Pages

Tuesday, May 10, 2011

తల్లీ...నిన్ను దలంచి...




తల్లీ…. భారతి….
నిన్ను తలంచి నేను పట్టిన పొత్తము ఈ విధి భంగమయ్యె
ఏమని చెప్పుదు నాదు దుస్ఠితిన్...

ఉదయమున నిను దలంతునన్న
అరుణకిరణములు సోకని నివాసమయ్యె
మనసు కుత్సాహము లేక మౌని నైతి…….

చైతన్యముతో పట్టువిడక
నీదుగురించి నాల్గు వాక్యముల్ చెప్పుదమన్న
ఏమి పాపము చేసితినొ గాని
వినెడి విద్యార్థి ఎందును కానరాడు…….

నిను తనివార పూజింప విరిసిన పూలుతేబోవ
హతవిధీ.. ఏమని చెప్పుదు ఎక్కడ కాంచిన
కృత్రిమ పుష్పరాజములె గోచరమయ్యె…..

మదిని కలవరమ్ముతో,
తెగని పట్టుదలతో,
ఎటులైన నీదు మహిమలు,
నిను పఠించిన పొసగు మహానందములు,
నీదు దీవెనచే కలుగు పుణ్యములు,
నీదుపై ఏకాగ్రతతో కలుగు అద్వైత సిధ్ధి,
మనఃపీఠమున నిను స్థాపించిన పొందు కైవల్యము,
మరి ఎందును కానరాదని తెలియచెప్పుదుమన్న
వినెడివారు కరవైరి...ఏమనందు...

తల్లీ...భారతీ..నిను కొలవగలేని దౌర్భాగ్యపు జాతి అయినది
వేద విఙ్ఞానఖని అయిన అమృతభాండము ఎదుట నుండగా
ఎడారిలో ఎండమావికై పరుగులిడు యాతన
ఈ పిచ్చి జనుల మది కెందుకొ….

చలము సేయక
నీవు వారిని చల్లగ చూసి
పెడదారి పట్టిన పిలవాని త్రోవ మరల్చి
నీ అక్కున చేర్చి బ్రోవుమ తల్లి శారదా....



-------------------------------------------

3 వ్యాఖ్యలు:

raamudu said...

Mikkili sreshtamuga unnadi.

మాలా కుమార్ said...

చాలా బాగారాశారు .

మరువం ఉష said...

http://poddu.net/?q=node/817 గుర్తుకు వచ్చింది. ప్రత్యేకించి "ఒత్తిడితో, ఒంటరితనంతో, లక్ష్యాల బరువుతో అయోమయంలోపడుతున్న నేటి పిల్లల విషయం...", ""ఇప్పటి యువతరం ఒక విచిత్రమైన పరిస్థితిలో ఉంది. చిన్నప్పటినుంచీ ట్యుటోరియల్ షాపుల్లోనూ, ఆపైన ఎందుకూ కొరగాని కమర్షియల్ కాలేజీల్లో ఏళ్లకేళ్ళు గడిపేసి, ఏ రకమైన విలువలనీ, ఆలోచించటాన్నీ నేర్వలేక, ప్రపంచంగురించీ, మనుషులగురించీ, సమాజం గురించీ ఏమీ తెలుసుకోకుండా, తెలుసుకోవాలన్న కనీస ఆరాటం కూడా లేకుండా, బోలెడు జీతాలు వచ్చే ఉద్యోగం అనే బండచాకిరిలో కుదురుకుంటారు. పెంచిన పెద్దలకికాని, చుట్టుపక్కల పెద్దరికం నటించే నక్కలకిగానీ ఈ పిల్లలు అనుభవిస్తున్న స్పిరిచ్యువల్ బాంక్‌రప్ట్సీ అసలు ఏమీ తెలియదు..." అన్న అంశాలమీదుగా వెళ్ళిన ఆ వ్యాస భాగాలు. అలాగే అక్షరాన్ని అగౌరవ పరిచే పోకళ్ళ మీదుగా ఓ నాడు నేను రాసుకున్న http://maruvam.blogspot.com/2010/02/blog-post_11.html నాటి బాధ కూడా మీలో మరొక కోణం గా స్ఫురించింది.