అప్పుడే అంతా వచ్చేసి కబుర్లు చెప్పేసుకుంటున్నారా.... ఇదిగో నేనూ వచ్చేసాను.
పవిత్రమైన కార్తీకమాసంలో ఉసిరికి వున్న ప్రాముఖ్యం అందరికీ తెలుసు. వనభోజనాల కార్యక్రమమే ఉసిరిచెట్టు క్రింద కదా.. ఈకాలంలోనే కాదు ఏ కాలం లో నైనా ఆరోగ్యరీత్యా ఉసిరికాయ తినడం
చాలా మంచిది. అందుకే ఈ వనభోజనాలకోసం నేను ఉసిరికాయతో మెంతికాయ చేసాను.
కావలసిన పదార్ధాలు..
1. ఉసిరికాయలు--పావుకిలో
2. ఉప్పు--------అరకప్పు
3. కారం---------అరకప్పు
4. మెంతులు----రెండు టేబుల్ స్పూన్లు
5.ఇంగువ-------పావు టీ స్పూను
6.నూనె--------పావుకప్పు(ఇది ఎ.ఎస్.బ్రేండ్ వారి హస్క్ డ్ నూపప్పు నూనె అయితే బాగుంటుంది. )
తయారుచేసే విధానం..
ముందు ఉసిరికాయల్ని శుభ్రంగా కడిగి, బట్టపెట్టి పొడిగా తుడుచుకోవాలి. తర్వాత కత్తిపీటతో కాని, చాకుతోకాని మధ్యలో వున్న గింజ తీసేసుకుంటూ ముక్కలు చేసుకోవాలి. ఇలాగన్నమాట...
స్టౌ మీద బూర్లెమూకుడు పెట్టి పొడిగా మెంతులు వేయించుకుని, మిక్సీ లో పొడి చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఆ మూకుడు లోనే ఒక టేబుల్ స్పూన్ నూనె వేసి ఉసిరికాయ ముక్కలు తడిపోయేవరకూ వేయించుకోవాలి. తర్వాత ఆ ముక్కలు తీసి పక్కన పెట్టుకుని, మూకుడులో మిగిలిన నూనె వేసి బాగా కాగాక ఇంగువ వేసుకుని స్టౌ ఆపేసుకోవాలి. నూనె వేడి కాస్త తగ్గాక, కారం, మెంతిపొడి, ఉప్పు, ఉసిరికాయముక్కలు అన్నీ వేసి బాగా కలుపుకోవాలి. అంతే.. ఘుమఘుమలాడే ఉసిరి మెంతికాయ రెడీ...
##################################################################
ఇప్పుడు మనం జ్యూస్ తాగుదాం. అన్ని పండ్ల రసాల్లాగా ఇది ఖాళీకడుపుతో తాగకూడదని చెప్తారు. అందుకని భోజనం చేసాక తాగడానికన్నమాట.
పైనాపిల్ జ్యూస్..
ఇదేదో పైనున్న ఆపిల్, కిందున్న ఆపిల్ కాదండీ.. పైనాపిలే.. అంటే అనాసపండన్నమాట..
అచ్చ తెలుగులో చెప్పాలంటే అనాసపండు రసం..
కావలసిన పదార్ధాలు..
1. అనాసపండు--1
2. పంచదార తగినంత
3. మంచినీళ్ళు
అనాసపండు తొక్క తీసేసుకుని, మధ్యలో దూలం లాగా వుంటుంది. అదికూడా తీసేసుకుని ముక్కలు కోసుకోవాలి ఇలాగ.
తర్వాత దానిని మిక్సీ లో వేసి, తగినంత పంచదార వేసి, మంచినీళ్ళు పోసి జ్యూస్ లాగ చేసుకోవాలి.
దానిని పెద్దపెద్ద చిల్లులున్న జల్లెడలో వడకట్టేస్తే , రసం కిందకి దిగిపోతుంది. దానిని ఇలా గ్లాసుల్లో పొసుకుని తాగెయ్యాలంతే...
####################################################################
23 వ్యాఖ్యలు:
usiri tinavalchinde
బాగున్నాయండి.
లలిత గారు మీరు నా బ్లాగ్ ను దర్శించి మీ అభిప్రాయాన్ని చెప్పగోరుతున్నాను.
మీ మెంతి ఉసిరి అర్జెంటుగా టెస్ట్ చేసేయ్యాలనిపిస్తోంది. :)
చాలా బాగున్నాయండి.
Yummy..
మీ ఉసిరికాయ మెంతికాయ, పైనాపిల్ జ్యూస్ రెండూ అద్దిరిపోయాయండి. సూపర్బ్.
వహ్వా మరో ఉసిరావకాయ, ఐమీన్, మెంతికాయ, సెబాసో!!
నా దగ్గర ఉసిరికాయలూ, మెంతి పిండీ ఉన్నాయి. ఇంక చేసేస్తా..
జగ్గంపేటగారూ,
అంతే కదండీ..
వేణూశ్రీకాంత్ గారూ,
ధన్యవాదాలండీ..
వేణూశ్రీకాంత్ గారూ,
ధన్యవాదాలండీ..
మధురవాణిగారూ,
అల్లగే చేసెయ్యండి మరి..
రాధిక(నాని)గారూ,
ధన్యవాదాలండీ...
muraligaarU,
thanks.
జయగారూ,
ధన్యవాదాలండీ...
కొత్తపాళీగారూ,
చాలా రోజుల తర్వాత విందు భోంచేయ వచ్చారే...
ధన్యవాదాలండీ..
కృష్ణప్రియగారూ,
మీదే ఆలస్యం..
వావ్ . . . పైనాపిల్ నాకిష్టమైన పళ్ళ రసం .బాగుంది .
ఇంద, పాట్లక్ లో నా వాట క్రింద పానీపూరీలు తినండి :-)
Lalitha garu, taste bagundi pullaga vagaruga :-)
అబ్బా భలె ఉందండీ నూరూరిస్తు...ఇంకా నాకు ఇష్టమైన అనాస రసం... :) యమ్మీ
లలితగారూ! మొన్నీ మధ్య మహిళామణులంతా మన అమ్మ జ్ఞాన ప్రసూనగారీంట కొలువు తీరినప్పుడు మీ ఉసిరికాయ వంటకాన్ని వారికి రుచి చూపారా లేదా?
అద్భుతంగా ఉన్నాయండి చూడడానికైతే మాత్రం. మరి రుచంటారా ; అది చూచే భాగ్యం ఉండాలిగా.
ఆన్నట్టు http://andhraamrutham.blogspot.com
చూస్తే నేనెవరినో గమనించ గలరు.
ధన్యవాదములు.
Post a Comment