Pages

Monday, March 1, 2010

why women cry? ఆడవాళ్ళు ఎందుకు యేడుస్తారు?





అంతర్జాతీయ మహిళాదినోత్సవం రాబోతోంది. దాని గురించి విషయసేకరణకు అంతర్జాలం లో గాలిస్తుంటే ఒక అఙ్ఞాత రచయిత వ్రాసిన హృదయాన్ని కదిలించిన రచన ఒకటి కనిపించింది. దానిని భావానికి ప్రాధాన్యమిస్తూ తెలుగు లోకి స్వేఛ్ఛానువాదం చేసాను. ఆ రచనే ఇది.


ఒక చిన్న అబ్బాయి వాళ్ళ అమ్మ నడిగాడు.
"అమ్మా, ఎందు కేడుస్తున్నావు?"
"ఆడదాన్ని కనుక.."
ఆ తల్లి జవాబు చెప్పింది..
"నా కర్ధం కాలేదు."
అన్నాడా అబ్బాయి.
తల్లి అతన్ని దగ్గరికి తీసుకుని,
"నీకు ఎప్పటికీ అర్ధం అవదు కూడా..." అంది.
తర్వాత ఆ అబ్బాయి అతని తండ్రి నడిగాడు.
"అమ్మెందుకు ఉట్టినే ఏడుస్తుంది?"
"ఆడవాళ్ళందరూ అంతే. ఉట్టినే ఏడుస్తారు. వాళ్ళకి ఏడవడానికి కారణం అఖ్ఖర్లేదు."
తండ్రి అంతమటుకే చెప్పగలిగాడు.
ఆ చిన్న అబ్బాయి పెరిగి పెద్దవాడయ్యాడు. అయినా ఆడవాళ్ళు ఎందుకు ఏడుస్తారో అతనికి అర్ధం కాలేదు. చివరికి భగవంతుడికి ఫోన్ చేసాడు. ఆయన లైన్ లోకి రాగానే,
"ఓ దేవా...ఆడవాళ్ళు అంత గబుక్కున ఎందుకు ఏడుస్తారు?" అనడిగాడు.
ఆ ప్రశ్నకి భగవంతుడిలా చెప్పాడు....
" నేను స్త్రీని సృష్టించినప్పుడు ఆమె ప్రత్యేకంగా ఉండాలనుకున్నాను. అందుకోసమే
--ఈ ప్రపంచాన్నే అతి సులభంగా ఆమె భుజస్కంధాల మీద మోసేటంత శక్తిని వాటి కిచ్చాను.
అదే సమయంలో ఆ చేతుల మధ్య ఎవరైనా సేద దీరే విధంగా చక్కని సౌఖ్యాన్నిచ్చేటట్టు వాటిని ఏర్పాటు చేసాను.
--భావితరాన్ని ఈ లోకానికి అందించే మాతృత్వ మనే ప్రక్రియలో కలిగే వేదనకు కావలసినంత మానసిక స్థైర్యాన్నిచ్చాను.
దానితోపాటు కడుపున పుట్టిన బిడ్డలే ఆమెని కాదు పొమ్మంటే తట్టుకోగలిగేంత గుండె ధైర్యాన్నిచ్చాను.
--బాధ్యత గలవాళ్ళందరూ వదిలి వెళ్ళిపోయినాకూడా ఎవరినీ నిందించకుండా కష్టాల కడలి లాంటి సంసారాన్ని ఈదగలిగేటంత ధీరత్వాన్నిచ్చాను.
--కన్నపిల్లలే తనను కష్టాలపాలు చేసినా సరే ఆ పిల్లలనే ప్రేమించేటంత మానసిక సౌకుమార్యాన్నిచ్చాను.
--భర్తలో ఎన్ని దోషాలున్నా పట్టించుకోకుండా నిండు మనసుతో అతనిని తన హృదయంలో చేర్చుకుని సేదదీర్చగలిగే శక్తి నిచ్చాను.
--ఒక మంచి భర్త తన భార్యను ఎప్పుడూ బాధపెట్టడు అనే విషయాన్ని తెలుసుకునే విఙ్ఞత ఆమెకిచ్చాను.
అయినాసరే అప్పుడప్పుడు భర్త తప్పుచెసి ఆమె సహనాన్ని పరీక్షిస్తున్నా కూడా అతని తప్పులు పట్టించుకోకుండా ఎంతో సహనంగా అతని పక్కన నిలబడేంత క్షమాహృదయాన్నిచ్చాను.
--చివరగా రాల్చడానికి ఆమెకొక కన్నీటి చుక్క నిచ్చాను.
--ఇంతటి శక్తిస్వరూపిణికీ నేను ఇచ్చిన బలహీనత ఈ ఒక్క కన్నీటి చుక్కే.
--అది పూర్తిగా ఆమె స్వంతం. ఆమె ఎప్పుడు కావాలంటే అప్పుడు దానిని ఉపయోగించుకునే స్వేఛ్ఛ, స్వతంత్రం ఆమె కున్నాయి. "
అంటూ భగవంతుడు ఇంకా ఇలా చెప్పాడు.
" చూడు బాబూ, ఒక స్త్రీ సౌందర్యాన్ని చూడాలంటే అది ఆమె ధరించే వస్త్రాలని బట్టి ఉండదు. పైకి కనిపించే ఆమె
బాహ్యరూపాన్ని బట్టి ఉండదు. ఆమె చేసుకునే శిరోజాలంకరణను బట్టి ఉండదు.
ఒక స్త్రీ సౌందర్యం చూడాలంటే అది ఆమె కళ్ళల్లోనే కనపడుతుంది.
ఎందుకంటే ఆ విశాల నయనాలే పవిత్ర ప్రేమ నిండివుండే ఆమె హృదయానికి ముఖద్వారం."


