Pages

Thursday, November 10, 2011

వనభోజనాలు

కార్తీకపౌర్ణమి పేరే అంత బాగుందే మరింక అదే రోజు మనం బ్లాగ్ లొ వనభోజనాలు పెట్టుకున్నామంటే అవి ఇంకెంత బాగుంటాయో కదా...
అపరాహ్ణం దాటింది. అందరికీ ఉదయం తిన్నవన్నీ అరిగిపోయి వుంటాయి. అందుకే శుభ్రంగా భోజనం తయారుచేసి తెచ్చెసా.. ఇదిగో..
ఘుమఘుమలాడే మామిడికాయ పప్పు, నోరూరించే ముక్కలపులుసు, గోరువెచ్చని నేయి వేసుకుని లాగించెయ్యండి మరి..




కాలంకానికాలంలో మామిడికాయలు ఎక్కడివంటారా..? ఈ రోజుల్లో అన్ని కాలాల్లోనూ అన్నీ వచ్చేస్తున్నాయి.. కాలమహిమ.
ఒకవేళ మీకు మార్కెట్లో పచ్చిమామిడికాయ దొరకలేదనుకుంటే ఈ రోజు నేను చేసినట్టు చెసేయండి మరి..
మన వంటింటి మహారాణులకి లేదనేది యేదీ వుండదుగా.. అందుకే..




మామిడికాయపప్పు--
మనం ఊరగాయరోజుల్లో పెట్టుకుని దాచుకునే మాగాయ--1 కప్పు(దీని బదులు తొక్కుపచ్చడి, కోరుపచ్చడి ఏదైనా పనికొస్తుంది)
కందిపప్పు---1 కప్పు
ఇంగువ--చిటికెడు
ఆవాలు----1టీస్పూన్
మిరపకాయలు--2
కరివేపాకు--ఒక రెమ్మ--
కారం--1
ఉప్పు --తగినంత
నూనె----1స్పూన్
ముందుగా కుక్కర్లో పప్పు మెత్తగా ఉడికించేసుకుని, పోపు వెసుకుని అందులో ఉడికించుకున్న పప్పు, కప్పు మాగాయ, కారం, తగినంత ఉప్పు వేసుకుని బాగా మెదిపేసుకుని, కరివేపాకుతో అలంకరించుకుంటే ఘుమఘుమలాడే మామిడికాయపప్పు తయార్..

మరింక ముక్కలపులుసు--




ముక్కలపులుసు చేయు విధంబెట్టిదనిన....
సిగ్గు, సిగ్గు..
ఆంధ్రదేశంలో పుట్టీ, ఆంధ్రుల ఇష్టపాకంబయిన ముక్కలపులుసు చేయు విధానము తెలియదా....
తెలియునుకదా..అందుకే ఇచట చెప్పుటలేదు. విఙ్ఞులు గ్రహించెదరుగాక..

26 వ్యాఖ్యలు:

Padmarpita said...

ఆహా!! భలే రుచి:)

సిరిసిరిమువ్వ said...

అబ్బ మామిడికాయ పప్పు..ఇక్కడ లొట్టలు.

జ్యోతి said...

మామిడికాయ పప్పు అనగానే పుల్లగా గుర్తొచ్చేస్తుంది. నిజమే ఇప్పుడు అన్ని కాలాల్లో మామిడికాయలు దొరుకుతున్నాయి కాని అంత పుల్లగా ఉండట్లేదు.

కృష్ణప్రియ said...

:) ముక్కల పులుసు చెప్పట్లేదా? అయ్యో...

మాలా కుమార్ said...

మామిడి కాయ పప్పు లో మాగాయ వేసి చేసారా ? సూపర్ . బాగుంది .

జయ said...

భలే ఉందండి మామిడికాయ పప్పు. మామిడి కాయలు లేని టైం లో భలే ఉపాయం.

Mauli said...

Nice Items :)

ముక్కల పులుసు చెప్పట్లేదా!!!

