Pages

Wednesday, April 1, 2015

అంతర్జాతీయ మహిళాదినోత్సవం


మార్చి పదిహేడు, మంగళవారం మా లలితామహిళామండలి సభ్యులం అందరం అంతర్జాతీయ మహిళాదినోత్సవం జరుపుకున్నాం. మా సభ్యులలో ఒకరైన రత్న ఆరోజు మాకందరికీ వేదిక యేర్పాటు చేసి, మంచి విందుభోజనం అందించారు. ఈవిడే ఆ గృహలక్ష్మి రత్న..




      అందరికీ రాగానే వెల్కమ్ డ్రింక్ లు. తర్వాత పలకరింపులు. ప్రతిఒక్కరూ వారికిష్టమైన విషయం గురించి అయిదేసి నిమిషాలు మాట్లాడాలని ముందరి మీటింగ్ లోనే చెప్పేసుకున్నాం కనుక ఒక్కొక్కరే చెప్పడం మొదలుపెట్టారు.


   ముందుగా  కమల  యేడుకొండల వెంకటేశ్వరస్వామికి  శంఖు చక్రాలు విగ్రహంలో కలిసి లేవంటూ, తర్వాత అవి ఆభరణాలుగా యెలా అమిరాయో చక్కటి కథను చెప్పారు.

 

 


 

 
       తర్వాత శారద ఇంటి ఆర్ధికపరమైన వివరాలు మహిళలందరూకూడా తెలుసుకుని వుండాలనీ, ముఖ్యంగా బాంకు లావాదేవీలు యెలా చెయ్యాలో అవగాహన కలిగి వుండడం మంచిదనీ అందరికీ ఉపయుక్తమైన విషయాలు చెప్పారు.


  
                                   ఇంక సీత. మంచిజోకులు చెప్పి అందరినీ నవ్వించేసారు.
 
 

      ఈవిడే రామలక్ష్మి. ఆవిడకి పన్నెండేళ్ళకి పెళ్లయిందిట. అప్పటి పెళ్ళిసందడులూ, పల్లకీలో ఊరేగింపులూ గుర్తు చేస్తూ, అప్పటికీ యిప్పటికీ  పెళ్ళిళ్ళు చేయడంలో వచ్చిన మార్పుల గురించి చక్కగా చెప్పారు.



 

 

        మరింక విద్యుల్లత. మహిళకు గల ఒక్కొక్కపేరుకూ చక్కటి అర్ధం చెపుతూ, చక్కటి కవితను యెంతో హృద్యంగా చదివారు.


      
                               ఈవిడ సరస్వతి. దేవి మీద స్తోత్రం చదివి వినిపించారు.

 
      ఆ తర్వాత కళ్యాణి. చిన్నతనంలోనే పెళ్ళి చేసుకుని, భర్త ఉద్యోగరీత్యా ఊళ్ళు తిరుగుతూ  లోకాన్ని పుస్తకాలనీ చదువుతూ, ఉత్సాహంగా కొత్త విషయాలు నేర్చుకుని, ఆ నేర్చుకోవడంలో భాగంగా యోగా కూడా నేర్చుకోవడమే కాకుండా అది అందరికీ కూడా నేర్పే స్థితికి వచ్చానని చెపుతుంటే మా అందరికీ యెంతో ఆనందం అనిపించింది.
 
