Pages

Sunday, April 1, 2012

మహిళాదినోత్సవం కబుర్లు..(కాస్త ఆలస్యంగా..)

ప్రతి సంవత్సరం అంతర్జాతీయ మహిళాదినోత్సవానికి మా స్నేహితురాళ్ళం అందరం కలిసి ఏదైనా ప్రోగ్రామ్ వేసుకుంటూంటాం. అలాగే ఈసారి కూడా ఏం చేద్దామా అని అనుకుంటుంటే ఒక ఫ్రెండ్ "అందరూ ఆ రోజు మా ఇంటికి లంచ్ కి వచ్చెయ్యండీ.." అని అపర అన్నపూర్ణలా ప్రకటించేసేరు. ఏంటండీ కథా, కమామీషూ.. మీ.. పుట్టిన్రోజా ..పెళ్ళిరోజా.. అని ఆరా తీస్తే "అబ్బే.. అదేంకాదు.. సరదాగా అందరం కలిసి మా ఇంట్లో భోంచేద్దాం.." అన్నారు. ఎవరెప్పుడు భోజనానికి పిలుస్తారా అని చూసే నాలాంటివాళ్ళం వెంఠనే ఒప్పేసుకున్నాం. కాని కొంతమంది ఫీల్ అయిపోయి "ఎందుకండీ.. ఎప్పట్లాగే అందరం తలోటీ చేసుకుందాం..." అనడం మొదలెట్టేరు. చర్చ ఏం తేలుస్తుందా అని చూస్తుంటే భోజనానికి పిలిచినావిడ "ససేమిరా ఎవ్వళ్ళూ ఏమీ తేవద్దు, అన్నీ ఒంటి చేత్తో నేనే చెసేస్తాను" అని నిర్ధారించేసేరు. ఆ అపర అన్నపూర్ణగారు ఈవిడే.. పేరు రాణీ కల్యాణి.
ఆవిడ చేసిన వంటకాలు కూడా బ్రహ్మాండంగా వున్నాయి. ఇవిగో...
ఇవికాక ఇంకొంతమంది అన్నపూర్ణలు గోంగూర పచ్చడి, అరటికాయ బజ్జీలు లాంటివి చేసి తీసుకొచ్చేరు. (హేవిటో..పిచ్చివాళ్ళు. భోజనానికి పిలిచినప్పుడు నాలాగ చేతులూపుకుంటూ వెళ్ళాలని తెలీదు పాపం) సరే.. మా మహిళలందరం మాకేకదా ఈ రోజు స్వాతంత్ర్యం వచ్చింది అని మహా సంబరపడిపోతూ అంతర్జాతీయ మహిళాదినోత్సవం గురించి కాసేపు మాట్లాడుకున్నాం. తర్వాత ఒక ఫ్రెండ్ దేశంలో శైవక్షేత్రాలెన్ని వున్నాయో ఒక్క నిమిషంలో రాయమన్నారు. ఎవరెక్కువ రాస్తే వాళ్ళకి బహుమతన్నమాట. అలాంటిదే ఇంకో తెలుగుపదాల మీద పరీక్ష. మేమందరం ఆవిడ తెలుగు టీచరు అవకుండా పిల్లల్ని కాపాడినందుకు ఆ దేవుడిని తల్చుకుంటూ అదీ రాసాం. (రెండిట్లొ ఒకదానికి నాకు బహుమతి కూడా వచ్చిందోచ్) తర్వాత అద్భుతమైన విందారగించాం. ఇంటావిడకి కూడా మొహమాటపడకుండా మేమే వడ్డించేం.. ఆ తర్వాత రెండు వన్ మినిట్ గేమ్ లు ఆడాం. అందులో ఒకటి తల మీద కేప్ పెట్టుకుని, దానికి టూత్ బ్రష్ వేలాడదీసి, అది పడిపోకుండా నడవాలన్న మాట. ఇలాగ.. ఇదిగో..ఈవిడకే ఈ ఆటలో బహుమతి వచ్చింది.
అలాగ స్నేహితులమందరం చాలా సంతోషంగా కాలం గడిపి, మూడుగంటలకి ఇంటావిడ ఇచ్చిన టీ తాగి, వచ్చే యేడాది అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఎప్పుడొస్తుందా అని ఆలోచించుకుంటూ ఇంటిదారి పట్టేం.. ----------------------------------------------------------------------------------------------------------------

10 వ్యాఖ్యలు:

జయ said...

చాలా బాగుందండి మీ మహిళా దినోత్సవ సంబరాలు. మీరు బహుమతికూడా కొట్టేసినందుకు అభినందనలు(నిజంగా నాకు ఎటువంటి కుళ్ళు లేదండి:)

వనజ తాతినేని/VanajaTatineni said...

Visheshaalu chaalaa baagunnaayi..Lalita gaaru. appudappudu ilaa Aatavidupu kaavaali. Women's Day ilaa gadachindannamaata. Late gaa vasthenemiti.. Latest News tecchaaru. Baagunnaayi.
keep it up.

Mauli said...

వచ్చే యేడాది కూడా మార్చి 8 నే వచ్చుద్ది అండి :)

సి.ఉమాదేవి said...

చాలా సంబరంగా ఉన్నాయి మీ ఆటలు.సేద తీర్చే చలివేంద్రాలు ఇలాంటి సంబరాలు.బహుమతికి అభినందనలు.

శ్రీలలిత said...

జయా,
మీ స్పందనకి ధన్యవాదాలండీ. మీరు ఎంత మంచివారో నాకు తెలుసుకదండీ.

శ్రీలలిత said...

వనజవనమాలీగారూ, మీరు చెప్పింది నిజమేనండీ. అందుకే మేం అప్పుడప్పుడు ఇలా చిన్నపిల్లలం అయిపోతాం..

శ్రీలలిత said...

వనజవనమాలీగారూ, మీరు చెప్పింది నిజమేనండీ. అందుకే మేం అప్పుడప్పుడు ఇలా చిన్నపిల్లలం అయిపోతాం..

శ్రీలలిత said...

మౌళిగారూ,
హ.. హ.. అవునండీ. మార్చి 8నే వస్తుంది. కాని ఆ రోజు మళ్ళీ ఎన్నాళ్ళకొస్తుందా అని నా ఉద్దేశ్యమన్నమాట..

శ్రీలలిత said...

మౌళిగారూ,
హ.. హ.. అవునండీ. మార్చి 8నే వస్తుంది. కాని ఆ రోజు మళ్ళీ ఎన్నాళ్ళకొస్తుందా అని నా ఉద్దేశ్యమన్నమాట..

శ్రీలలిత said...

ఉమాదేవిగారూ, మీరన్నమాట అక్షరాలా నిజం. ధన్యవాదాలండీ..