Pages

Thursday, January 28, 2010

పెద్ద చిక్కొచ్చిపడింది...


సీతకి ఇప్పుడు పెద్ద చిక్కొచ్చిపడింది. మామూలుగా పండగలొచ్చినప్పుడూ, ఇంట్లో ఏదైనా ఫంక్షన్ జరిగినప్పుడూ,ఎవరినైనా ఇంటికి భోజనానికి పిలిచినప్పుడూ మనం స్పెషల్స్ చేస్తూ ఉంటాం. దానికోసం ప్రత్యేకం అందుకు అవసరమైన పదార్ధాలు కొని తెస్తూంటాం. తీరా ఆ అవసరం గడిచిపోయాక తెచ్చిన పదార్ధాలలో కొన్ని కొన్ని మిగిలిపోతూ ఉంటాయి. అవి పూర్తిగా ఒక అయిటం అవవు. పోనీ అని పడేయబుధ్ధీ వెయ్యదు. అలాగే సీత కూడా ఫ్రెండ్స్ వచ్చారని బోల్డు వస్తువులు తెప్పించింది. వాళ్ళు వెళ్ళాక చూస్తే అందులో కొన్ని కొన్ని మిగిలిపోయాయి. అవేం చెయ్యాలో సీతకి అర్ధం కావటం లేదు. . అదీకాక మనం ఫ్రిడ్జ్ లోకి ఒకసారి తొంగిచూస్తే నిన్న చిన్న కప్ లో పెట్టి మర్చిపోయిన పప్పుముద్ద, కాస్త ఉడకబెట్టిన కార్న్, పిల్లలు తింటారని చేసిన స్నేక్ మిగిలిపోయింది అన్నీ కనిపిస్తాయి. అటువంటివి మిగిలిపోయినప్పుడు వాటితో ఏమి చెయ్యవచ్చో చెపుతారని ఈ సమస్య అందరిముందూ పెడుతున్నాను.
అలాగని అన్నం మిగిలితే పులిహార కలుపుకోవచ్చు లాంటివి అందరికీ తెలుసు కనుక అవికాకుండా, వేరే పదార్ధాలేవీ ఎక్కువ వెయ్యకుండా, ఉన్నవాటితో రుచికరంగా, మైన్ మీల్ కి సైడ్ డిష్ గా కాని, స్వీట్ గా కాని, హాట్ గా కాని, స్నేక్ గా కాని ఏదైనా సరే కొన్న వస్తువు పాడుచేసుకోకుండ చెల్లిపోయేదిగా తయారయే అయిటమ్ చెపితే బాగుంటుంది. మామూలుగా ఇంట్లో ఉండే ఉప్పూ, చింతపండు, మిరపకాయలు, చక్కెర, బెల్లం వంటివి వాడుకోవచ్చు. ఏదైనా కొన్న వస్తువు వృధా కాకుండ చూసుకోవడం ముఖ్యం..
ఇంతకీ మొన్న వచ్చిన ఫ్రెండ్స్ వెళ్ళగా సీత ఇంట్లో మిగిలిపోయిన పదార్ధాలివీ..
1. చిన్న కేబేజీ ముక్క,

2.10 దొండకాయలు


3. 4 బెండకాయలు


4. 2 టమోటాలు5. 2 వంకాయలు

6. సగం ముల్లంగి దుంప
7.ఒక కప్పు పంచదార పాకం8.బ్రెడ్ అంచు ముక్కలు నాలుగు. (మధ్యలో ముక్కలు అందరూ తినేసి, అంచు ముక్కలు అట్టిపెట్టేస్తారుకదా)


9.పచ్చి బఠాణీలు ..అర కప్పు10. (పన్నెండు గంటలు నానబెట్టిన) డబల్ బీన్స్..అరకప్పు.


11.కాల్చిన అప్పడాలు..నాలుగు


12. కలిపిన గోధుమపిండి


17. పనీర్ ...ఆరు ముక్కలు
సీత సమస్య తీరుస్తారుకదూ...

10 వ్యాఖ్యలు:

kri said...

