Pages

Thursday, November 5, 2009

ఉషోదయంలో భూపాలరాగం







పల్లవి-- ఉషోదయంలో భూపాలరాగం
వసంత ఋతువున కోకిల గానం
మధుర మధురమో సుధా భరితమో
మాటల కందని దివ్య భావమో..// ఉషోదయంలో//

అనుపల్లవి--చివురులు మేసిన కోయిలా
బోసి నవ్వుల పసిపాపలా
మీటెను మనసును వీణలా
ఇక కురిసెను వెన్నెల వానలా..//ఉషోదయంలో//

చరణం-----అలసిన కన్నుల అలమేలుమంగలా
అలకలు తీరిన సత్యభామలా
రాముని చూసిన క్షణము సీతలో
కలిగిన వలపుల పులకరింతలా..


ఉషోదయంలో భూపాలరాగం
వసంత ఋతువున కోకిల గానం
మధుర మధురమో సుధా భరితమో
మాటల కందని దివ్య భావమో..//ఉషోదయంలో//






**********************************************************

5 వ్యాఖ్యలు:

మాలా కుమార్ said...

బాగుంది .

జయ said...

సత్యభామని, సీతని ఒకే పోలిక లోకి తీసుకొచ్చి, అందులోను భూపాళరాగంతో జత కట్టేసారు. రెండు విభిన్న ప్రకృతులను ఒక్క తాటికి తీసుకొచ్చిన మీ కవిత బాగుంది.

సుభద్ర said...

చరణ౦ చాలా బాగు౦ది..

భావన said...

బాగుందండి కవిత చదువుతుంటే
వసంత రుతువున తొలి వెకువన కురిసిన చిరు జల్లొకటి పొద్దుటే బయట పొడుకున్న మనను ఆదరా బాదరా గా లేపేసి ఇక చూడు వసంత అందాల తొలి వేకువ మహిమలు అని
వేప చెట్టు మీది కోకిల వినిపించే భూపాల రాగాలకు పొద్దుటే కసువు వూడ్చే చీపురు తోడు కలిపే రాగాలు..
చిరు వాన కు స్నానాలు కానించి మిగిలిన చుక్క బొట్ల తో సోకు చేసుకున్న సన్న జాజి తీగ, తన సుగంధాలను వీచే ప్రభాత గాలులతో కలిపి వినిపించే మలయ మారుత రాగాలు..
అటు గా వెళ్ళి తీగ ను కుదిపి మీదకు జల జలా రాల్చిన చినుకుల పూల వర్షానికి కల కల మన్న తమ్ముడి కేరింతలు..
అన్నిటిని గుర్తు చేసిన మధుర సుధా బరితమో.. మాటల కందని దివ్య భావమో మీ కవిత..

మరువం ఉష said...

ఊ మావూరు వదిలిన వసంతం మీ తావుల్లో దోగాడునుందన్న మాట ఇక? :) భలే...