Pages

Friday, August 7, 2009

చెప్పండి..

ఇచ్చట ఉచితముగా సలహాలు ఇవ్వబడును.

సమయం: అన్నివేళలా ( మీరు క్యూలొ వున్నారు. దయచేసి వేచియుండండి.)

గమనిక: ఒకసారి తీసుకున్న సలహా వాపసు తీసుకొనబడదు.

హెచ్చరిక: ఎవరు చేసుకొన్న ప్రయోగానికి వారే బాధ్యులు.

మనవి: ఈ సలహాలు సరదాగా చదువుకుందుకు మాత్రమే వ్రాసినవి తప్పితే ఎవరినీ నొప్పించడానికి కాదు.

నేను కొత్తగా పెళ్ళయి కాపురానికి వచ్చినప్పుడు ఒక పెద్దావిడ ఇచ్చిన సలహా ఇది. అది పాటించక తరవాత చాలా ఇబ్బందులు పడ్డాను. అలా మీరు పడకూడదని మీకు ఈ సలహా..

పెళ్ళయి వెళ్ళాక ముందుగా కాస్త కూర తరిగి ఇమ్మంటారు. మనం వీర లెవెలుకి పోయి గబగబా తరిగి ఇచ్చెయ్యకూడదన్నమాట. అలా ఇచ్చేస్తే మళ్ళీ వెంటనే ఇంకో పని చెప్తారు. అందుకని కేవలం రెండు పచ్చిమిరపకాయలు తరగమని ఇచ్చినా సరే... కత్తిపీట ముందు కూర్చుని వాటిని నెమ్మదిగా అలా అలా అలా తరుగుతూనే వుండాలన్నమాట.. అప్పుడు ఇంకొక పని చెప్పె అవకాశమే లేదు కదా.. ఈ పనే తెమలనిదే ఇంకొ పని ఎలా చెప్తారు చెప్పండి..

5 వ్యాఖ్యలు:

మాలా కుమార్ said...

ఆ పచ్చిమిరపకాయలు ఐపోయాక ఓ ఉల్లిపాయ ( చెప్పక పోయినా సరే ) తరుగుతూ , తీరిగ్గా కళ్ళనీళ్ళూ పెట్టుకుంటే సరి ,జన్మలో పని చెప్పరు .!

భావన said...

ఈ ఐడియా కు తిరుగు లేదు.. 100% పక్కా, మాల గారు చెప్పింది కలిపితే కేక.. :-)

Padmarpita said...

మాలగారు అన్నట్లు ఉల్లిపాయని తరగండి...కాని కళ్ళలో నీళ్ళు వస్తే పచ్చిమిరపకాయల్ని కోసిన చేత్తో మాత్రం తుడుచుకోవద్దు:)

మధురవాణి said...

SUPER IDEA ;)

Navya said...

hahahaha.....ee idea maa atthayya (ante maa amma thammudi bharya) kooda cheppindhi...ippatiki idhey paatisthu vasthondhi!!)