Pages

Monday, June 28, 2010

రంగుతోలు - నిడదవోలు మాలతి

రంగుతోలు--కథాజగత్ పోటీ
ఈ కథను మీరు ఇక్కడ చదవవచ్చు.

http://www.kathajagat.com/katha-jagattuloki-adugidandi/rangutolu---nidudavolu-malati

ఈ కథ నాకు ఎందుకు నచ్చిందంటే మనుషులందరూ భిన్న జాతులకు చెందిన వారయినా అందరిలోనూ ప్రవహించేది ఎర్రని రక్తమే అని భిన్నత్వం లో ఏకత్వం చూపించడం.
ప్రాణి భూమ్మీద పడగానే ఆడా మగా నిర్ధారించుకున్నాక వెంటనే తలయెత్తే ప్రశ్న తెలుపా నలుపా అని చెప్పుకోడంలో తప్పు లేదేమో. ఒకే యింట్లో వున్న తోబుట్టువుల మధ్య కూడా ఈ భేద భావం కనిపిస్తుంది. మరీ కొందరిళ్ళల్లో అయితే అన్నదమ్ముల పిల్లల మధ్య తేడాలు చెప్పడానికి తెల్లసూర్యం నల్ల సూర్యం అని అనడం కూడా మామూలే. ఒకింటి వాళ్ళు, ఒక ప్రాంతంవాళ్ళ మధ్యలోనే ఇటువంటి అనుభవాలున్ననీలవేణి మరి పాశ్చాత్యదేశాల్లో నివసించాల్సి వచ్చినప్పుడు జరిగిన అనుభవాల సారమే ఈ కథ.
మనిషి సంఘజీవి. ఒక్కడూ వుండలేడు. నలుగురితో కలిసి మెలిసి వుండాలనుకుంటాడు. ఆ కలవడం కూడా తనవాడయితే బాగుంటుందని సహజంగానే అనిపిస్తుంది. ఒక అపరిచిత వ్యక్తి మనకి ఎదురయితే ముందు మనం అతని భౌతిక స్వరూపాన్ని చూస్తాం. నలుపా--తెలుపా, పొడుగా--పొట్టా, లావా--సన్నమా, పెద్దా--చిన్నా, ఇలాగ. వెంటనే మనకి తెలీకుండానే మన మనసులోఒక అభిప్రాయం యేర్పడిపోతుంది. కాని అన్నింటికన్నా మనం ముందు గుర్తించేది ఒంటి రంగు. పుట్టు ఛాయా, పెట్టు ఛాయా అని పైపైన ఎన్ని పూతలు పూసుకున్నా అసలు ఒంటి రంగు పట్టినట్టు తెలుస్తుంది. అలా గుర్తించినప్పుడు దానికి సంబంధించిన పరిణామాలూ అలాగే వుంటాయి. అవి మనవాడే కలుపుకుందాం అన్న భావనా అయివుండవచ్చు లేకపోతే మనవాడు కాదనే భేదభావం కానీ, లేదా ఒక్కొక్కసారి వివక్ష కానీ అయివుండవచ్చు.
మూడేళ్ళపాప ఒక్కత్తీ రోడ్డు మీద తల్లి కోసం ఏడుస్తూ వుంటే, ఆ పిల్ల ఒంటి రంగు చూసి దూరం నుంచే సానుభూతి వాక్యాలు పలుకుతూ, నీలవేణిది కూడా ఆ పిల్ల లాగే తెల్లతోలు కాదని గుర్తించి, మీ పిల్లని చూసుకోవాలి కదా అన్నప్పుడు కలిగిన ఆశ్చర్యం కన్న-- అంత చిన్న పిల్ల కూడా కేవలం నీలవేణి ఒంటి రంగు చూసి తన జాతే ననుకుంటూ వచ్చి కాళ్ళకు చుట్టుకు పోవడం ఆమెకు మరింత ఆశ్చర్యం కలిగిస్తుంది.
తర్వాత నీలవేణిని రోడ్డు మీద అటకాయించి కొందరు వ్యక్తులు ఆమె బేగ్ లాక్కుంటున్నప్పుడు ఒక నల్లతోలు మనిషి ఆమె కోసం వాళ్ళతో దెబ్బలాడి గాయాల పాలవడంతో, పోలీసులూ, వైద్య సదుపాయం రావడంతో, కథ ముగిసినా ఆ సమయం లో నీలవేణి మనోభావాలు రచయిత్రి బాగా వివరించారు.
మనుషులు భౌతికంగా కనపడడానికి రకరకాల రంగుల్లో వున్నా ఆ మనుషులందరికీ లోపల రక్తం రంగు మటుకు ఒక్కటే కదా.. అదే ఎరుపు అంటూ మనుషులందరిలోనూ వున్న ఏకత్వాన్ని ఎత్తి చూపించడం ముగింపుకి అందమిచ్చింది.


****************************************************************************

7 వ్యాఖ్యలు:

Balu said...
This comment has been removed by the author.
Balu said...

Blog theme is very nice. Title of this story is very nice :)

శ్రీలలిత said...

బాలూగారూ,
ధన్యవాదాలండీ..

mmkodihalli said...

మీ విశ్లేషణకు మూడవ బహుమతి వచ్చింది. అభినందనలు! వివరాలకు ఇక్కడ చూడండి. http://turupumukka.blogspot.com/2010/07/blog-post_28.html వెంటనేmmkodihalli@gmail.com కు కాంటాక్ట్ చెయ్యండి.

సి.ఉమాదేవి said...

కథా శతవసంతాన మీకు అభినందనలు.

శ్రీలలిత said...

ఉమాదేవిగారూ,
ధన్యవాదాలండీ. మీ పరిచయం కలగడం సంతోషంగా వుంది. మీ రచనలు చదువుతూ వుంటాను. వాస్తవానికి దగ్గరగా వుంటున్నాయి. మీకు కూడా కథాశతావసంతాన అభినందనలు..

మాలతి said...

శ్రీలలితగారూ, మీ విశ్లేషణ ఇప్పుడే ఆలస్యంగా చూశాను. కథలో ప్రధానాంశాలనీ చక్కగా పట్టుకున్నారు. నేను కూడా ప్రధానంగా చూపదలుచుకున్నది అది మనదేశంలో రంగు అందానికి సంబంధించినది అయితే, అమెరికాలో జాతికి సంబంధించినది అని. అది మీరు చెప్పిన రెండు సన్నివేశాల్లోనూ వ్యక్తమయింది. నాకథని మీరు ఎంచుకున్నందుకు నాకు చెప్పలేనంత ఆనందంగా ఉంది!