Pages

Tuesday, August 21, 2018

ధర్మాగ్రహం


 ఈ కథ మీద విజ్ఞుల అభిప్రాయం కోరుతున్నాను
ధర్మాగ్రహం


ధన్యవాదాలతో,

జి.యస్.లక్ష్మి..



38 వ్యాఖ్యలు:

నీహారిక said...

మీ ధర్మాగ్రహం కధ చాలా బాగుంది.అయితే మీరు నొచ్చుకున్నా ఒకమాట చెప్పక తప్పదు.అగ్రహారంలోని బ్రాహ్మణులు దళితుల మీద చూపిన వివక్షే ఈనాటి బ్రాహ్మణులకు ఆ దుస్థితిని తీసుకువచ్చింది.ఈరోజుకీ పరిస్థితిలో పెద్ద మార్పు లేదు.జేసుదాసు గారు బొద్దింకగా నయినా పుట్టినా బాగుండేది అని బాధపడినా బాలసుబ్రహ్మణ్యం గారి లాంటివాళ్ళయినా ఆయనకు సపోర్ట్ గా నిలబడలేదు.
సోమయాజులు గారు అన్నట్లు మనం ఎంత చెంబు తీసుకెళతామో అన్నే నీళ్ళు వస్తాయి అన్నట్లు పోరాటాలతో మార్పు రాదు.ఎంత ప్రేమని ఇస్తారో అంతే ప్రేమ దక్కుతుంది.

విన్నకోట నరసింహా రావు said...

నీహారిక గారూ, తతిమ్మా అంశాలన్నీ చర్వితచర్వణాలే కానీ జేసుదాసు గారి గురించి మాత్రం ఒక్క వివరణనిస్తాను 👇.
జేసుదాసు గారికి ఎదురైన ఇబ్బంది (కేరళలో గురువాయూర్ లోని కృష్ణుడి గుడి అధికారులతోనే కదా ... మీరంటున్నది?) ఆయన హైందవేతరుడు అవడం వలన జరిగిందే కానీ (ఆ ఆలయ రూల్స్ ప్రకారం) ఆ గుడిలో కులవివక్ష ఏమీ లేదండి.

నీహారిక said...

హైందవేతరుడు అయితే మాత్రం తప్పేం ఉందీ? మా అబ్బాయిని ఒక తెల్ల టోపీ,తెల్ల లాల్చీ వేసి రంజాన్ వేళల్లో మసీదుకు పంపిన రోజులున్నాయి.మా ఇంటికి ఎదురుగా ముస్లిం పిల్లలు ఉండేవాళ్ళు.వాడికా వేషం వేసి వాళ్ళే తీసుకుపోయేవాళ్ళు.నేనూ ఊరుకునేదాన్ని.
ఏ మతం అయితే ఏమయింది? ఒక మహానుభావుడి చిన్న కోరిక తీర్చలేకపోవడం ఏం మానవత్వం ?

విన్నకోట నరసింహా రావు said...

నీహారిక గారూ మీరన్నదానిపై ఒక్క ప్రశ్న మాత్రం అడుగుతాను -
పైన మీరు చెప్పినట్లు చేసుండడం సంతోషమే గానీ ... అది రివర్స్ లో జరిగిందా ఎప్పుడైనా?

Zilebi said...


సూపర్ డూపర్ ప్రశ్న .
రచ్చబండలో అడిగితే బాగుణ్ణేమో


జిలేబి

విన్నకోట నరసింహా రావు said...

నో థాంక్స్ “జిలేబి” గారూ. అంతగా అంటే లక్ష్మి గారి ఈ బ్లాగ్ బదులుగా ఇదే ప్రశ్నను నీహారిక గారి బ్లాగులోనే అడుగుతాను. అయినా దీంట్లో చర్చించడానికి ఏమీ లేదు లెండి. నా ప్రశ్నకు నీహారిక గారు అవుననో లేదనో జవాబిచ్చేస్తే చాలు అదే సమాప్తం I will rest my case.

నీహారిక said...

@ విన్నకోట నరసింహా రావు గారు,
నా ప్రశ్నని తిరిగి నాకే వేస్తున్నారు.తులసీదాసు,కబీర్ లాంటివాళ్ళు భక్తులు కాదా ?

విన్నకోట నరసింహా రావు said...

ఇది నా ప్రశ్నకు సమాధానం అవదు ☝️.

Zilebi said...



సూటిగా సుత్తి లేకుండా చాలెంజ్ ఎంత చక్కగా చేసారో...


జిలేబి

నీహారిక said...

