Pages

Saturday, August 8, 2009

తప్పించుకోవచ్చు

ఇచ్చట ఉచితముగా సలహాలు ఇవ్వబడును.

సమయం: అన్నివేళలా ( మీరు క్యూలొ వున్నారు. దయచేసి వేచియుండండి.)

గమనిక: ఒకసారి తీసుకున్న సలహా వాపసు తీసుకొనబడదు.

హెచ్చరిక: ఎవరు చేసుకొన్న ప్రయోగానికి వారే బాధ్యులు.

మనవి: ఈ సలహాలు సరదాగా చదువుకుందుకు మాత్రమే వ్రాసినవి తప్పితే ఎవరినీ నొప్పించడానికి కాదు.



ఈ సలహా భార్యా భర్త లిద్దరికీ పనికొస్తుంది. ఎవరైనా స్నేహితులు కాని, బంధువులు కాని మనని ఏదైనా కొనమనో, లేదా మాట సాయం చెయ్యమనో మొహమాటపెట్టేస్తుంటారు. వాళ్ళ మీద మనకి నమ్మకం వుండదు. అలాగని మొహమ్మీద కాదనీ చెప్పలేము. అటువంటప్పుడు భార్య భర్త పేరు చెప్పీ, భర్త భార్య పేరు చెప్పీ ఆ ఆపద గట్టెక్కించుకొవచ్చు. ఎలాగంటే.. "లేదండీ,, మా ఆవిడకి ఇలాంటివి ఎందుకో ఇష్టముండవు.. మీకు తెలుసుగా..ఆవిడ కాదన్నది నేను చెయ్యలేను.. ఏమీ అనుకోకండి" అంటూ మగవారు, "లేదే.. ఇలాంటి ఇన్ స్టాల్ మెంట్లంటే మా వారికి ఇష్టముండదు. నీకు తెలుసుకదా" అంటూ ఆడవారు ఆ ఆపద తప్పించుకోవచ్చు.( ఏదో పెద్ద అక్కడికి వారు గీచిన గీత దాటనట్టు)

4 వ్యాఖ్యలు:

భావన said...

ఇది కూడా బాగుంది. 100% పక్కా

మధురవాణి said...

బావున్నాయండీ మీ ఉచిత సలహాలు. ఇలానే చెప్తూ ఉండండి :)

కొత్త పాళీ said...

This is a good one. However, the other party should be amenable to such protrayal.

తెలుగోడు_చైతన్య said...

అబ్బో లలితగారు బాగుందండి.. కాస్త మా గురించి ఆలోచించి చెప్పినందుకు ధన్యవాదాలు... తెలుగోడు.