
ఓ పరమాత్మా..
ఎంత నమ్మకం నా మీద నాకు
ఏదైనా చేయగలననీ
అంతా నా చేతిలోనే వుందనీ
నా జీవితం నా ఇష్టం ఎలాగైనా వుండగలననీ
జీవితమనే చదరంగంలో
నేను వేసే ఎత్తు నా చేతిలోనె వుందనీ
ఎత్తు మీద ఎత్తు వేసి ఎదటివాణ్ణి చిత్తు చేసి
గుర్రాలను దూకించీ ఏనుగులను కదిలించీ
మంత్రి రణతంత్రం తో "చెక్" చెప్పగలననీ
ఎంత నమ్మకం నా మీద నాకు...
కానీ....
కాదు కాదు జీవితం నీ చేతిలో చదరంగం
అది నేను సృష్టించిన ఎత్తు పల్లాల కల్లోల సముద్రం
నీ ఎత్తుగడను బట్టి నడవదు నీ జీవితం
పావులు నీ చేతిలో వున్నా
నీ అరిచేతి రేఖలు నేను రాసినవే
ఆడేది నువ్వైనా ఆడించేది నేనే
అందుకే నీ జీవితం కాదు చదరంగం ..అది
పాము నిచ్చెనల నడుమ బంధించబడిన
చిత్రమైన పరమపదసోపాన పఠం...అది
వైకుంఠపాళీ..అంటూ
నిచ్చెనలను ఎక్కిస్తూ,
పాము చేత మింగిస్తూ
ఆడిస్తూ, పాడిస్తూ,
వేధిస్తూ, వేగిస్తూ,
నడిపిస్తూ,విసిగిస్తూ,
ఇంతలో కవ్విస్తూ, అంతలోనె ఏడిపిస్తూ,
కనిపించని నా మనసుని చిత్రహింసలు పెడుతూ
అంతలోనె ఆనందం..మరుక్షణం దుఃఖం
అన్నీ అనుభవించు అదే జీవితమంటే
అంటూ నన్ను నడిపిస్తున్న ఓ పరమాత్మా...
ఇంకా ఎప్పటికి నా ఈ జీవితానికి తుదిశ్వాస...?
***********************************************
9 వ్యాఖ్యలు:
ఎంత బాగా రాసారు శ్రీలలిత గారు మంచి వ్యాఖ్యాల పొందిక అమరిక చాలా బాగుంది అన్నింటిని ఎదుర్కుంటు బ్రతికితేనే జీవితం మరి అంతలోనే నిరాశ ఏల చెప్పండి తుదిశ్వాస లోపల ఇంకా జీవితాన్ని గెలవాలి ఎందరికో సాయపడె ఎన్నో కార్యాలు చేయాలి, నాతో స్నెహం అభిలషించారు ధన్యవాదాలు, మీరు ఇలా స్పందించినందుకు ఆనందించాను, తప్పక మీ స్నెహితురాలిగ వుండగలను,
భారతి
chaalaa baagaavraasaarammaas
అడించేవాడు ఆపే దాక ఆట ఆడుతూనే ఉండాలి. మనం చేయగలిగిందల్లా, బాగా అడుతున్నాం అనుకుంటూ ఆస్వాదించటమే. Nice one
చాలా బాగుందండీ :)
"ఆడిస్తూ, పాడిస్తూ,
వేధిస్తూ, వేగిస్తూ,
నడిపిస్తూ,విసిగిస్తూ,
ఇంతలో కవ్విస్తూ, అంతలోనె ఏడిపిస్తూ,
కనిపించని నా మనసుని చిత్రహింసలు పెడుతూ"
విజయభారతిగారూ,
చాలారోజుల తర్వాత ఇంటర్నెట్ చూసాను. మీకు కవిత నచ్చినందుకు ధన్యవాదాలు. ఏమిటో ఒక్కొక్కసారి మనసు అగాధాల్లోకి జారిపోయినప్పుడు అలాంటి వేదాంత భావాలు వచ్చేస్తూంటాయి. మీ స్నేహ హస్తాన్నిసంతోషంగా అందుకుంటున్నాను. ఇకమీద వెంట వెంటనే స్పందిస్తూంటాను.
దుర్గేశ్వరగారూ,
ధన్యవాదాలండీ..
దుర్గేశ్వరగారూ,
ధన్యవాదాలండీ..
బాలూగారూ,
అంతేకదండీ..ఆడుతూనే వుండాలి. అంతకన్న మనం చేయగలిగిందేమీ లేదు. కవిత నచ్చినందుకు ధన్యవాదాలు.
ప్రణవ్ గారూ,
కవిత నచ్చినందుకు ధన్యవాదాలండీ.
Post a Comment