      ఇంక మరి ఈవిడ సుందరి. ఇదివరకు రోజుల్లో యింట్లోకి ఒక వస్తువు అమర్చుకుందుకు యెన్ని ప్రణాళికలు వేసుకునేవారో చెపుతూ, ఆ వస్తువు యిల్లు చేరినప్పుడు పిల్లలతో సరిగ్గా ఆ  సంతోషాన్ని ఆస్వాదించిన బంగారురోజులని అందరికీ గుర్తు చేసారు.
            ఈవిడ దుర్గ. ఈరోజుల్లో మొబైల్ ఫోన్లు పిల్లలు వాడడంలో గల సాధకబాధకాలు చెపుతూ, మా అందరికీ తెలియని చాలా విషయాలు అంటే వాటివల్ల కలిగే ఉపయోగాలూ, భౌతికంగా కలిగే నష్టాలూ కూడా చెప్పారు.
      మరింక రాజ్యలక్ష్మి. ఈవిడ ఉదయం లేచిన దగ్గర్నుంచీ చదివే పేపరూ, పుస్తకాలలో వున్న విషయాలు బాగా ఆకళింపు చేసేసుకుంటారు. ఆ పధ్ధతిలోనే ఆడవారి మెదడులో వుండే జ్ఞాపకశక్తి మగవారి మెదడులో కన్న యెక్కువ వుంటుందని చెప్పి మమ్మల్ని విజ్ఞానవంతుల్ని చేసారు.
 
     ఈవిడ లక్ష్మీ ఆచార్య. పిల్లలు పెరుగుతున్నప్పుడు తల్లి వాళ్లమీద యెంత శ్రధ్ధ పెట్టాలో సోదాహరణంగా వివరించారు.

 
 
                   మరింక శారదగారు. వృధ్ధులయిన చెవిటి భార్యాభర్తల సంభాషణను చక్కగా నటిస్తూ చెప్పి మా అందరినీ నవ్వులలో ముంచెత్తారు.
 
 
     ఇప్పుడు, అందరికీ ఆత్మీయంగా ఆతిధ్యమిచ్చిన రత్న ఈమధ్య జరిగిన ఇండియన్ డాటర్ మీద వచ్చినవ్యాఖ్యలను చక్కగా విమర్శించారు.

      ఈవిడే ఉమాసుందరి. పిల్లల్ని ప్రయోజకులని చెయ్యవలసివచ్చినప్పుడు ఇంత్లో తల్లి యెంత ఓర్పుతో వుండాలో చెప్పారు.


      ఇంకిప్పుడు భారతి. తను పెళ్ళై కొత్తగా కాపురం పెట్టినప్పుడు జరిగిన ఉగాది ఉదంతం గురించి చెప్పి అందరినీ ఆహ్లాద పరిచింది.
 


       ఇంక నేను. మన హక్కుల్ని మనం యెలా కాపాడుకోవాలో సంగ్రహంగా చెప్పాను. (వివరంగా చెపితే యెవరూ వినరుకదా..)


 

      ఈమె దుర్గ. ఇదివరకు మా మహిళామండలిలో మెంబరే. పిల్లల చదువుల ధ్యాసలో పడి ఈ మధ్య రావడం కాస్త తగ్గించింది. మొన్న నాగార్జునమీలో యెవరు కోటీశ్వరుడుషో లో Rs. 6,40, 000 గెలుచుకుంది. ఇవాళ ఆ అనుభవాలన్నీ మాతో సరదాగా పంచుకుంది.



    అయిదురోజులపాటు ఉదయం యేడున్నరకల్లా వెళ్ళి మనవంతు వచ్చేదాకా వేచి చూస్తుండాలిట. చాలా ఓపిక కావాలి కదా..    మనం ఆ షో చూస్తుంటే ఆడేవారితో కూడా వచ్చినవాళ్ళు కూడా ఎదురుగానే కూర్చున్నట్టుఉంటారు కదా.. అలా కాదుట.. వాళ్ళూ వీళ్ళూ అసలు ఒకరికొకరు కనపడరుట.. భలే కదా.. ఇలాంటి విషయాలెన్నో చెప్పింది.
 
 

   మరింక మనందరికీ చాలా ఇష్టమైన విషయానికొచ్చేస్తే… అదేనండీ.. పసందైన విందుభోజనం..


మామిడికాయపప్పు, గుత్తివంకాయకూర, మామిడికాయ కొబ్బరికాయ పచ్చడి, ధప్పళం, పులిహార, బొబ్బట్లు, ఆవడలు, అబ్బ.. ఇంక టైపు చెయ్యలేనుగానీ మీరే చూసెయ్యండి.