బిర్లా మందిర్ చూడడానికి వచ్చే ముస్లింస్ ఎంతో మంది ఉన్నారు. మీరు నమ్మరు కాబట్టి జిలేబీ కుప్పిగంతులు ఆపడం కోసమయినా రుజువులతో ఒక పోస్ట్ త్వరలోనే పెడతాను.

విన్నకోట నరసింహా రావు said...

ఇది కూడా నా ప్రశ్నకు సమాధానం కాదు.
నా ప్రశ్నకు జస్ట్ yes లేదా no అని జవాబివ్వండి చాలు.

Zilebi said...



సూటిగా సుతి మెత్తగ చాలెంజ్ ఎంత చక్కగా చేసారో

నీహారిక said...

అమర్ నాధ్ యాత్రలో బామ్మలను డోలీలతో నెత్తిన పెట్టుకుని మోసుకుపోయేది ముస్లిం కార్మికులే .......
ఎవరయినాసరే ముస్లిం లు గుళ్ళకు రారు అని అనేముందు ఈ విషయం తెలుసుకుని సిగ్గుపడాలి.

నీహారిక said...

రివర్స్ లో జరిగింది అని చెపుతున్నాను కదా? బిర్లా మందిర్ చూడడానికి వచ్చారు. ఇంకేమి కావాలి ? అప్పట్లో ఫోటో తీయలేదు.

Zilebi said...



ఓం శాంతి

విన్నకోట నరసింహా రావు said...

కొంచెం వివరించాలనిపిస్తోంది —> మీరు చెప్పిన మీ ఎదురింటి నుండి మీ ఇంటికి ... వాళ్ళ పండుగలప్పుడు మీరు చేసినట్లు ... మన పండుగలప్పుడు ... రివర్స్ లో జరిగిందా అని నా ప్రశ్న యొక్క అంతరార్థం. మీరు మీవాడికి తెల్లలాల్చీ వేసి తెల్లటోపీ పెట్టి పంపించినట్లే వారెవరైనా (పెద్దవాళ్ళైనా) పట్టుపంచ కట్టుకుని భుజం మీద ఉత్తరీయం వేసుకుని వచ్చి పండుగ శుభాకాంక్షలు చెప్పేవారా? పోనీ మీకు తెలిసిన వారికెవరికైనా అలా జరిగినట్లు మీకు తెలుసా? ఈ రకంగా రివర్స్ లో జరిగుంటే / జరుగుతుంటే నాకూ సంతోషమే. బిర్లామందిర్ సందర్శిస్తారు, వాళ్ళ ఆడపడుచు బీబీ నాంచారమ్మ గారి భర్త గారి గుడికి వెడతారు ..., ఇవి కాదు నా ఉద్దేశం.

సర్లెండి ఇక్కడితో వదిలేద్దాం. అసలే ఇవాళ మీ స్త్రీల పండుగరోజు కూడా. వ్రతం శుభాకాంక్షలు.

Zilebi said...


చాలా మంచి వివరణ/ ప్రశ్న

అదురహో

జిలేబి

విన్నకోట నరసింహా రావు said...

థాంక్స్ “జిలేబి” గారు 🙏.

నీహారిక said...

ఓహో...మీకు ఆ కోరిక కూడా ఉందా ?

పైజమా లాల్చీ వాడికి నేనే వేసాను వాళ్ళు టోపీ ఇచ్చారు. చిన్నపిల్లవాడు కదా "నాకూ కావాలి బాజీ" అంటే వాళ్ళు ఇచ్చారు. ఎపుడూ వాళ్ళింట్లోనే ఉండేవాడు కాబట్టి వాళ్ళతో పాటు మసీదుకూ వెళ్ళేవాడు అని చెప్పాను.

మీకు అర్ధం కాని విషయమేమిటంటే మా అబ్బాయి మసీదుకి వెళ్ళడం నాకు అభ్యంతరం లేదు అని మాత్రమే చెప్పాను.

మీరు రివర్స్ లో అని అన్నది డ్రెస్ గురించా ? పట్టు పంచలు నాకు పెద్దగా నచ్చవు.నాకే నచ్చని దుస్తులను వాళ్ళను వేసుకోమని ఎలా చెపుతాం ?
బ్రాహ్మణులు జంధ్యం వేసుకుంటారు మా అబ్బాయి వేసుకోడు.మీ అబ్బాయి జంధ్యం ఎందుకు వేసుకోడు ? మీకు హిందువులు కారా అని అడిగితే నా దగ్గర సమాధానం లేదు. మీ విజ్ఞతని మీ తెలివితేటలకే వదిలేస్తున్నాను.

ఇక చిడతలు వాయించుకోండి

Zilebi said...