1,మిగిలిపోయిన పనీర్ ముక్కలని చేతులతో కొంచం నలిపి దానికి పచ్చి మిరపకాయలూ ఉల్లిపాయలు చేర్చి ఉప్పు కలిపి దానితో పరాంఠాలు కాల్చండి.
2 .పప్పుముద్ద(ఏ పప్పయితే చెప్పలేదు కానీ) దాన్ని గట్టిగా ఉడికించి చల్లారిన తరువాత దానిలో అల్లం పచ్చి మిరపకాయల ముక్కలు కొంత ఆమ్‌చూరు(ఎండిన మామిడికాయల పొడినీ) కలిపి ఉప్పుకారం కలిపి దానితో పరాంఠాలు చేసుకోండి. కావాలంటే ఉడకపెట్టిన కోర్నలని కూడా నలిపి దానిలో కలపండి.
౩. మిగిలి ఉన్న ముల్లంగి దుంపని తరిమితే దాన్ని ఏ పరాంఠాలలోకైనా పెట్టవఛు. కాకపోతే దానిలో కొంచం ఉప్పు కలిపి ఒక నిముషం ఆగి దానిలో రసం పిండివేయడం మరచిపోకండి. ఆ రసం తిరిగి గోధుమ పిండిలో కలుపుకోవచ్చు.
4. మిగిలి ఉన్న బ్రెడ్ ముక్కల అంచులని ఎండపెట్టుకొని పొడి చేసి దాన్ని మీరు బంగాళదుంపల కూరలో ఆఖర్ని కలపండి. రంగు చూడండి. వాటిని చక్కగా పొడిపొడిగా చేస్తే రంగునీ మరియు రుచినీ కూడా అందిస్తాయి.
5. పచ్చి బటాణీలు మరియు బీన్సుని కొంచం నూనెతో వేయించి అన్నంలోకి కలిపి కలపండి.
వీటన్నికిటికీ జీలకర్ర మాత్రం తప్పక అవసరం.అజీర్తి కావాలనుకోకపోతే కొంచం వావాలని కలపండి.
సీతగారూ ఇది సులభమైనది. ప్రయత్నించి చూడండి.

kri said...

అన్నట్టు మరచిపోయేను. పంచదార పాకంలో మైదా కానీ లేక గోధుమపిండి కానీ 2 నిముషాలు కలిపి కొంచం పలుచగా ఉన్నప్పుడే పెనాన్ని వేడి చేసి దాని మీదన ఒక చుక్క నూనెవేసి ఒక చంచాతో పారేలా ఆ మిశ్రమాన్ని వేయండి. పొయ్యి తక్కువ సెగలో పెట్టి కాలిన తరువాత తిని చూడండి.

భావన said...

నేనైతే అంతగా ఈ విషయం లో సలహాలు ఇవ్వలేను కాని జనాలిచ్చిన సలహాలను ఎంచక్క గా పాటించేస్తా మా ఇంట్లో మిగిలిన వాటిని పారెయ్యకుండా. మంచి ఐడియా శ్రీలలిత గారు. నేనైతే అన్నిటిని చిన్న జిప్లాక్ బేగ్ ల లో పడేసి ఫ్రీజర్ లో పడేసి (అంటే నా లాంటీ సన్నాసుల కోసం పేద్ద ఫ్రీజర్ లు ఇస్తారు కదా మాకు) పులుసు అప్పుడో ఇంకా ఏదైనా చేసేప్పుడు తీసి కలుపుతా, గోధుమపిండి పారేస్తా.

Anonymous said...

అయ్యబాబోయ్......ఇన్ని పదార్ధాలు మిగిలిపోతే నేనైతే వెంటనే మావారితో ఓ రెష్టారెంట్ ఓపెన్ చేయించేస్తా
భలే మంచి టపా .......ఇంకెందుకాలస్యం పొదుపు లక్ష్మి లు అందరూ విజృంభించండి .

మురళి said...

Pch.. I am helpless :(

శ్రీలలిత said...

శ్రీ లలిత గారు
కూరలు కాసినికాసిని మిగిలిపోతే అన్నీ కలిపి" koot " చేసుకోవచ్చు. పంచదార
పాకం మిగిలిపోతే పులుసులో తీపి తినేవాళ్ళు పులుసులో వెయ్యొచ్చు.పనీర్ ముక్కలు
చిదిపి వంకాయకూర,ఆలూ కూర
చేసినప్పుడు కూర అంతా అయాక కూరమీద జల్లవచ్చు. బంగాళా దుంపలు మిగిలిపోతే కోరి
పెరుగుపచ్చడి చేసుకోవచ్చు.మిగిలిన గోధుమ పిండిలో కాస్త బియ్యపు పిండికలిపి
,పచ్చిమిర్చి ,జీలకర్ర ,ఉప్పుకారం వేసి అట్టు వేసుకు తినవచ్చు.
అది సంగతి
జ్ఞాన ప్రసూన

satya said...