 
 
 


 
 
 


         


    హమ్మయ్య.. ఓ పెద్ద పనైపోయిందికదా అని ఆయాసపడుతుంటే భారతి ఓ పరీక్ష పెట్టింది. ఇదివరకు అస్తమానం మా సభ్యులకి పురాణాలమీద, తెలుగు భాషమీద పరీక్షలు పెట్టేస్తున్నారని ఈసారి టీవీ లో వచ్చే ప్రకటనలమీద పరీక్ష పెట్టింది. ఆహా.. యెంత వీజీనో అనుకున్నామా.. అబ్బే.. చాలా కష్టమండోయ్.. రోజూ అవి చూస్తున్నా సరే అవి యే కంపెనీవో మనకి గుర్తుండదు.
“మసాలా అమ్మ ఎవరు..” అనడిగింది. అదే కంపెనీయో ఎవరికీ గుర్తు రాదే.. కొంతమంది ఒకరికొకరు చూపెట్టేసుకున్నారు...ఇదిగో ఇలాగ ..



 
 
 
 

                            అబ్బ.. ఎంత సీరియస్ గా రాసేస్తున్నారో చూసేరా..

 
 

 

 
 
కొంతమంది కాపీలు కూడా కొట్టేస్తున్నారండోయ్..


 
 

         మొత్తానికి పదికి మూడు పాసుమార్కులతో నాకు ఫస్ట్ ప్రైజు, సీతకి సెకండ్ ప్రైజు వచ్చాయి.. హ హ..
 
 
 
 

    
   ఇదిగో ఇదేనండీ మా జట్టు…
 
 
       ఆ తర్వాత ఒక రౌండ్ తంబోలా ఆడుకుని, వేడిగా ఫిల్టర్ కాఫీ తాగి, సాయంకాలానికి ఇళ్లకి చేరుకున్నాం.

     అవన్నమాట మహిళాదినోత్సవ సంబరాల విశేషాలు..
_____________________________________________________________________
 
   

 

Tuesday, January 27, 2015

లలితా మహిళామండలి మీటింగ్



 
      జనవరి ఇరవైయారున  లలితా మహిళామండలి మీటింగ్ మా సభ్యురాలు దుర్గగారింట్లో జరిగింది. అందరికీ ఆహ్లాదంగా ఆహ్వానం పలికారు ఆవిడ. ప్రోగ్రామ్ అంతా చాలా చక్కగా ప్లాన్ చేసారు దుర్గ.

 
   అందరం మధ్యాహ్నం మూడుగంటలకల్లా వాళ్ళింటికి చేరిపోయాం.  మా ఫ్రెండ్స్ అందరినీ పరిచయం చేద్దామని జ్ఞానప్రసూనగారిని రమ్మన్నాను. ఆవిడ ఠంచనుగా టైమ్ కి వచ్చేసారు.
     ఈసారి ప్రోగ్రామ్ లో హైలైట్ ఏమిటీ అంటే దుర్గ మా అందరకూ మంచిమాట చెప్పిద్దామనే ఉద్దెశ్యంతో ప్రొఫెసర్ సులోచనగారి ప్రసంగాన్ని ఏర్పాటు చేసారు. ఆవిడ ఎంతో హుందాగా, చక్కగా, సరళంగాస్వఛ్ఛభారత్..” గురించి వివరించారు. మనందరికీ స్వఛ్ఛమైన భారత్ కావాలీ అంటే మహిళలే దానిని సాధించగలరని చెప్పారు.  ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా దీనిమీద బాగా స్పందిస్తున్నాయనీ, వాటి సహాయంతో మహిళలు దీనిని సాధించవచ్చనీ మమ్మల్ని ఉత్తేజపరిచారు. సభ్యులందరూ వారి వారి అనుభవాలను ఆవిడతో పంచుకున్నారు.
 