_______________________________________________________________

ఒక అఙ్ఞాత రచయిత వ్రాసిన దీనికి మూల రచన ఈ క్రింది లింక్ లో ఉంది.
http://www.anvari.org/fun/Truth/Why_Women_Cry.html
________________________________________________________________

19 వ్యాఖ్యలు:

Sandeep P said...

చాలా చక్కగా చెప్పారు అండి. నిజంగా స్త్రీ అందం ఆమె మనసులోనే ఉంటుంది!

Malakpet Rowdy said...

తప్పు తప్పు! ఆమె ఏడుపులో ఉంటుంది :))

సుభద్ర said...

chaalaa baagundi..meeru rasi anuvadinchi manchipani cheshaaru..
very very nice.

జయ said...

స్త్రీ ఔన్నత్యం చాలా గొప్పగా వివరించిన రచన ఇది. చాలా బాగుందండి.

Anonymous said...

చాలా బావుంది. అనువాదంలా అనిపించలేదు. అభినందనలు శ్రీలలిత గారు
కన్నీరు బలహీనత అంటే నేనొప్పుకోను. కన్నీటితో మనసులోని వేదనను దించేసుకోగలగటం అదృష్టమే .ఇప్పుడు ఈ విషయంలో పరిశోధనలు జరుగుతున్నాయికూడా!

KumarN said...

బాగుంది :-). ఇక్కడ కామెంట్స్ చూస్తా ఉంటే నాకు నవ్వోస్తోందీ.
ఇట్లాంటి క్రాప్ కే ఆడాళ్ళు బాగా పడిపోతారనుకుంటా.

చదువరి said...

ఇది ఆడాళ్ళ గొప్పదనం గురించి చెబుతున్నట్టు లేదండి. ఒకవేళ ఉద్దేశం అదే అయినా.., ఫలితం మాత్రం దానికి విరుద్ధంగా వచ్చినట్టుంది.

చూడండి, "ఆడవాళ్ళు అంత గబుక్కున ఎందుకు ఏడుస్తారు?" అనేది అసలు ప్రశ్న. దానికి దేవుడు సమాధానమిచ్చాడా? ఆడాళ్ళు ఎప్పుడుపడితే అప్పుడు ఏడుస్తారు అనే సంగతి చెప్పాడు, అంతే!

ఈ దేవుడు, భక్తుడి సంవాదం ద్వారా రెండు సంగతులు మాత్రం స్పష్టపడ్డాయ్.. "ఆడవాళ్ళు గబుక్కున ఏడుస్తారు. ఎందుకేడుస్తున్నారో ఆ దేవుడిక్కూడా తెలీదు"

Ruth said...