(1)వంకాయలు, దొండ, బెండ, టొమటో, కాబేజీ వేయించి పచ్చడి చేస్తే కూరలు చాలా వరకూ చెల్లిపోతాయి.
(2)పనీర్,కార్న్, టొమాటో, మిర్చి ,కొత్తిమీర సన్నగా తరిగి అప్పడాల మీద ఈ సాలడ్ పెట్టి కాస్త నిమ్మరసమూ,ఛాట్ మసాలా చల్లేరంటే మసాలా పాపడ్ తయార్
(3).ముల్లంగీ,బటాణీలూ పరాఠాల తయారీకి వాడొచ్చు.
(4)పప్పు వాడి దాల్ పరాఠాలు కూడా చేయొచ్చు,లేదా వంకాయ,టొమాటో ముక్కలు వేసి పప్పు చారు పెట్టచ్చు.
(5).డబుల్ బీన్స్ ,పనీర్,బఠానీలు,గ్రైండ్ చేసిన బ్రెడ్ ముక్కలూ కలిపి కట్లెట్లు గా చేయొచ్చు.
(6) పనీరూ,బ్రెడ్ ముక్కలూ మెత్తగా నలిపి పంచదార పాకంలో కలిపి స్వీటు చేయొచ్చు.
మీ ఇంటిలొ వారి ఇష్టాన్ని బట్టి పచ్చడి లోనూ,పరాఠాల లోనూ కూరలు మిక్స్ & మాచ్ చేయండి.ఇవీ చెల్లుబడి అవ్వకపొతే తిని పెట్టడానికి మేము రెడీ.

శ్రీలలిత said...

krigaru,
మీరు చెప్పిన సూచనలన్నీ చాలా బాగున్నాయండీ.. సీత సమస్య చాలావరకు తీరినట్టే.. ధన్యవాదాలు...

భావనాగారూ,
మీరు అన్నీ భలే ఈజీగా చెప్పేస్తారండీ..

లలితగారూ,
పొదుపనేది ఇంట్లో ఇల్లాలితోనే మొదలవాలి కదండీ.. సీతకి ఎంత మంచి సలహాలందేయో చూడండి.

మురళిగారూ,
మీకు తెలీకపోయినా ఇక్కడ చదివి నేర్చుకోండి. ఏమో ఎప్పటికైనా పనికిరావొచ్చు..

ఙ్ఞానప్రసూనగారూ,
చాలా బాగా చెప్పారండీ.. కావలసినవాళ్ళు ఉపయోగించుకుందుకు బాగున్నాయి మీ సూచనలు..

సత్యాగారూ, ధన్యవాదాలండీ.. మంచి సలహాలందించారు..

మాలా కుమార్ said...

ఇంకో నాలుగు ఆలుగడ్డలు ఉడక బెట్టి , మిగిలిన కూరలు కూడా సన్నగా తరిగి ఉడకబెట్టి వాటిని వుడక పెట్టిన ఆలు తో కలిపి , గరం మసాల పొడి , పుదీనా , కొతిమీర కలిపి , మిగిలిన బ్రెడ్ కొనలుకూడా కలిపి , చిన్న చిన్న వుండలు చేసుకొని , కొద్దిగా వత్తి , పెనం మీద రగడా లాగా చేసి , చింతపండు పచ్చడి తో పెడితే ఇక చూసుకోండి ఎప్పుడూ అలానే చేసి పెట్టమంటారు మీవాళ్ళు. అప్పుడు మీకే కష్టం .
ఇలాగే మిగిలిన కూరల తో , పరోఠాలు , వెజ్ రైస్ చేసేస్తాను . అన్నం ఎక్కువగా మిగులుతే , వదియాల లా పెట్టేస్తాను . పంచదారపాకం లో గోధుమ పిండి కలిపి బిస్కెట్స్ లా చేసుకోవచ్చు . అలాగే పప్పులు , నెల చివరలో కొద్ది కొద్దిగా మిగులుతే వాటిని అన్నిటినీ కలిపి , బియ్యం కలిపి దోసలు చేసేస్తాను . లేదా అన్నిటికీ బియ్యం కలిపి , పట్టించి కారప్పూసలా చేసినా బాగుంటాయి . ఓపిక వుండాలే కాని ఏదైనా వండేయొచ్చు .

నేస్తం said...

భలే posT..మంచి సూచనలు,సలహాలందించారు