Pages

Saturday, August 7, 2010

ఒద్దు....మాట్లాడొద్దు..ఒద్దు....మాట్లాడొద్దు..

పెద్దవాళ్ళకు బదులిస్తావా...ఒద్దు మాట్లాడొద్దు
అన్నతమ్ములతో పంతాలా..ఒద్దు మాట్లాడొద్దు
భర్త మాటకు బదులిస్తావా..ఒద్దు మాట్లాడొద్దు
బంధువులతో వాదాలా..ఒద్దు మాట్లాడొద్దు
పిల్లలను బెదిరిస్తావా..ఒద్దు మాట్లాడొద్దు
మనవలను అదిలిస్తావా..ఒద్దు మాట్లాడొద్దు


మరింక ఎప్పుడమ్మా నా నోట మాట రావడం?


అఖ్ఖర్లేదు..అలాగే వుండు..
మంచిదానివనిపించుకో..
ఉత్తమాయిల్లాలి వనిపించుకో..
మంచి తల్లి వనిపించుకో..
ఆడదానివి.. నీకంటూ నీకేమిటుంటుంది?
ఒకరికి కూతురిగా..
ఇంకొకరి ఇల్లాలిగా.
మరొకరికి అమ్మగా..
మనవలకి మామ్మగా.. అంతె..నీ వునికంతే..
నీకు అస్తిత్వం లేదు..
వుందనుకుంటే నీకు కలిగేది బాధే తప్ప ప్రయోజనం లెదు..
నీవొక కరిగే కొవ్వొత్తివి..
అంతటా వెలుగిస్తావు తప్పితే ..నీ చుట్టూ చీకటే..


మరి..నాకింక ..ఇష్టాయిష్టాలుండవా..


వుండవు...వుండకూడదు..
అసలు నువ్వంటూ వుంటే కదా..
నీకంటూ ఇష్టాయిష్టాలుండడానికి..
ఒక కూతురివి, ఒక ఇల్లాలివి,
ఒక అమ్మవి, ఒక మామ్మవి..అంతే..
అందరి పాపాలూ హరించేంత ఘనతగల గౌతమి కూడా..
సముద్రునిలో కలిసి ఉప్పునీరైపోయింది..
అలాగే నువ్వు కూడా..
నీకెంత తెలివున్నా, చదువున్నా, ప్రఙ్ఞాపాటవాలున్నా
ప్రకృతి ధర్మానికి లోబడి..
గౌతమి సముద్రునిలో కలిసినట్టు ..
నువ్వు కూడా నీ భర్త ననుసరించి ఉప్పునీరైపోక తప్పదు..
ఇదింతే..ఇది లోక ధర్మం..
నదులు సముద్రంలోకలిసే చోట తీర్థమాడితే యెంత పుణ్యం..


-------------------------------------------------------------------------

18 వ్యాఖ్యలు:

చెప్పాలంటే.... said...

nijam chepparu.... baagundi

సవ్వడి said...

ఇప్పుడు ఇలా ఉండట్లేదే....

శివరంజని said...

శ్రీ లలిత గారు నిజం చెప్పారండీ ... సున్నితంగా విమర్శించారు ..బాగుందండి

మాలతి said...

నదులు సముద్రంలోకలిసే చోట తీర్థమాడితే యెంత పుణ్యం.. బాగుంది, అలా అనుకోకపోతే ఊపిరాడదు - :)

Krishnapriya said...

శ్రీ లలిత,

చాలా బాగుంది. Very well written! నా కేస్ లో ఎవరూ పెళ్ళికి ముందు అలా అనలేదు కానీ.. కొంతవరకూ అలా ఎదిరించి మాట్లాడతావా భర్తని అనీ,..అప్పుడప్పుడూ వింటూనే ఉంటాను, అలాగే పిల్లలనైతే.. వాళ్ళకి పని చేసి పెట్టడమే కానీ అనే హక్కు నాకు లేదన్నట్టే :-(

శ్రీలలిత said...

చెప్పాలంటేగారికి,
మీకు కవిత నచ్చినందుకు ధన్యవాదాలండీ..

శ్రీలలిత said...

సవ్వడిగారికి,
ఇప్పుడు కూడా కొన్ని ఇళ్ళల్లో ఇలా చెపుతూనే వున్నారండీ..
అంతలా వున్నా కూడా గృహహింస సమస్యల లాంటివి ఇంకా తగ్గలేదు కదండీ..

శ్రీలలిత said...

శివరంజనిగారూ,
కవిత నచ్చినందుకు ధన్యవాదాలండీ..

శ్రీలలిత said...

మాలతిగారూ,
మీరు నా రచనకు కామెంట్ పెట్టడం నాకు చాలా సంతోషంగా వుంది.
ఈ కవితలో "ఉత్తమాయిల్లాలు" అనే మాట మీ దగ్గరినుంచి తీసుకున్నదే. బలే వాడారామాట మీరు.
పుణ్యం, పురుషార్ధం అనే మాటలే కదండీ చెప్పి ఆడవారిని సోషలైజ్ (socialise)చేస్తూంటారు..

శ్రీలలిత said...

కృష్ణప్రియగారూ,
కవిత నచ్చినందుకు ధన్యవాదాలండీ.
సంసారం లో ఇద్దరి అభిప్రాయాలూ ఒకటి కానప్పుడు తగ్గి వుండవలసినది ఆడవాళ్ళేనని పెద్దవాళ్ళు చెపుతూంటారండీ. నిర్ణయాధికారం అయితే వాళ్ళదే కదా..

మాలా కుమార్ said...

నిజం చెప్పారు . బాగుంది .

మాలతి said...

:)) ఉత్తమాయిల్లాలు గుర్తొచ్చిందా ఇది రాస్తుంటే. బాగుంది. :)

భావన said...

చాలా బాగుంది శ్రీలలిత గారు. తీవ్రత లో హెచ్చు తగ్గులుంటాయి కాని చాలా మటుకు ఇదే కధ కదా.. ఎక్కడన్నా ఒకళ్ళు లేక పోతే చాలానే పేర్లు వస్తాయి కదా ఆడ పెత్తనం, గయ్యాళి గట్రా గట్రా.. సున్నితం గా చెప్పేరు.

రాధిక(నాని ) said...

నీకెంత తెలివున్నా, చదువున్నా, ప్రఙ్ఞాపాటవాలున్నా
ప్రకృతి ధర్మానికి లోబడి..
గౌతమి సముద్రునిలో కలిసినట్టు ..
నువ్వు కూడా నీ భర్త ననుసరించి ఉప్పునీరైపోక తప్పదు..
ఇదింతే..ఇది లోక ధర్మం..
చాలా బాగుంది శ్రీ లలితగారు.

శ్రీలలిత said...

మాలాకుమార్ గారూ,
ధన్యవాదాలండీ..

శ్రీలలిత said...

భావనగారూ,
కవిత నచ్చినందుకు ధన్యవాదాలండీ..

శ్రీలలిత said...

రాధిక(నాని)గారూ,
కవిత నచ్చినందుకు ధన్యవాదాలండీ..

Chandu ... said...

aksharaala nijam chepparandi ... chaduvu andam udyogam ennunna kaani adapilla kanna magavalle goppa ane alochana dhorani marinappudu ... mana desam lo enno adbhuthalu jaruguthaay ..anarthaalu aaguthay :)
God bless .. you write really well aunty :)

Chandrika.