Pages

Thursday, December 17, 2009

దశాబ్దాల ప్రేమ


దశాబ్దాల ప్రేమ

ఈ మధ్య ఒకరోజు ఏ పనీ చేయబుధ్ధవక, ఏం చేయాలో తోచక తీరుబడిగా కూర్చుని టీవీ లో ఒక తెలుగు సినిమా చూసాను. అది చూసాక నాకూ తెలుగు సినిమాకి కథ రాసెయ్యాలన్నంత ఆవేశం వచ్చేసి రాసి పడేసాను. ఎవరికైనా ఈ కథ నచ్చి సినిమా తియ్యాలనుంటే ఇదిగో నా ఫోన్ నంబర్. మొహమాటపడకండేం..










దశాబ్దాల ప్రేమ

ఐదేళ్ళ పాప ఈశూ.
ఏడేళ్ళ బాబు బాచీ..
ఇద్దరూ బిస్కట్ కోసం దెబ్బలాడుకుంటుంటారు. అది ఎంతవరకూ వెడుతుందంటే ఈశూ బాచీని చాచి లెంపకాయ కొడుతుంది. బాచీ ఊరుకుంటాడా.. దెబ్బకి కళ్ళమ్మట గిర్రున నీళ్ళు తిరుగుతున్నా సరే, ఈశూని వంగదీసి నడ్డిమీద రెండు దెబ్బ లేసి మరీ బిస్కట్ తీసుకుంటాడు. విజయగర్వంతో బిస్కట్ తినబోతుంటే ఈశూ సెంటిమెంట్ మీద కొడుతుంది.
ఈశూ-- తిను.. తిను..అన్నీ నువ్వే తిను. మేం సిటీకి వెళ్ళిపోతున్నాంగా.. అన్నీ నువ్వే తిను..
బాచీ---అదేంటి?
ఈశూ-- మా నాన్నకి ట్రాన్స్ ఫర్ అయింది కదా..
బాచీ--మరి మళ్ళీ మనం ఎప్పుడు కలుసుకుందాం..
ఈశూ(సీరియస్ గా)--సరిగ్గా పదేళ్ళ తర్వాత.. నాకు టెంత్, నీకు ఇంటర్ పరీక్షలు అయ్యాక ఇక్కడే, ఈ గుడి దగ్గరే, ఇదే నెల, ఇదే సమయానికి కలుసుకుందాం...
బాచీ--- మరి మనం ఒకరినొకరం గుర్తు పట్టగలమా..
ఈశూ---దాందేముంది బాచీ. రాగానే ఇప్పట్లాగే నేను నిన్ను లెంపకాయ కొడతాను.
బాచీ---అప్పుడు నేను నీ వీపు మీద నాలుగేస్తాను..
ఈశూ---ఒ..కె..
బాచీ---ఒ..కె..
పదేళ్ళ తర్వాత--------------
పదిహేనేళ్ళ ఈశూ, పదిహేడేళ్ళ బాచీ---అదే చోట-- అదే సమయం...
ఇద్దరూ చెరోవైపునుంచీ వస్తారు. ఒకరినొకరు దీర్ఘంగా చూసుకుంటారు. చూసి చూసి ఈశూ బాచీని ఛెళ్ళుమంటూ చెంపదెబ్బ కొడుతుంది. సంతోషంగా బాచీ ఈశూ వీపు మీద నాలుగు దెబ్బలేస్తాడు. పకపకా నవ్వుకుంటారు.
ఈశూ---మరి వెళ్తాను బాచీ.. మళ్ళీ ఎప్పుడు?
