని గుర్తుచేసారు.
 
 
సుందరిగారు “కస్తూరి రంగ రంగా “ట్యూన్ లో దేవి మీద చక్కటి పాటను వినిపించారు.
 

భారతి బుధునిమీద కీర్తన పాడింది.




 సీతగారమ్మాయి, ఆస్ట్రేలియాలో వుంటుంది. వాళ్ళ అమ్మగారి ఫ్రెండ్స్ అయిన  మమ్మల్నందర్నీ కలవాలని సరదాగా వచ్చింది. చిలకలా వుంది. చక్కటి కీర్తన, భజన పాడింది.


   తర్వాత విద్యుల్లత, సరస్వతి, ఉమాసుందరి కలిసి “అన్నయ్య-టాబ్లెట్” అనే స్కిట్ వేసారు. తమ అన్నయ్య వదినని యెలా భ్రమలో పెట్టేస్తాడో అని ఆడపడుచులు వదినని వేళాకోళం చేసే ఈ స్కిట్ చాలా సహజంగా వుండి, అందరినీ ఆనందపరిచింది.
 
ఆ తర్వాత నేనూ, భారతీ కలిసి “సంసారంలో సంగీతం..” అనే స్కిట్ చేసాము.


 
 ఇంక అసలు విషయానికొస్తే.. ఇదిగో  చక్కటి విందుభోజనం.
 


 

 








 
 అన్నట్టు మా సభ్యుల గ్రూప్ ఫొటో ఇదిగో..
 
వచ్చిన గెస్ట్ లతో..
 
 
అందరం హాయిగా ఆరగించి, మళ్ళీ యెప్పుడు కలుసుకుంటామో అనుకుంటూ యిష్టం లేకుండానే యింటిదారి పట్టాం.
------------------------------------------------------------------------------------------------------------

 

6 వ్యాఖ్యలు:

Bharati said...

చాలా చక్కగా రాసావు, చిన్నక్కా!

జ్యోతి said...

చాలా బావుంది.. ఇందులో సుభద్ర వోలేటి వాళ్ల అమ్మ, అత్తగారు ఉన్నారు కదా.

Unknown said...

భలే ఉన్నాయి మీ మహిళామండలి కబుర్లు.. జ్యోతిగారు. సుభద్ర వోలేటి కాదు. సుభద్ర వేదుల అంటే నేనే. మా అమ్మా, అత్తగారు ఇద్దరూ ఉన్నారు.. :)

మాలా కుమార్ said...

మీ వార్షికోత్సవం కబుర్లు బాగున్నాయండి.అభినందనలు.

Zilebi said...

కార్యక్రమం, ఫోటోలు అన్నీ జిలేబి మయం గా ఉంది :)

'తిండి' వంటలు, పిండి వంటలు నోరూరిస్తున్నాయి !

వార్షికోత్సవము అనగా ఇటులనే ఉండవలె(భుక్తాయాసం!)

శుభాకాంక్షల తో

జిలేబి

psm.lakshmi said...

బాగు బాగు, బహు బాగు