Pages

Wednesday, August 5, 2009

ఏమంటారు?

ఇచ్చట ఉచితముగా సలహాలు ఇవ్వబడును.

సమయం: అన్నివేళలా ( మీరు క్యూలొ వున్నారు. దయచేసి వేచియుండండి.)

గమనిక: ఒకసారి తీసుకున్న సలహా వాపసు తీసుకొనబడదు.

హెచ్చరిక: ఎవరు చేసుకొన్న ప్రయోగానికి వారే బాధ్యులు.మన ఎదురింట్లొనొ పక్కింట్లొనొ (బహుశా ఈ రోజుల్లో ఎదుటి ఫ్లాట్ పక్క ఫ్లాట్ అనాలేమొ)కొంతమంది మనుషులుంటారు. వాళ్ళు వేళా పాళా లేకుండా మన ఇంట్లోకి జొరబడిపొతుంటారు. వాళ్ళ కబుర్లు మనకి నచ్చవు. అలాగని వెళ్ళమని చెప్పలేము. బాగుండదు కదా. మన పని ఇంకా తెమలదు. . కూర కలియబెడుతూనో, పులుసు పోపు పెడుతూనో వుంటాము. ఈలోపల ఆవిడ ఇస్త్రీ చీర కట్టెసుకుని మనింటికి వచ్చేసి, మన డైనింగ్ టేబుల్ దగ్గర కుర్చీ లో కూర్చుని మనల్ని సూపర్వైస్ చేస్తున్నట్టు ఇది ఇలా చెయ్యకూడదు..అలా చెయ్యాలి అని నస పెడ్తూ ఉంటుంది మనకేమో లొపలి నుంచి ఉడుకుమోత్తనం తన్నుకుంటూ వచ్చేస్తుంటుంది. అలాంటప్పుడు ఇలా చెయ్యాలి.. "అవునుకదా.. నువ్వు అన్నీ ఎంచక్కా చెస్తావు. నాకేంటో అలా రానేరాదు" అంటూ ఓకిలో బటాణీకాయల్ని ఆవిడ ముందు పోసి వలవమంటే సరి. లేకపోతే చిక్కుడుకాయలు బాగుచెయ్యమంటే సరి. అదీ కాకపోతే ఇన్ని దొండకాయలు, కత్తిపీటా ఆవిడ ముందు పెట్టి తరిగి ఇమ్మంటే సరి. అబ్బే..ఇవన్నీ అడిగితే బాగుండదు అంటారా.. అలాంటప్పుడు కొత్తచీర, ఫాల్, సూదీ, దారం ఆవిడ కిచ్చి.. "నువ్వెంత బాగా కుడతావో.. మొన్న నాకు సరిగ్గా రానేలేదు" అని కాస్త పొగిడేస్తే అయితే మన చీరకి ఫాలూ వచ్చేస్తుంది.. లేకపోతే మనకి ఆవిడ బాధా తప్పుతుంది. మరింకెప్పుడూ మన పనివేళ వచ్చి మనని ఇబ్బంది పెట్టదు. ఏమంటారు?

6 వ్యాఖ్యలు:

చిలమకూరు విజయమోహన్ said...

భలే అవిడియా! అర్జంటుగా మా గృహమంత్రికి చెప్పాలి! మళ్ళీ వస్తా.

సుభద్ర said...

అబ్బ మీరు సుపర్అ౦డి.
భలే అవిడీయా....కెవ్వు కేక.
రాయ౦డి నేను పాలోఅయిపొతా...

సిరిసిరిమువ్వ said...

మంచి అడియాలు చెప్తున్నారు. మీ దగ్గర నేర్చుకోవలసినవి చాలా ఉన్నాయి!

భావన said...

జాగ్రత్త లలిత, ఆమె వచ్చి, మొన్న వచ్చి కూర్చున్నప్పుడు చూసేను పులుసు చాలా బాగుంది మీ అన్నయ్య/బావ/మరిది (ఎదో ఒక సంబంధం మీ అదృష్టం బాగోక పోతే మీ అంకుల్ అని కూడా సంభోదించొచ్చు) కు చాలా ఇష్టం ఇలా పెడితే అని మొహమాట పెట్టి మీ పులుసు కొట్టేసే బ్యాచ్ కూడా వుంటారు మరి.

జీడిపప్పు said...

Good idea!
ఒక ఐడియా మీ జీవితాన్నే మార్చగలదు :)

Anonymous said...

మా పెద్దత్త సరిగ్గా ఇదే పని చేస్తూ వుంటుంది. ఆమె ఇంటికి వచ్చిన అమ్మలక్కలతో తన పనులన్నింటిని చేయించుకుంటూ వుంటుంది. ఎంతైనా మా అత్త బాగా తెలివైనది.