Pages

Saturday, August 22, 2009

బంగారుతల్లి

ఆడపిల్లకి పెళ్ళి చేసి, అత్తవారింటికి పంపించాక మళ్ళీ అమ్మాయి పుట్టింటికి ఎప్పుడొస్తుందా అని తల్లీ, తండ్రీ వేయికళ్ళతో ఎదురుచూస్తూవుంటారు. అత్తవారింట్లో హుందాగా అన్ని బాధ్యతలూ నిర్వహిస్తున్నా అమ్మానాన్నలకి మటుకు ఆ బంగారుతల్లి ఎప్పుడూ చంటిపాపాయే. మా అమ్మాయి పెళ్ళయి వెళ్ళిన రెండేళ్ళకి మళ్ళీ మా ఇంటికి వచ్చింది. మర్నాడు వస్తోందని తెలిసినప్పుడు ఆ రాత్రంతా నాకు మనసు నిలబడలేదు. అప్పుడు వ్రాసుకున్న పాట.

పల్లవి--వెన్నలవాన కన్నులలోన ఎన్నడమ్మా ఇంకానూ...

చరణం--కన్నెరత్నం జంటకూడి కాననితీరం చేరింది
ముద్దులతల్లి మురిపాలవల్లి గృహలక్ష్మై విలసిల్లింది
పావురమై ఎగిరొస్తుందో చిలుకపలుకులే వినిపిస్తుందో
మరువపు మొలకై ముత్యపు జల్లై
నా మదిలోన అమృతం కురిసే..//వెన్నెల వాన//

చరణం--నాన్న కూతురని అమ్మంటే అమ్మ కీర్ష అని నాన్నంటే
ఇద్దరి వాదన తప్పేనంటూ మధ్యన చేరి ముద్దులు కురిసే//వెన్నెలవాన//

6 వ్యాఖ్యలు:

చిలమకూరు విజయమోహన్ said...

ఇప్పుడు మాదీ అదే పరిస్థితి.ఐదు నెలల తర్వాత రాబోతుంది చిన్న హీరోతో కలిసి.

మురళి said...

బాగుందండీ మీ పాట..

మరువం ఉష said...

నా తొమ్మిదేళ్ళ బంగారువల్లి మీద నా రచన ఇది "చిన్నారి పొన్నారి నా చిట్టి అమ్మలు!!!" http://maruvam.blogspot.com/2009/06/blog-post_16.html మీ టపా చదువుతుంటే గుర్తుకొచ్చింది. మన సంతానం పట్ల ప్రేమ అన్నది నిత్యవాహిని అదీ దిగువకి ప్రవహించే వరద గోదావరి అనుకుంటానండి. ఇప్పటికీ నావెంట పడి నాకు వడ్డించే నాన్నగారు, నా పిల్లల గోలలో లోకాన్ని మరిచే నేను. ఈ పాత్రలు అన్ని ఇళ్ళలోనూ పునరావృతాలే. ఆ మధ్య "అమ్మ" అని కథ చదివాను. ఆస్త్రేలియనుండి కొడుకుతో వచ్చి వాడి వొళ్ళు వెచ్చబడిందని ఆదుర్దా పడే కూతుర్ని చూసి, ఎంత చిక్కిపోయిందో అని అల్లాడే తల్లి, ఆరోగ్యం తక్కువ ఇప్పుడు ఈ కూతురు, మనవడి గోలలో పడి నీరసించిపోతుందేమో అని తల్లడిల్లే ఆమె తల్లి, ఇలా నాల్గు తరాల మూడు తల్లి ప్రేమలు కంటి నీరు తెప్పించేత, మన కుటుంబసంబంధాల పట్ల నమ్మకం నిలిపేలా వుంది ఆ రచన. Enjoy her stay. Time do not last longer but memories do forever. Earn them and treasure them.

భావన said...

బాగుందండి పాట. ఉష అన్నట్లు ఆ ప్రేమ ఒక నిరంతర గోదావరి.. enjoy her stay and share those memories with us later. :-)

శ్రీలలిత said...

పాట నచ్చినందుకు అందరికీ ధన్యవాదములు..

మాలా కుమార్ said...

chaalaa baagaa cheppaarandi .

bagundi paata