 
 
 

 
 
 
 
 
      స్వఛ్ఛభారత్ గురించి చర్చించుకున్నాక దుర్గ మాకందరికీ ఎంచక్క రవ్వలడ్డూలూ, సేమ్యా ఉప్మా, సగ్గుబియ్యం,అటుకులుతో చేసిన మిక్స్చరూ పెట్టి, తియ్యటి చెరుకురసం ఇచ్చారు. రుచి అదుర్స్.
 
     ఆ తర్వాత అందరం వాళ్ళింటి వెనకాలవున్న తోటలోకి వెళ్ళాం. అక్కడ మామిడి, పనస, కోనసీమకొబ్బరిచెట్లులాంటివన్నీ చూసి, బోల్డు కబుర్లు చెప్పేసుకున్నాం.
 
 
 
 

 
 
 
             అక్కడే దుర్గ మాకందరికీ ఒక క్విజ్ పెట్టారు. అబ్బో.. పురాణాలు, గ్రంథాలనుంచీ నేటి సినిమాల దాకా ప్రశ్నలు ఉన్నాయందులో. మేమేమైనా  తక్కువ తిన్నామా.. పబ్లిక్ పరీక్షకన్నా సీరియస్ గా జవాబులు రాసిపడేసాం 
  అందులో ఫస్ట్ ప్రైజ్ గాయత్రిగారికి,
 
 
 
సెకండ్ ప్రైజ్ జ్ఞానప్రసూనగారికి వచ్చింది.



       అన్ని ఆటలూ గట్రా అయ్యాక, తర్వాత మీటింగ్ ఎప్పుడో, ఎక్కడో చెప్పుకుని ఆ కబుర్లనే తల్చుకుంటూ ఇళ్ళు చేరాం. బాగున్నాయా మా మీటింగ్ విశేషాలు..
 
-------------------------------------------------------------------------
 
 
 
 
 
 
 

Monday, December 29, 2014

2014 బుక్ ఫెయిర్ లో ప్రమదాక్షరి & జె.వి.పబ్లిషర్స్ స్టాల్..


 

    
    పండగంటే అందరికీ సంబరమే..అందులోనూ పుస్తకాలపండగంటే సాహితీప్రియులకు విందుభోజనమే. అటువంటి పుస్తకాలపండగ 2014 బుక్ ఫెయిర్..ఈ సంవత్సరం డిశంబరు 17 నుంచి 26 వరకు ఇందిరాపార్కు ఎదురుగావున్న ఏన్.టి.ఆర్. స్టేడియంలో ఘనంగా నిర్వహించబడింది. ఆ.. ఇదంతా ప్రతియేడూ జరిగేదే కదా.. ఏవుంది..మహా గొప్ప.. అంటారా.. ఉందండీ.. ఉత్తి గొప్పే కాదు. చాలా గొప్పవిషయమే ఉంది.
    సామాజికమాధ్యమం ముఖపుస్తకం గురించి అందరికీ తెలిసిందే.. అదేనండీ..Facebook. అందులో సభ్యులవడం వలన కొంతమంది సమయం వృథా అవుతుందని భావిస్తే, అందులో సభ్యులమయి సమయాన్ని సద్వినియోగం చేసుకున్నవాళ్లం మేము. 
   ఒక అగ్గిపుల్ల ఉందనుకోండి. దాని  వల్ల వచ్చే వేడిని దేవునిదగ్గర దీపం వెలిగించుకుందుకూ వాడొచ్చు, అందరికీ కడుపునిండేలా వంట చేయడానికీ వాడొచ్చు, ఇంకా తీవ్రంగా ఆలోచించేవాళ్ళు ఇల్లు తగలబెట్టడానికీ వాడొచ్చు. మేము అంటే మా ప్రమదలందరం ఆ వేడితో అక్షరజ్యోతిని వెలిగించుకున్నాం. అదే “ప్రమదాక్షరి..”
  అక్షరం అంటే ఆసక్తిగల కొంతమందిమి ఫేస్ బుక్ ద్వారా ఒకరినొకరం పరిచయం చేసుకుని, మాధ్యమంద్వారానూ, వీలున్నవాళ్ళు వ్యక్తిగతంగానూ ఒకటికిరెండుసార్లు కలుసుకొని, ఒకగ్రూప్ గా యేర్పడదామని ఆలోచించుకుని, ఏర్పరచుకున్నదే ఈ “ప్రమదాక్షరి..”. ఇందులో సాహితీప్రియులయిన రచయిత్రులూ, విమర్శకులూ, పాఠకురాళ్ళూ అందరూ సభ్యులే.
ఈ ప్రమదాక్షరికి అడ్మిన్ లుగా మంథా భానుమతి, సమ్మెట ఉమాదేవి బాధ్యతలు నిర్వహిస్తున్నారు.