ఉరుము ఉరిమి మంగలం మీద మళ్ళీ పడింది :)


విన్నకోట నరసింహా రావు said...

అరెరే "జిలేబి" గారూ, నేను "చిడతలు" కొనుక్కుని తెచ్చుకుందామని వెళ్ళానండి, ఈలోగా మీరు మీ వ్యాఖ్య పెట్టిసినట్లున్నారు 😣.

ఈ వయసులో ఉరుములకు భయపడేదేమీ లేదులెండి. లేటెస్ట్ జవాబు కూడా నా సింపుల్ ప్రశ్నకు సూటి సమాధానం కాదు. అయినా ఇక్కడితో వదిలేద్దాం అని నేను నా ఇంతకుముందరి వ్యాఖ్యలోనే ప్రకటించేసున్నాను కదా. రాజకీయ నాయకులు అన్నట్లు .. ఆ మాటకే కట్టుబడున్నాను 🙏.

నా వైపు నుండి ఈ చర్చ సమాప్తం. బై.

నీహారిక said...

ఇక్కడ ధర్మాగ్రహం గురించి చర్చిస్తుంటే దుస్తులగురించి ప్రస్తావించి మంగళం పాడేస్తాను అనడం, దానికి జిలేబీ చిడతలు వాయించడం, మీకు మీరే సాటి..వాదించలేని ప్రతిసారీ మీరిలాగే పారిపోతున్నారు.ఎక్కడికిపోతారు ?
ధర్మసంస్థాపనార్ధాయ....

Zilebi said...



ఓం శాంతి

శ్రీలలిత said...

వ్యాఖ్యలు చేసిన అందరికీ ధన్యవాదాలు. పండుగరోజులు అవడం వల్ల నేను ఆలస్యంగా ఇప్పుడే ఈ వ్యాఖ్యలు చూడడం జరిగింది. ఎవరి అభిప్రాయం వారు వెలిబుచ్చారు. ఈ కథ వ్రాయడానికి కారణం బ్రాహ్మణేతరులను తక్కువచేయటం కాదు. ఎవరి వృత్తికుండే గౌరవం వారికుంది. మీరెందుకు ఎక్కువ, మేమెందుకు తక్కువ అని కొందరు అడిగిన ప్రశ్నకు జవాబుగా మంత్రం, తంత్రం, యంత్రం లాంటివి చెప్పాను. వేటినైనా సాధించడానికి ఎంత కష్టపడాలో తెలియచెప్పాను.
మన హైందవ సమాజంలో కొన్ని విలువలున్నాయి. అందులో ముఖ్యమైనది ఎదుటివారిని గౌరవించడం. ముఖ్యంగా తల్లితండ్రులను, స్త్రీలను, గురువులను దేవుళ్ళుగా భావించి పూజించడం. కానీ ఇప్పుడొస్తున్న సినిమాలు ఈ విలువలను దిగజారుస్తూ చూపిస్తున్నాయనీ, అవి చూసిన భావితరంవారికి ఎదుటివారిని గౌరవించడం తెలీకుండా పోతుందనే బాధతో వ్రాసానీ కథ.
ఈ కథను చదివి, స్పందించినవారందరికీ ధన్యవాదాలు..

శ్రీలలిత said...
This comment has been removed by the author.
నీహారిక said...

మీరేమీ కంగారు పడకండి.విన్నకోటవారితో జిలేబీతో ఇలా చర్చించడం చర్విత చరణం.ధన్యవాదాలు.

విన్నకోట నరసింహా రావు said...

🙂 👍

శ్రీలలిత said...

హ హ..అలాగలాగే..

Zilebi said...


కథా పరంగా బాగుందండీ.

నిజజీవితంలో ఇంత సులువు గా సమాధానం చిక్కుతుందంటారా ? సందేహమే


జిలేబి

శ్రీలలిత said...

అంతేనంటారా జిలేబీగారూ..

శ్యామలీయం said...

ఈ కథను ఇప్పుడే చదివాను.
నా అభిప్రాయాన్ని అక్కడ ఆ పేజీలో వ్రాసాను.

నీహారిక said...

లలిత(లక్ష్మి)గారూ,
మీరు కధకి ఈ పోస్టులోనే లింక్ ఇస్తే బాగుంటుంది.ఇక్కడినుండి అక్కడికి సులభంగా గెంతవచ్చు కదా ?
స్వగతం :ఈ కధ వ్రాయకముందు లలితగారొక మేధావి అనుకునేదాన్ని ఇపుడు కాదా ?

శ్రీలలిత said...