బాచీ---మళ్ళీ ఇలాగే సరిగ్గా పదేళ్ళకి.....ఇక్కడే....ఈ టైమ్ కే..
ఈశూ---ఒ..కె..
బాచీ---ఒ.కె..
మరో పదేళ్ళ తర్వాత-------------
ఇరవై అయిదేళ్ళ ఈశూ, ఇరవై యేడేళ్ళ బాచీ---అదే చోట--అదే సమయం...
ఇద్దరూ చెరోవైపునుంచీ వస్తారు. ఒకరినొకరు దీర్ఘంగా చూసుకుంటారు. చూసి చూసి ఈశూ బాచీని ఛెళ్ళుమంటూ చెంపదెబ్బ కొడుతుంది. సంతోషంగా బాచీ ఈశూ వీపు మీద నాలుగు దెబ్బలేస్తాడు. పకపకా నవ్వుకుంటారు.
ఈశూ---మరి వెళ్తాను బాచీ.. మళ్ళీ ఎప్పుడు?
బాచీ----ఈసారి ఇరవై యేళ్ళకి కలుద్దాం....ఇక్కడే...ఈ టైమ్ కే...
ఇరవై యేళ్ళ తర్వాత------------
నలభై అయిదేళ్ళ ఈశూ, నలభై యేడేళ్ళ బాచీ---అదే చోట--అదే సమయం...
ఇద్దరూ చెరోవైపునుంచీ వస్తారు. ఒకరినొకరు దీర్ఘంగా చూసుకుంటారు. చూసి చూసి ఈశూ బాచీని ఛెళ్ళుమంటూ చెంపదెబ్బ కొడుతుంది. సంతోషంగా బాచీ ఈశూ వీపు మీద నాలుగు దెబ్బలేస్తాడు. పకపకా నవ్వుకుంటారు.
ఈశూ---మరి వెళ్తాను బాచీ.. మళ్ళీ ఎప్పుడు?
బాచీ----ఈసారి కూడా ఇరవై యేళ్ళకి కలుద్దాం....ఇక్కడే...ఈ టైమ్ కే...
మరోఇరవై యేళ్ళ తర్వాత------------
అరవై అయిదేళ్ళ ఈశూ, అరవై యేడేళ్ళ బాచీ...అదే చోట...అదే సమయం..
ఇద్దరూ చెరోవైపునుంచీ వస్తారు. ఒకరినొకరు దీర్ఘంగా చూసుకుంటారు. చూసి చూసి ఈశూ బాచీని ఛెళ్ళుమంటూ చెంపదెబ్బ కొడుతుంది. సంతోషంగా బాచీ ఈశూ వీపు మీద నాలుగు దెబ్బలేస్తాడు. పకపకా నవ్వుకుంటారు.
బాచీ---ఇంక చాలు బాబూ. ఈ ఆట నేనాడలేను..
ఈశూ--- ఎందుకాడలేవు? రోజూ నీతో కలిసే ఉంటున్నా ఇన్ని సంవత్సరాల కొక్కసారే నాకు నీ చెంపలు వాయించే అవకాశం వస్తోంది. మిగిలినప్పుడంతా నీ మాట దాటకుండానే నీతో సంసారం చేస్తున్నానుగా. ఈ సంతోషం కూడా నాకు దక్కనీవా?
బాచీ---అదికాదు ఈశూ, మరీ అరవై యేళ్ళు దాటాక నీ వీపు మీద దెబ్బలెయ్యడం నాకు కష్టం గానే ఉంది సుమీ...