    అలా కథలగురించీ, విమర్శలగురించీ మాట్లాడుకుంటూ, “మాలిక” అంతర్జాలపత్రిక సంపాదకురాలు జ్యోతి వలబోజు కి కలిగిన ఆలోచన ఫలితంగా ఆ సభ్యుల్లో 24 మందిమి తండ్రి-తనయ..” అనే ఒకే కాన్సెప్ట్ మీద విభిన్నకోణాల్లో 24కథలు వ్రాసాము.  చెప్పుకోవలసిన విషయం యేమిటంటే ఆ సభ్యుల్లో కొందరు అప్పటిదాకా పాఠకురాలైనవారు కూడా రచయిత్రులుగా మారి ఈ విషయంమీద స్పందించి చక్కటి కథలను వ్రాసారు. ప్రతి కథకూ మంథా భానుమతి విశ్లేషణ వాటికి మరింత అందం చేకూర్చింది.
    వాటినన్నింటినీ మాలిక పత్రికలో ప్రచురించడమే కాకుండా, ఈ యేడే పబ్లిషింగ్ మొదలుపెట్టిన జ్యోతి వలబోజు అందరి సమిష్టికృషితో వాటినన్నింటినీ ఒక పుస్తకంగా తీసుకువచ్చింది.
                                 ఈవిడే జే.వి.పబ్లీషర్స్ అధినేత్రి జ్యోతి వలబోజు.



    ప్రతి ఒక్కరికీ వారి కథ ఒక కథాసంకలనంలో చోటు చేసుకుందంటే ఎంత సంతోషమో.

అటువంటి మా ఈ సంతోషాన్ని పుస్తకప్రియులతో పంచుకుందామనుకున్నాము. అంతేకాకుండా రచయిత్రులే స్వయంగా ఎవరి పుస్తకాలు వారు ప్రదర్శించుకుని, పాఠకులతో నేరుగా సంబంధం పెట్టుకోవాలనే ఆలోచనతో జె.వి. పబ్లిషర్స్, రచయిత్రులూ కలిసి ఈ యేడు బుక్ ఫెయిర్  లో కలిసి తీసుకున్న స్టాల్  ప్రమదాక్షరి & జె.వి. పబ్లిషర్స్ స్టాల్.
                                                          ఇదిగో.. ఇదే..


                       ఉపోద్ఘాతమయిపోయింది కనుక ఇంక బుక్ ఫేర్ లోకి వెళ్ళిపోదాం.
 
                                    స్టాల్ ప్రారంభోత్సవ మహోత్సవం..




                                                   కాష్ కౌంటర్ లో  కన్నెగంటి అనసూయ..


         

                                  చేదోడు వాదోడుగా..మణి వడ్లమాని, నండూరి సుందరీ నాగమణి..



                   మీడియావారికి వారణాసి నాగలక్ష్మి చిత్రించిన "ప్రమదాక్షరి లోగో చూపిస్తున్న మంథా భానుమతి.
                          



                                     ఆరోజు అక్కడ వున్న "తండ్రి-తనయ" పుస్తక రచయిత్రులు..






                        సోమరాజు సుశీలగారిచే "తెలంగాణ వంటలు" పుస్తకావిష్కరణ ...