లత said...

బావున్నాయండి మీ ఐటంస్

రసజ్ఞ said...

ఆహా ఏమి రుచి అనరా మైమరచి! దీనికి చల్ల మిరపకాయలు ఉంటే ఇంకా అద్భుతం!

భమిడిపాటి సూర్యలక్ష్మి said...

కాలం కాని కాలం లొ మామిడికాయ పప్పు రుచే వేరండి.మేము మాగాయ పెట్టుకునేటప్పుడు మామిడికాయ ఒరుగులు వుంచుకుంటామండి. దానితో ఎప్పుడు కావాలంటె అప్పుడే చేసుకుంటాము. ఆ! పులుసు గురించి కూడా రాసి వుంటే బావుండేది.మాస్నేహితురాలు ఒకామె వుండేవారు ఆమెకి సాంబారు తప్పితే పులుసంటే తెలీదుట.తెలియని వారు వుంటారు.

జ్యోతిర్మయి said...

లలితగారూ విందు మంచి పసందుగా ఉందండీ..

శ్రీలలిత said...

పద్మార్పితగారూ,
ధన్యవాదాలండీ...

శ్రీలలిత said...

సిరిసిరిమువ్వగారూ,
మామిడికాయ పప్పా... మజాకా..

శ్రీలలిత said...

జ్యోతిగారూ,
ధన్యవాదాలండీ...

శ్రీలలిత said...

కృష్ణప్రియగారూ,
దాందేవుందండీ..
ఈసారి చెప్పుకుందాం..

శ్రీలలిత said...

మాలాకుమార్ గారూ,
ధన్యవాదాలండీ...

శ్రీలలిత said...

జయగారూ,
ఇలాంటి ఉపాయాలు ఇంకా చాలా వున్నాయి.
మరోసారి చెప్పుకుందాం..

శ్రీలలిత said...

మౌళిగారూ, ధన్యవాదాలండీ...
ముక్కలపులుసు గురించి
మరోసారి చెప్పుకుందాం..

శ్రీలలిత said...

లతగారూ,
ధన్యవాదాలండీ...

శ్రీలలిత said...

రసజ్ఞగారూ,
ధన్యవాదాలండీ...నిజవే.. నేనూ అనుకున్నానండీ.. కాని హడావిడి్గా పోస్ట్ చెయ్యడంలో మర్చిపోయేను..

శ్రీలలిత said...

సూర్యలక్ష్మిగారూ,
ధన్యవాదాలండీ...
ముక్కలపులుసు కూడా చెపుదామనే అనుకున్నాను. కాని అప్పటికే ఆలస్యమయిపోయిందని తొందరగా పోస్ట్ చేసేసా..
మరోసారి తప్పకుండా చెపుతాను..

శ్రీలలిత said...

జ్యోతిర్మయిగారూ,
ధన్యవాదాలండీ...

Ennela said...

మామిడికాయ పప్పు, కమ్మటి నెయ్యి, ముక్కల పులుసు..ఇంక వేరే ఇయిటెంస్ యేవీ చెల్లవేమో..వీటిని మించి యేముంటాయ్ వనభోజన్నాల్లో...ఉండండి ఎవరైనా వంకాయ సంతర్పణ కూర కూడా తెచ్చారేమో చూసొస్తా.....మీ వంటలు అదుర్స్ సుమండీ!!!

Unknown said...

మాకు ముక్కల పులుసు కావాలి.మామిడికాయ పప్పు మాత్రం నోరు ఊరిన్చేస్తోంది.

శ్రీలలిత said...

ఎన్నెలగారూ,
ధన్యవాదాలండీ..
ఎవరైనా వంకాయకూర తెచ్చేరేమో చూడండి.. నేనూ వస్తాను..

శ్రీలలిత said...

శైలబాలగారూ,
ధన్యవాదాలండీ..
అలాగే ముక్కలపులుసు కూడా తొందర్లోనే చెప్తానండీ...