॑॑॑॑॑॑॑॑॑॑॑॑॑॑॑॑॑॑॑॑॑॑॑॑॑॑॑॑॑॑॑॑॑॑॑॑॑॑॑॑॑॑॑॑॑॑॑॑॑॑॑॑॑॑॑॑॑॑॑॑॑॑॑॑॑॑॑॑

18 వ్యాఖ్యలు:

నాగప్రసాద్ said...

హ హ హ చివర్లో ట్విస్టు సూపర్...

ఈ సినిమా ఖచ్చితంగా "మగధీర" సినిమా రికార్డులను బద్ధలు కొడుతుంది. :)

కథ రైట్స్ నాకెంతకు అమ్ముతారు. :)

మరువం ఉష said...

భలే, అందుకే మా ప్రొటోకాల్ వేరు. పైగా పోయే వరకు ఫాలో అవగలిగేది. మీకు చెప్పనప్పుడే నా కథలో వ్రాస్తాను. మీది సినిమాగా వచ్చేసరికి నాది పోటీగా రిలీజ్ చేస్తాను ;)

మాలా కుమార్ said...

హ హ హ ,
భలే రాసారు . సూపర్ హిట్ , సినిమా .

Kalpana Rentala said...

శ్రీలలిత గారు, సరదా గా రాసి చివర్లో మంచి మలుపు తిప్పారు. బావుంది.

sunita said...

హహహ! బాగుంది. ఈ కధ ఆ చెత్త సినిమా డైరెక్టర్ చూస్తే బాగుండు. జనం ఎంత చీదరించుకుంటున్నారో తెలుస్తుంది. మీరు చివర్లో రాసిన ట్విస్ట్ మూడోసారి చెంపదెబ్బలకే కనపడాలికదా? ఆ వూసే లేదేమిటి? అనుకున్నా!శ్రీ లలితగారూ మీ క్రియేటివిటీ మెచ్చుకుని తీరాలంతే!

శ్రీలలిత said...

నాగప్రసాద్ గారూ,
నెనర్లు. రైట్స్ మాట తర్వాత ముందు బేరం కుదరాలిగా... అసలే డిమేండ్ ఎక్కువగా ఉంది.

మరువం ఉషగారూ, హమ్మా..
నాతో పోటీకొచ్చేద్దామనే...
సరియా... మాతో...సమరాన నిలువగలరా...?

మాలాకుమార్ గారూ,
ధన్యవాదాలు..

కల్పనగారూ,
నెనర్లు..

సునీతగారూ,
మీకు నెనర్లు. చెంపదెబ్బలు బలే లెక్కపెట్టేరే..

సిరిసిరిమువ్వ said...

కథ సూపర్..100 రోజులు గ్యారంటీ.

అయినా అంత ఓపికగా ఆ సినిమా చివరిదాకా కూర్చుని చూసినందుకు మీకు అభినందనలు.

జ్యోతి said...

లలితగారు,
మీ స్కిప్ట్ పట్టుకుని మా ఇంటికి వచ్చేయండి. ఫిల్మ్ నగర్ వెళదాం. వచ్చింనంతకాడికి అమ్మేసుకుందాం. అంటే మీది చేతివాటం నాది నోటివాటం కదా. అందుకే మనం అన్నా. కమీషన్ ఇవ్వాలి మరి..

జయ said...

సరె కానియ్యండి శ్రీ లలిత గారు. మీ సినిమా రిలీజ్ అయ్యాక ఏదో విధంగా చూస్తాంలెండి. ఎంతైనా ఫ్రెండ్ షిప్ కోసం ఏమైనా చేయలికదా:)

శ్రీలలిత said...

సిరిసిరిమువ్వగారూ,
నెనర్లు..హు.ఏమిటో నాకు ఓపిక కొంచెం ఎక్కువేనండీ..

జ్యోతీగారూ, ఈ డీల్ ఏదో బాగున్నట్టుందే.. తెల్లారకుండా మీ ఇంటిముందుంటా..నెనర్లు..

కార్తీక్ said...

చివ్వరిలో బావుంది భలే రాసారు :) :)
www.tholiadugu.blogspot.com

కార్తీక్ said...
This comment has been removed by the author.
కార్తీక్ said...
This comment has been removed by the author.
కార్తీక్ said...

శ్రీలలిత అక్క మీరు చెప్పిన సూచన "ఓటి బిందెల సొట్టలం " , బావుంది కాని

" మట్టి కుండల సోట్టలం " అని రాయడానికి కారణం వివరించాను ఒక సారి చూడండి

https://www.blogger.com/comment.g?blogID=8331933733505552241&postID=8200016075401509301

పరిమళం said...

హ హ హ భలేకధ!
@ జ్యోతీగారూ!:) :)

శ్రీలలిత said...

జయగారూ, చూసారా..ఫ్రెండ్ షిప్ కోసం ఎలాంటి పిచ్చి సినిమాలు చూడాలో..మీ సానుకూల స్పందనకి నా నెనర్లు..

శ్రీలలిత said...

కార్తిక్, బాగుంది..

శ్రీలలిత said...

పరిమళగారూ,
తెలుగు సినిమా కథ కదండీ.. అలాగే ఉంటుంది..