                         శీలా సుభద్రాదేవిగారిచే "తెలంగాణ వంటలు" పుస్తకావిష్కరణ ...


                               
         ముఖ్యంగా చెప్పవలసినదేమిటంటే ఈ ఉత్సవంలో భాగంగా 23 న కవయిత్రుల కవితాగోష్ఠి జరిగింది. స్వాతీశ్రీపాదవారి నిర్వహణలో, శిలాలోలితగారి అధ్యక్షతన, సుద్దాల అశోక్ తేజగారు ముఖ్య అతిథిగా, కన్నెగంటి అనసూయ వ్యాఖ్యానించిన ఈ గోష్ఠిని ప్రమదాక్షరి శీర్షికన నిర్వహించడం విశేషం.
 
 

                                    ఈ కవితాగోష్ఠిపై ఆంధ్రజ్యోతి పత్రికలో వార్త...
 


                                              ప్రమదాక్షరి  స్టాల్ లో రచయిత్రులు..
 
 

                  సరోజినిదేవి బులుసు, పోడూరి కృష్ణకుమారి, కె.బి. లక్ష్మి, శాంతసుందరి..
 
 
                                                  మధ్యన చాగంటి తులసి
 
 
                                             మీడియాతో జ్ఞానప్రసూనగారు...
 

                             మా స్టాల్ కు వచ్చి, మాతో కలిసిమెలిసి ముచ్చటించిన ప్రముఖులు...
                                        ఇంద్రగంటి జానకీబాల, శ్రీకాంత శర్మగార్లు..

 
                       షరీఫ్ వేంపల్లి, జంపాల చౌదరి, వాసిరెడ్డి నవీన్, అరిపిరాల సత్యప్రసాద్..

 






 

                          సుద్దాల అశోక్ తేజ, బొమ్మదేవర నాగకుమారి..
 
 
మన్నెం శారద, దాసరి అమరేంద్ర 
 
 
 
 
 
 
 


     పాఠకదేవుళ్ళు, అభిమానులు...
 
                                               వనజ, మంథెన ఝాన్సి, లక్ష్మీ వసంత..


                                                           వసంత లక్ష్మి..


 
 
 
                                 
 
Akkiraju with family 
 
Artist Lakshman
 
 
Balabhadrapatruni ramani
 
 
Chitra artist
 
 
Polkampalli Shanthadevi
 
 
P.S.Chary, Meher with family
 
 
Kandukuri Ramu
 
Yakoob Ravi
 
 
Vanaja Cee
 
 

 
 
 
 
 
 
 

 
 
 
 
 


 
 



 

 
 
 
 
 
 
                                       ఆఖరిరోజు కూడా అలసటే లేదు...
 
 
 
 
 
                                    ప్రమదాక్షరి స్టాల్ గురించి పత్రికలలో వార్తలు...
 
 
 
కొసరు ముచ్చట

     మహిళలం..మహరాణులం కాగలము... అన్నపూర్ణలమూ కాగలము.. అందుకే అక్కడికి వచ్చిన ప్రతి ప్రమద  అక్కడ కూర్చున్న తన తోటి ప్రమదల అలసట పోగొట్టడానికి వారికి తినడానికి యేదో ఒకటి చేసి తెచ్చింది.  ఎవరు ఏమి తెచ్చినా, ఎవరికి కాస్త ఖాళీ దొరికితే వారు అన్నీ అందరికీ నోటి దగ్గరికి తెచ్చి పెట్టేసారు. ఇది మన అందరిదీ అనుకుంటూ, అప్పుడే వచ్చిన జ్యోతి పుట్టినరోజుని కూడా బ్రహ్మాండంగా జరిపేసుకున్నారు. అదీ ఐకమత్యమంటే అని ప్రమదాక్షరి మహిళలు చాటి చెప్పారు.
           
                                           జయహో ప్రమదాక్షరి..
 
 
 
----------------------------------------------------------------------------------------------