
శారదాదేవిని నా స్వంత మాటలతో స్తుతించే భాగ్యం కలిగించినందుకు అందరికీ కృతఙ్ఞతలు. ప్రమదావనం లో చేర్చుకోండీ అని జ్యోతీగారి నడిగితే చేయి పట్టుకు లాక్కొచ్చి ఈ బ్లాగ్ లోకంలో కూలేసారు. అందరూ ఎన్నెన్నో రాసేస్తున్నారు. అంతా కొత్త. అహా రాసెయ్యొచ్చుకదాని నాకు తోచినవి రాసేస్తూపోయాను. కొన్నాళ్ళకి తెలిసింది. అలాకాదూ, మనవూ అందరివీ చదివి కామెంట్లు రాయాలీ, మనం రాసిన దాని మీద కామెంట్లు రాసిన వారికి జవాబు లివ్వాలీ అని. మరి కొన్నాళ్ళకి కవితల మీదకి దృష్టి పోయింది. ఇప్పుడు మరువం ఉష గారు పద్యం రాయడానికి ప్రయత్నించడం చూసి నేనూ ప్రయత్నించాను. ఆచార్య ఫణీంద్రులు దానిని సరిదిద్దారు. మీరూ చూసి ఎలా ఉందో చెప్పండి. ఆచార్య ఫణీంద్రులకు హృదయపూర్వక కృతఙ్ఞతలు బ్లాగ్ ముఖంగా తెలియచేసుకుంటున్నాను.
ఇది నేను వ్రాసిన మొదటి పద్యం ..
ఆచార్య ఫణీంద్రగారికి నమస్కారములు. చంపకమాల పద్యం ఎలా రాయాలో మీరు చెప్పాక ఒకసారి ప్రయత్నించి చూడాలనిపించింది. ఇది నా మొదటి ప్రయత్నం. తప్పులు చెప్పితే సరిదిద్దుకుంటాను. ధన్యవాదములతో, శ్రీలలిత.
జిలిబిలి జుంటి తుమ్మెదల జుమ్మను నాదపు గాన మాధుర్య
మొలికెడి తీపి తేనియను మా మది నిండుగ నింపి కావవే
పలుకులరాణి నీ వలన పాడిన పాటలు వేయి తీరులై
నిలనిటు మాదు కోరికల నిండుగ తీరుచు తల్లి శారదా.
శ్రీ ఆచార్యఫణీంద్రుల జవాబు...
శ్రీలలిత గారు !
మొదటి ప్రయత్నమైనా, మొదటి పాదం ఎంత అందంగా ఎత్తుకొన్నారు !
మీకు నా హృదయ పూర్వకాభినందనలు !
అయితే, చిన్న చిన్న దోషాలు సరిదిద్ది, మెరుగులు దిద్దుతాను.
జిలిబిలి జుంటి తుమ్మెదలు చేసెడి నాదపు గాన మాధురిన్ ..."
ఒలికెడి తీపి తేనె రుచి ఉల్లము నిండుగ నింపి కావవే !
పలుకుల రాణి నీ కృపను పాడిన పాటలు వేయి తీరులై
నెలకొను మాదు కోరికల నిండుగ తీర్చుము తల్లి శారదా !
ఆ శారదాదేవి అందరికీ సకల విద్యలూ అందించాలని కోరుకుంటున్నాను.
#################################################################
9 వ్యాఖ్యలు:
పద్యాలు చదవటమే కాని అంత భాషా పరిజ్ఞానం లేదు అయినా కూడా చిన్న చిన్న పదాల మార్పుతో మీ పద్యానికెంత అందమొచ్చిందో తెలుస్తోంది ....All the best !
భావం, ప్రకటన రెండూ చాలా బావున్నై
చాలా బావుందండి. మరింత ప్రాక్టీస్ చేయండి. ఆచార్యగారు, రామకృష్ణగారు తప్పకుండా సహాయం, ప్రోత్సాహం ఇస్తారు.
మీ పద్యము చాలా చాలా బాగుందండి .
పద్యరచనా ప్రావీణ్యతా ప్రాప్తిరస్తు!
మీ దగ్గర తెలుగు నేర్చుకోవాలి అనిపిస్తోంది ... అమ్మ సరస్వతీదేవి ని సాక్షాత్కరింపజేసినందుకు ధన్యవాదాలు
శ్రీలలిత,
సరళమైన పదాలతో చక్కగ వుంది.
పరిమళగారూ,
కొత్తపాళీగారూ,
జ్యోతీగారూ,
మాలాకుమార్ గారూ,
శంకరయ్యగారూ,
శివచెరువుగారూ,
సూర్యలక్ష్మిగారూ
మీరిచ్చిన ప్రోత్సాహానికి ధన్యవాదములు.
మరింత కృషి చేయడానికి తగిన బల మిమ్మని ఆ శారదాదేవిని వేడుకుంటున్నాను.
బావుంది శ్రీ లలిత గారు. ఆ పదం జిలిబిలి జుంటీ అలా పడగానే బాగా అనిపించింది..
Post a Comment