శ్యామలరావుగారూ,
నమస్కారం. మీరింత శ్రధ్ధగా కథ చదివినందుకు ధన్యవాదాలండీ. మీరు ఎత్తి చూపిన పొరపాటు సబబైనదే. కానీ నేను అనుకున్నదేమిటంటే పురుషోత్తంగారు ఇటువంటి సమస్యలలో తలదూర్చే మనిషికారు. కానీ, ఆయనను గౌరవించి, ఆ పిల్లలవైపు నిలబడే ఆయన అనుయాయులయిన పెద్దవారు చాలామంది సమాజంలో ఉన్నారు. అలాగే అవతలివైపున్న వర్గంలోని పెద్దవారూ ఉన్నారు. “ఇరువర్గాలూ” అంటే నా ఉద్దేశ్యం సమాజంలోని అటువంటి పెద్దలని. దీనిని నేను ఇంకొంచెం వివరించవలసింది. కానీ ఒక చిన్నకథ కుండే పరిమితివల్ల అంతకంటె చెప్పలేకపోయాను.
ఈ కథ వ్రాయడంలో నా ధైర్యాన్ని మీరు మెచ్చుకున్నారు. సంతోషం. కానీ నేను దీనిని ప్రచురించిన సంపాదకులను మెచ్చుకుంటాను. ఎందుకంటే ఈ కథను నాలుగైదు పత్రికలు ప్రచురించడానికి నిరాకరించాయి. సంచిక సంపాదకులు ఈ కథను ప్రచురించినందుకు వారికి నా ధన్యవాదాలు పత్రికాభిముఖంగా తెలుపుకుంటున్నాను.

శ్రీలలిత said...


ఇక్కడే లింక్ ఇద్దామనుకున్నాను నీహారికగారూ, కానీ ఎంత ప్రయత్నించినా రాలేదు. శ్రమ పెట్టేనా!
ఏమో, ఈ కథ చదివాక నేనేమిటో మీరే చెప్పాలి.. హహ ..

నీహారిక said...

మీరు పోస్ట్ ఎడిట్ లోకి వెళ్ళి మనం ఫోటోలూ, వీడియోలు పెట్టే చోట ప్రక్కనే గొలుసు సింబల్ లాగా ఒక ఐకాన్ ఉంటుంది. మీరు ఎక్కడైతే క్లిక్ చేయమంటున్నారో అక్కడ కర్సర్ పెట్టి ఆ గొలుసు సింబల్ పైన నొక్కితే ఒక బాక్స్ వస్తుంది.ఆ బాక్స్ లో మీ పోస్ట్ లింక్ పేస్ట్ చేయండి.

మీకు రాకపోతే నాకు చెప్పండి. లింక్ పెట్టివ్వడానికి మీ ఇంటికి వచ్చేదా ?

"వదిన"గారినోమాటు చూసినట్టయిపోతుంది.

(మేము బ్రాహ్మణులం కాము మీ ఇంటికి రానిస్తారా/రావచ్చా ?)

శ్రీలలిత said...


మీ సలహాకి ధన్యవాదాలు నీహారికగారూ..ప్రయత్నిస్తాను.
ఎంతమాటన్నారూ.. ఇన్నాళ్ళ మన స్నేహంలో ఇదేనా మీరు నన్ను అర్ధం చేసుకున్నదీ! తప్పక రండి. ముందుగా చెప్పనుకూడా అఖ్ఖర్లేదు. కలిసి భోచేద్దాం, భోజనానికే వచ్చెయ్యండి. మీరు మా ఇంట్లో తింటారా అని నేనడగను. ఎందుకంటే నాకు మీరు మంచి స్నేహితులు. నా ఆతిథ్యం స్వీకరిస్తారనే అనుకుంటున్నాను.

శ్రీలలిత said...

లింక్ పెట్టేసాను నీహారికగారూ.. మీరు చెప్పినట్టే చేసాను. మొత్తానికి వదిన సాధించింది. హహ.. ఎప్పుడొస్తారు మా ఇంటికి? చూస్తూంటాను..

నీహారిక said...

ఫొన్ నంబర్ అడ్రెస్ మెయిల్ లో వ్రాయండి.మాట తప్పకూడదు సుమా !

సుడిగాలి లాగా వచ్చేస్తాను.ఎక్కువ సేపు ఉండమని మాత్రం అడగకూడదు.జస్ట్ 30 నిమిషాలు మాత్రమే ఉంటాను.

మీ ఫోటో ఒకటి నా దగ్గరుంది.ఎపుడు ఎక్కడ కలిసామో చెపితేనే వస్తాను.

గుర్తు ఉందా ? ఎవరినీ అడగకుండా జ్ఞాపకం తెచ్చుకోవాలి.తొండి చేస్తే వదినతో కటిఫ్ !