జగత్తుకే ముద్దుబిడ్డ శ్రీకృష్ణుడు. ప్రతి తల్లీ తన కొడుకే కృష్ణుడన్న భావనలో మురిసిపోయి జోలపాటలు పాడుతుంది. ఇది అలాగ వ్రాసుకున్న పాటే..ఈ కృష్ణాష్టమి సందర్భంగా.
పల్లవి-- సిరిసిరి నవ్వుల చిన్ని కిశోరా
నవనీతచోరా నిద్దురపోరా //
చరణం--మా ఇంటి కృష్ణుడు తెల్లనమ్మా
మూసిన కన్నుల వెన్నెలమ్మా
దోబూచులతో దొంగాటలతో
అలసిన కృష్ణమ్మా జోలమ్మా--జొ లాలమ్మా//సిరినవ్వుల//
చరణం- నా గానమె తల్లి యశోద లాలిగా
నాదీవనె నీకు శ్రీరామ రక్షగా
నిదురించు ఒడిలోన వటపత్రశాయిలా
కోటి దీవెన లెన్నొ పాడతా జోలగా//సిరి సిరి//
#########################
8 వ్యాఖ్యలు:
కృష్ణాష్టమి శుభాకాంక్షలు.
నా కృష్ణాష్టమి టపాలు చూడండి
http://vijayamohan59.blogspot.com/2009/08/300.html
http://vijayamohan59.blogspot.com/2009/08/blog-post_8591.html
నట్ కట్ గోపాల్ ఎంత ముద్దుగా వున్నాడో .
కృష్ణాష్టమి శుభాకాంక్షలు
లలితా,
మీ కిట్టయ్య చాలా బాగున్నాడు.
మీ చిన్ని కృష్ణుడికి నా దృష్టే తగిలేట్టుందండీ ...
మీక్కూడా కృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు .
chaalaa baagaa raasaaru:) కృష్ణాష్టమి శుభాకాంక్షలు
లలితా, మీ క్రిష్ణుడు చో చో క్యూట్.. ముద్దొచ్చేస్తున్నాడోయ్.. మీకు కూడా క్రిష్ణాష్టమి శుభాకాంక్షలు
లలితా మీ పాట కూడా చాలా చక్క గా వుంది..
పాట నచ్చినందుకు అందరికీ ధన్యవాదములు..
Post a Comment