Pages

Monday, January 11, 2010

సంక్రాంతి శుభాకాంక్షలుగా ఒక సంక్రాంతి పాట.



పల్లవి--దివ్యకాంతి సంక్రాంతి వనమంతా వింతకాంతి
పసిడికాంతుల ధాన్యరాశుల సుధలు చిందు నగవులరాశి..//

చరణం---ముద్దులొలుకు ముద్దబంతులు చిరునవ్వుల చేమంతులు
పుడమి ఒడిని పసిడినిచేయ హేమంత ఋతువును చేరె...//

చరణం--లోగిళ్ళమెరయు రంగవల్లులు ముంగిళ్ళ ముందు గొబ్బిళ్ళశొభ
చాటుకదా మన సంస్కృతినీ తరతరాల మన చరిత్రనీ...//





samkramti2.mp3

6 వ్యాఖ్యలు:

సిరిసిరిమువ్వ said...

మీకు సంక్రాంతి శుభాకాంక్షలు.పాట చాలా బాగుంది.

మాలా కుమార్ said...

సంక్రాంతి శుభాకాంక్షలు .
పాట బాగుందండి .

జయ said...

చాలా బాగుందండి పాట. మీకు నా హృదయపూర్వక సంక్రాంతి శుభాకాంక్షలు.

sreenika said...

అపుడపుడూ పాడుకోవచ్చా...కాపీ రైట్స్ ఏమీ లేవుగా...చాలా బాగుందండి పాట.

శ్రీలలిత said...

సిరిసిరిమువ్వగారూ, మాలాకుమార్ గారూ, జయగారూ, శ్రీనికగారూ..
మీకందరికీ పాట నచ్చినందుకు సంతోషంగా వుంది.
శ్రీనికగారూ, ఈ పాట వ్రాసింది నేనేనండీ. మా చెల్లెలు ట్యూన్ చేసింది. మా స్నేహితులందరం కలిసి ఆకాశవాణి లో పాడాము. మీకు నచ్చితే హాయిగా పాడుకోవచ్చు. అభ్యంతరాలేవీ లేవు. ఏ పాట కైనా నలుగురూ పాడితేనే కదండీ సార్ధకత. మీరు పాడతానన్నారు.. అది చాలు. ధన్యవాదాలు.

భావన said...

మీకు లేట్ గా సంక్రాంతి శుభాకాంక్షలు.పాట చాలా బాగుంది.