ఇవాళ మధ్యాహ్నం రెండు దాటాక మేము పని మీద హిమయత్ నగర్ వైపు వెళ్ళవలసివచ్చింది. హైదరాబాద్ లో ట్రేఫిక్ గురించి అందరికీ తెలిసే వుంటుంది. దేనికీ రూలూ, రైమూ వుండదు. టైమూ, పాడూ వుండదు. అస్తమానం ఎవరో తరుముకొచ్చేస్తున్నట్లు ముందేముందో చూసుకోకుండా దూసుకుంటూ వెళ్ళిపోవడమె. అలాంటి సమయంలో ఒకావిడ స్కూటీ మీద ముందొక చిన్న పిల్లవాణ్ణీ, వెనకాలొక మూడు నాలుగేళ్ళ పిల్లవాడిని ఎక్కించుకుని వెడుతోంది. బహుశా స్కూల్ నుంచి తీసుకొస్తోందనుకుంటాను, ఆ వెనకాల పిల్లవాడి వీపుకి స్కూల్ బేగ్ కూడా వుంది. మా ముందు వెడుతున్న ఆవిడని చూస్తున్న నేను ఒక్కసారిగా హడిలిపోయాను. వెనకాల కూర్చున్న పిల్లవాడికి పాపం పొద్దున్న ఎప్పుడు లేచాడో యేమో ఆ స్కూటీ ఊపుకి నిద్ర వస్తున్నట్టుంది.. జోగుతున్నాడు. ఇదేమీ గమనించుకోకుండా (వెనకాల పిల్లాడు కనపడడు కదా మరి) ఆవిడ స్పీడ్ గా ఆ స్కూటీ నడుపుకు వెళ్ళిపోతోంది. వెనకాల కుర్రాడు నిద్రలో అటూ ఇటూ వూగుతున్నాడు. ఆ వెనకాల వస్తున్న మాకు అది చూస్తుంటే గాభరా లాంటిది వచ్చేసింది. పిల్లవాడు ఎక్కడ పడిపోతాడో అని యెంత భయం వేసిందో. మేము గట్టిగా పిలుస్తున్నా ఆవిడకి వినపడడం లేదు. మరింక ఆగలేక మా పక్కన వెడుతున్న మోటార్ సైకిల్ ఆయనకి చెప్పాం . ఆయన ఒక్క దూకుడుతో ఆ స్కూటీ కన్న ముందుకి దూసుకుపోయి, ఆవిడని ఆపి విషయం చెప్పాడు. అది చూసాక మాకు అమ్మయ్య అనిపించింది.
ఇక్కడ నాకు అర్ధం కాని విషయం యేమిటంటే.. ఏ తల్లీ తన పిల్లవాడిని స్కూటీ మీంచి పడెయ్యాలని అనుకోదు. ఒప్పుకుంటాను. కాని చిన్న పిల్లవాడనే ధ్యాస అయినా వుండాలి కదా.. ముందు జాగ్రత్తగా ఆటో లో తీసికెళ్ళొచ్చు కదా.. ఏమీ కాదనే అంత మొండి ధైర్యం వుండడం మంచిదేనంటారా..
ఏదైనా ప్రమాదం జరిగాక బాధపడే కన్న కాస్త ముందు చూపుతో ఆలోచించడం మంచిదేమో...
10 వ్యాఖ్యలు:
Good post. I fully agree with you. When we see children stuffed into autos like sardines I always shudder at the though of its just tilting to one side. Parents should definitely take care about their children.
చదువుతుంటేనే గుండె దడగా వుంది . కొంతమంది పిల్లలని వెనకవైపున వాళ్ళ వీపుకు వీపు ఆనించుకొని , బయటకు వుండేటట్టుగా తిప్పి కూర్చోపెట్టుకుంటారు . అది కూడా సేఫ్ కాదు అనిపిస్తుంది . కార్లో కూడా డిక్కి తలుపులు తీసి కూర్చోపెడ్తారు . కాళ్ళు బయటకు వేసి , డిక్కి లో పిల్లలు కూర్చొనివుంటే నాకైతే చాలా భయం గానే వుంటుంది .
ఇటువంటి దృష్యాలు ప్రతీరోజు చూడటం అలవాటైపోయింది. అందరిదీ ఒకటే యాంత్రిక జీవితం. అదేవిటో ఎప్పుడు మార్పు ఒస్తుందో తెలియటంలేదు. ఇంకా రకరకాల సీన్స్ రోడ్ మీద కనిపిస్తూనే ఉంటాయి.
ప్చ్ ....నిజమైన అపరిచితుడు రావాలి ...ఈ వ్యవస్థ మారాలంటే !
శివగారూ, మాలాగారూ, జయగారూ, పరిమళగారూ, జీవనిగారూ,
స్పందించినందుకు ధన్యవాదాలు. జీవనిగారూ మీ సైట్ తప్పక చూస్తానండీ. నాకేమైనా తెలిస్తే తప్పకుండా చెపుతాను
అవును మీరు పెట్టిన ఫొటో చూస్తేనే కాళ్ళలో వణుకు వస్తుంది, ఏమిటో జీవితం అంటే ఎంత యధాలాపం గా తీసేసుకుంటాము కదా మనం. మంచి పోస్ట్.
sri lalitha garu mee blog baavundi.keep it up
స్వామిగారూ,
ధన్యవాదాలు..
Meeru rasindhi nootiki nooru paaLLu nizamandi..pillala vishayam lo teliso(idhi andari prasthavanalo avvadhu) teleeko intha nirlakshyam ga undatam badhakaram...school pillavadu mata sare...nenokasari oka aavida scooter venaka seat lo kurchoni nelala biddanu teesukuvelthondhi!!!
Post a Comment