Pages

Wednesday, October 7, 2009

తుళ్ళిపడకే చేపపిల్లా....


మరువం ఉష ప్రారంభించిన జలపుష్పాభిషేకానికి చంద్రునికో నూలు పోగులా నా భావనలు అందిస్తున్నాను. ఆత్రపడే చేపపిల్లకు మామూలు మాటలతో నాలుగు మంచి మాటలు చెప్పాలనే ప్రయత్నమే ఇది.





తుళ్ళిపడకే చేపపిల్లా

నీ తుళ్ళింత లిక ఆపవే
ముందరున్న సంద్రమంతా
కడు లోతైన వింతే కదే...

ఇప్పుడిప్పుడే ఈతలు కొడుతూ
ఆత్రపడిపోకె అందంగా
సొరచేపలు పెదచేపలు నీకై
నోళ్ళు తెరచినవె మందంగా...


ఎగిరి ఎగిరి పైకెగరాలని నువు

ఎగిరి పడిపోకె కెరటంలా
నీలిమేఘాల ఆకసము
నీకందనిదే అది చిత్రంగా..



మెరుపు వెలుగుల తారలతో
జతకట్టాలని నువ్వనుకుంటే
అవి మెరిసి మెరిసి నిను మురిపించి
నిను లెక్కచైక మరి పోవునులే...


ఒడ్డునున్న పూబాలలను
ముద్దాడాలని నువ్వనుకుంటే
ఒడ్డుకొచ్చిన చిన్ని నిన్ను
మరి మనిషి చూస్తే ప్రమాదమే...


వేసేస్తారు వలలు మరి
పట్టేస్తారీ దుర్మార్గులు
పెడతారు నిను గాజుతొట్టెలో లేదా
దాచుకుంటారు భద్రంగా తమ కడుపులో....


పెంచుకోవే తెలివి బాగా

నేర్చుకోవే నేర్పులు

ఎవ్వరైనా ఎప్పుడైనా నిను
పట్టకుండా ఒడుపులు...

నీకు నీవే తోడు నీడా
నీకు నీవే ధైర్యము
నీకు నీవే సరియైన జోడు
నమ్మకు ఎవరిని లోకంలో....








॑॑॑॑॑॑॑॑॑॑॑॑॑॑॑॑॑॑॑॑॑॑॑॑॑॑॑॑॑॑॑



9 వ్యాఖ్యలు:

Bhãskar Rãmarãju said...

>>నమ్మకు ఎవరిని లోకంలో...
హ్మ్!!!
ఎవ్వర్నీ నమ్మకపోతే ఎలా చేపపిల్లా?

మరువం ఉష said...

తృళ్ళిపడనివ్వాలండి, ఎదురీదమనీ ఎదురు తిరగమనీ మరీ చెప్పాలి. ఆ సంద్రం దాని స్వంతం. కలిసి మెలిసి పెరగాలి, కావలిస్తే ఎగిసిపడాలి.

నా ప్రయత్నానికి మీరంతా ఇలా అందించిన సహకారం మాత్రం మాటల్లో చెప్పలేని ఆనందం. కృతజ్ఞతలతో... ఉష

శ్రీలలిత said...

అదే కదండీ చెప్పడానికి ప్రయత్నించాను. నేర్పులు, ఒడుపులు నేర్చుకుని ఎవరిమీదా ఆధారపడకుండా స్వతంత్రంగా ఉండమనే చెప్పాను

జ్యోతి said...

అందరూ మంచివారుకారు,తెలుసుకుని మసులుకోవే చేపపిల్లా!!

ఈనాటి పిల్లలు స్వతంత్రులై,ఎదురీదాలి...

సుభద్ర said...

wow lalita gaaru chaalaa bagumdi.

సుభద్ర said...

wow lalita gaaru chaalaa bagumdi.

మాలా కుమార్ said...

నీకు నీవే తోడు నీడా
నీకు నీవే ధైర్యం
అక్షర సత్యం .
బాగుంది మీకవిత .

జయ said...

చిన్నారి చేప పిల్లను పాపం, అంతలా భయపెట్టక పోతే కొంచెం ధైర్యం చెప్పి, లోకం లోకి పంపచ్హుకదా

jeevani said...

ఇలా కామెంట్లలో అసందర్భంగా దూరినందుకు ముందుగా క్షమించండి. దయచేసి ఒక్కసారి http://jeevani2009.blogspot.com/2009/10/blog-post_25.html ను సందర్శించండి పేరును సూచించండి ధన్యవాదాలతో, మీ జీవని.