Pages

Wednesday, November 6, 2013

లలితా మహిళామండలి 20 వ వార్షికోత్సవము..



1993 లో మొదలుపెట్టిన మా లలితామహిళామండలి ఈ సంవత్సరం యిరవైయ్యవ వార్షికోత్సవము సంబరంగా జరుపుకుంది. ఒకరోజు మదిలో మెదిలిన ఆలోచన అప్పటికప్పుడు రూపు దిద్దుకుని మహిళామండలిగా అవతరించింది. యెంతమంది స్నేహితులో..యిన్ని సంవత్సరాలలో ఒకరి దగ్గరినుంచి మరొకరం యెన్ని నేర్చుకున్నామో. యెంత కలిసిపోయామో.
     
 ఈవిడే రాజ్యలక్ష్మిగారు. వీళ్ళింట్లోనే అందరం "రారండోయ్.. మహిళల్లారా రారండోయ్.." అంటూ గుమిగూడాం.
 




ఈసారి మా డ్రెస్ కోడ్ కలర్ బ్లూ..అందుకే ఆరోజు ఆకాశంలోని మేఘాలన్నీ అక్కడే గుమిగూడాయా అన్నట్టుంది.
 యెప్పటిలాగే ఇప్పుడు కూడా మాలో మేము పోటీలు పెట్టుకున్నాము. ఒకటైతే పూర్తిగా అదృష్టం మీద గెలుచుకునేది. మరొకటైతే తెలుగుభాష మీద ఆధారపడింది. ఇలాంటి పరీక్షలు ఇవ్వడంలో ఈ రాజ్యలక్ష్మిగారే దిట్ట.





చూసారా.. అందరూ యెంత దీక్షగా పోటీపడి సమాధానాలు వ్రాసేస్తున్నారో..








ఇంకో అసలు మాటుందండోయ్..

ఈసారి మేం డ్రామా కూడా వేసేసాం..
మామూలుగా రేడియోకి అందరం కలిసి వెళ్ళి కదంబ కార్యక్రమాలు యిస్తూనేవుంటాం. కాని ఈసారి స్టేజ్ మీద వెయ్యాలని అనుకున్నాం. అనుకోడమే తడవు.. అందరూ యెంత ఉత్సాహపడిపోయేరంటే.. వాళ్ళు చిన్నప్పుడు స్కూల్ లో, కాలేజ్ లో వేసిన నాటకాలు, డాన్సులు అన్నీ మళ్ళీ గుర్తు తెచ్చేసుకున్నారు. అందరం సీనియర్ సిటిజన్లమే.. కాని వయసు మా శరీరానికే కాని మనసుకి కాదని నిరూపించేసి, డ్రామా బ్రహ్మాండంగా వేసేసారు మా సభ్యురాళ్ళు.
ఇదిగో. ఈ ఫొటోలో వున్నవాళ్ళే.. డ్రామా రాసినవాళ్ళూ, వేసినవాళ్ళూనూ.



                                        ఆపై యెంచక్కటి విందుభోజనం. 



అందరం తలొకరకం చేసుకుని, ఒక దగ్గర పెట్టుకుని, చూసి మురిసిపోయి, తిని తరించిపోయి, యెలా వుందంటే బాగుందనుకుంటూ, యెలా చేసేరంటే రెసిపీలు చెప్పేసుకుంటూ యెప్పటికన్నా ఓ ముద్ద యెక్కువగానే లాగించేసేం. హిహి.





                     చీఫ్ గెస్ట్ తో లలితా మహిళామండలి ప్రెసిడెంటు, సెక్రటరీ..


                                                            కొంతమంది అతిథులు. 








                                                              


                                                     తర్వాత బహుమతి ప్రదానోత్సవం. 

















                                              అవండీ మా వార్షికోత్సవ ఫొటోలు..


అతిథులుగా వచ్చిన కుర్రపిల్లలు అబ్బురపడేట్టుగా ఆడీ, పాడీ సాయంత్రం దాకా కాలక్షేపం చేసుకుని, "పోదామా..యిక పోదామా.."అనుకుంటూ యిళ్లకి చేరాం. 

------------------------------------------------------------------------------------------------