Pages

Sunday, August 2, 2009

అదన్నమాట

ఇచ్చట ఉచితముగా సలహాలు ఇవ్వబడును.

సమయం: అన్నివేళలా ( మీరు క్యూలొ వున్నారు. దయచేసి వేచియుండండి.)

గమనిక: ఒకసారి తీసుకున్న సలహా వాపసు తీసుకొనబడదు.

హెచ్చరిక: ఎవరు చేసుకొన్న ప్రయోగానికి వారే బాధ్యులు.



మనం బైటకు వెడదామని ఎంతో సరదాగా ప్రోగ్రామ్ వేసుకుంటాం. సరిగ్గా అదే టైమ్ కి ఎవరో వస్తారు. (ఇంకా మనకి ముందుగా ఫోన్ చెసి రావడం అలవాటు కాలేదు కదా).

మరి అలాంటప్పుడు మనం బొత్తిగా బుడుగు లాగ ఈ మీసాలవాళ్ళు ఎప్పుడు వెడతారు అని అడగలేం కదా. అలాంటప్పుడు ఏం చెయ్యాలంటే..సలహా

మీవారు వచ్చినవారితో మాట్లాడుతుంటే మీరు లోపలికెళ్ళి, మంచి గంజి పెట్టిన చీర కట్టుకుని, మెడలొ కాస్త కనిపించేదేదైనా వేసుకుని వచ్చిన వాళ్ళముందు అటూ యిటూ, అలా అలా చీర సర్దుకుంటూ, మెడ తిప్పుకుంటూ నడయాడండి. అప్పుడు వాళ్ళు.. "మీకేదైనా ప్రోగ్రామ్ వుందాండీ.." అని అడుగుతారన్నమాట. అప్పుడు మనం "అబ్బే.. ఫరవాలేదండీ.." అంటామన్నమాట. అప్పుడు వాళ్ళు "అయ్యో.. ఫరవాలేదండీ.. మేం బయల్దేరతాం.. మీరు వెళ్ళండీ.." అంటారన్నమాట. అప్పుడు మనం "సారీ అండీ.." అంటూ వాళ్ళతో పాటే బయట పడతామన్నమాట. అదన్నమాట.

2 వ్యాఖ్యలు:

భావన said...

super idea lalitha. keep posting. ;-)

మాలా కుమార్ said...

మీ అవిడియాలు మేము తప్పక పాటిస్తాము, కాని ఇందువలన మీ మీద జరిగే దాడులకు మాది బాధ్యకాదు.
సూపర్ డూపర్ ఐడియాల కోసం చూస్తూనే వుండండి శ్రీలలిత బ్లాగ్ !