Pages

Monday, August 3, 2009

అలాగన్నమాట.

ఇచ్చట ఉచితముగా సలహాలు ఇవ్వబడును.

సమయం: అన్నివేళలా ( మీరు క్యూలొ వున్నారు. దయచేసి వేచియుండండి.)

గమనిక: ఒకసారి తీసుకున్న సలహా వాపసు తీసుకొనబడదు.

హెచ్చరిక: ఎవరు చేసుకొన్న ప్రయోగానికి వారే బాధ్యులు.


మనం ఒక్కొక్కసారి కొన్ని వస్తువులు ఎక్కడో మర్చిపోయి ఇంటికి వచ్చేస్తూంటాం. తీరా ఇంటికొచ్చాక అవి మర్చిపోయామని చెపితే ఇంట్లో ఏమి గొడవ జరుగుతుందోనని మరోవైపు భయం. అలా అస్సలు భయపడకూడదు. దానిని మనం మనకి అనుకూలంగా మార్చుకోవాలి. అదెలాగంటే...

మనం అన్నయ్యింట్లో సెల్ ఫోన్ మర్చిపోయి వచ్చామనుకోండి. అది ఆఫీస్ నుండి వస్తూ తెమ్మని శ్రీవారికి ఎలా చెప్పాలంటే..

(పబ్లిక్ ఫోన్ నుండి) " హలో.. నేనేనండీ... మీకు గుంటూరుగోంగూర ఇష్టంకదా.. అన్నయ్య ఎవరిచేతో ఇవాళ తెప్పిస్తానని చెప్పాడు....(అబ్బే...వుత్తినే...) వస్తూ,వస్తూ అలా అన్నయ్యింటికెళ్ళి గోంగూర తీసుకురండి. రేపు కమ్మగా పచ్చడి చేసి పెడతాను.." గురుడు అన్నయ్య ఇంటికి వెళ్ళకుండా ఇంటికి రాగలడా..ఎలాగూ అక్కడికి వెళ్ళినప్పుడు మీ ఫోన్ మీ అన్నగారు ఇవ్వకుండా ఉండరుకదా...అలాగన్నమాట.

8 వ్యాఖ్యలు:

సుభద్ర said...

అమ్మ దో౦గ...
మీ వారి ఈమైల్ అడ్ర్ స్ చెప్ప౦డి.
మీ బ్లాగ్ లి౦క్ పొస్ట్ చెస్తా.

మంచు పల్లకీ said...

హమ్మ..హమ్మ.. పాపం/మోసం కదా ?
ఇప్పుడె ఒక పాత అర్టికల్ చదివాను.. మీరు చూడండి ఇక్కడ..
http://jyothivalaboju.blogspot.com/2008/05/blog-post_19.html

మీకు నచ్చుతుందెమో ?

భావన said...

సూపర్ ఐడియా. :-)

చిలమకూరు విజయమోహన్ said...

అయినా ఇదేంటండి గోంగూర మార్కెట్ లో దొరుకుతుందిగానీ అన్నయ్యల ఇళ్ళలో దొరుకుతుందా! :)

కొత్త పాళీ said...

చాలా మంచి ఐడియా. మా ఆవిడ వాళ్ళన్నయ్య హాంకాంగులో ఉంటాడు. ఆయన ఇంటో హాంకాంగు స్పెషలు పీతలు ఉండచ్చేమో, గుంటూరు గోంగూర మాత్రం కచ్చితంగా ఉండదు. ఉందంటే హాంకాంగైనా వెళ్ళి తెచ్చేవాడినే :)

నేస్తం said...

గుడ్ ..గుడ్ మీరిలా సలహాలు చెప్పేయండి నేనలా ఒక బుక్ లో రాసేసుకుంటూ ఉంటాను :)

Anonymous said...

ఆశ్లేషవాళ్ళకి అత్తగారుండదనేది కేవలం మూఢవిశ్వాసమే. నక్షత్త్రాల్లో మంచీ, చెడు అనే రకాలున్నమాట నిజమే. చెడు నక్షత్త్రాల్లో పుడితే శాంతి చేసుకోవాలన్నారు పెద్దలు. అంతేతప్ప ఏకంగా మనుషులే చచ్చిపోతారని ఎక్కడా రాయలేదు. గండాలుంటాయన్నారు. గండం (Risk) గండమే తప్ప మరణం కాదు.

ఆశ్లేష విషయంలో అత్త అనే మాట ఎలా అపార్థం చేసుకోబడిందో తెలుసుకుంటే ఈ మూఢవిశ్వాసం ఎలా వ్యాప్తి చెందిందో అర్థమవుతుంది. సంస్కృతంలో భర్త తల్లికి శ్వశ్రూ అని, మేనత్తకి "మాతులీ/ మాతులానీ" అని వేరువేరుగా పదాలు వాడతారు. తండ్రిసోదరికి వాడే పదం కూడా వేరు (పితౄష్వసా). కానీ తెలుగులో వీటన్నింటికీ "అత్త" అని ఒక్కటే సంబోధన. అందుచేత ఇక్కడ మనకర్థమయ్యేదేంటంటే ఆశ్లేష విషయంలో చెప్పబడిన అత్త మేనత్తే తప్ప భర్త తల్లి కాదు అని ! ఎందుకంటే పుట్టగానే ఏ పిల్లా ఎవరికీ కోడలు కాదు. పుట్టి కొన్ని సంవత్సరాల పాటు పెరిగినాకనే ఎవరికో ఒకరికి కోడలవుతుంది. దోషనక్షత్త్రాలు పుట్టిన వెంటనే ఫలితం చూపిస్తాయి గానీ పుట్టిన ఇరయ్యేళ్ళకి కాదు. అందుచేత బాగా పెరిగిపెద్దదయ్యాక ఆ పిల్ల నక్షత్త్రం మూలాన ఆమె అత్తకి వచ్చిపడే ముప్పేమీ ఉండదు. సంస్కృతంలో మేనత్త గురించి చెప్పినదాన్ని తెలుగులో "భర్త తల్లి" అని అనువదించుకోవడం వల్ల వచ్చిన పాట్లివన్నీ !

జ్యోతి said...
This comment has been removed by the author.