Hi, I think I've read the original some time baack. Please do upload that also if possible. It's really beautiful !
your translation is also good :)

సత్యసాయి కొవ్వలి Satyasai said...

@శ్రీలలిత గారు
మీటపా బాగుంది. కానీ ఏడుపు బలహీనత కాదనుకుంటా.
@చదువరిగారు
"ఆడవాళ్ళు గబుక్కున ఏడుస్తారు. ఎందుకేడుస్తున్నారో ఆ దేవుడిక్కూడా తెలీదు"
:)))))

శ్రీలలిత said...

సందీప్ గారూ, నెనర్లండీ..
మలక్ పేట రౌడీగారూ, అంతేనండీ... కొందరికి ఎదుటివారి ఏడుపులోనే అందం కనిపిస్తుంది.
సుభద్రగారూ, మీకు నచ్చినందుకు ధన్యవాదాలండీ.

శ్రీలలిత said...

జయగారూ, ధన్యవాదాలండీ.
లలితగారూ, మీరన్నది నిజమేనండీ. కన్నీరు బలహీనతగా నేనూ ఒప్పుకోను. కాని ఆ రచయిత అలా వ్రాసారు. నేను అనువదించానంతే. నా మట్టుకు నాకు ఆడవారికి కన్నీరు ఒక ఔట్ లెట్ గా ఉపయోగపడి, వారికి గుండెపోటు వచ్చే ప్రమాదం నుంచి రక్షిస్తుందేమో అనిపిస్తుంది. మీరన్నట్టు దీనిగురించి పరిశోధనలు జరుగుతున్నాయి. Biological గా దీనిని prove చెయ్యడానికి పరిశోధనలు జరుగుతున్నట్టు చదివాను.

శ్రీలలిత said...

కుమార్ గారూ, మీకు ఇది క్రాప్ గా అనిపించిందా?
చదువరిగారూ, నిజమే... ఆడవారిని అర్ధం చేసుకోవడం వారిని సృష్టించిన ఆ భగవంతుడికి కూడా తెలీదు..

శ్రీలలిత said...

Ruthgaru, ధన్యవాదాలండీ..వెబ్సైట్ ఇచ్చాను కదండీ.
సత్యసాయిగారూ, నిజమేనండీ, ఏడుపు బలహీనత కాదు. కాని అది ఎవరికీ ఉండకూడదు కదా. అందుకని భగవంతుడు దానిని బలహీనతగా చెప్పివుండొచ్చు..

భావన said...

Good One.

మాలా కుమార్ said...

ఆడవారి ఏడుపు గురించి , వారిని పుట్టించిన దేవుడు కూడా చెప్పలేడు అంతే .బాగుంది .

psm.lakshmi said...

తన కుటుంబంలో వారినందరినీ అర్ధం చేసుకుని సేద తీర్చిన స్త్రీ తన గుండె బరువు కన్నీళ్ళ ద్వారా దించుకుంటుంది. అదే కుటుంబంలో వారు అర్దం చేసుకునే వారయితే వాటి అవసరం ఏ స్త్రీకీ రాదు.
చక్కగా రాశారు లలితా..అనువాదంలా లేదు.

శివరంజని said...

చాలా చక్కగా చెప్పారు అండి శ్రీలలిత గారు

vasantham said...

Chakkagaa cheppaaru..aaDavariki kanniiLLu enduku vastaayi? Vaariki sari ayina place lo hRadayam undi kaanuka, vaariki Sakthi undi kaanuka..kashta aku sahimchadaaniki...avunu..baagundi mii anuvaadam..

Vasanta Lakshmi, P.

David said...

సో మగాడు ఏం చేసినా పడుండే స్త్రీలను తయరు చేశాడన్నమాట దేవుడు. ఇన్ని లక్షణాలను ఇచ్చిన దేవుడు తప్పు చేసిన మగాడికి ఎదురు తిరగాలి అనే గుణం మాత్రం స్త్రీలకు ఇవ్వలేదు చూశారా.ఏంతయినా మగాడుకదా? మగబుద్ది ఎలా పోనిచ్చుకుంటాడు.