skip to main |
skip to sidebar
మా అమ్మమ్మ చేతి తరవాణి అమృతతుల్యం
నాకింకా గుర్తే...
పెరట్లో పాలేళ్ళు- పొలాల్లో పనివాళ్ళు
యింట్లో పసివాళ్ళు-వీధిలో కుర్రాళ్ళు
పిన్నలు పెద్దలు చుట్టపక్కాలు
ఆ ఊళ్ళో అందరికీ అన్నపూర్ణ మా అమ్మమ్మే.
మరిక మా అమ్మ...
ఉమ్మడి కుటుంబంలో పెద్దకోడలు
అత్తగారు మామగారు మరదులు తోడికోడళ్ళు
ఆదపడుచులూ-యింటి అల్లుళ్ళూ
తన పిల్లలు పరాయిపిల్లలనే తేడాలు లేకుండా
పిన్నా పెద్దా అందరికీ చల్లనితల్లి మా అమ్మే...
ఇక మా సంగతా...
పొట్ట చేత పట్టుకుని ఊళ్ళు పట్టుకు పోయినవాళ్లం
మేమిద్దరం మాకిద్దరూ అనుకున్నవాళ్ళం
యేడాదికో రెండేళ్ళకో కుటుంబాలన్నీ కలిసాయంటే
అది ఒక ఆనందహేల...
సరే మా అమ్మాయి...
ఒక్కతే కూతురితో సరిపెట్టింది
తోడుగా మరొకర్ని కనమంటే
దీనిని బాగా పెంచాలికదా అంటుంది
సంబరంగా కలిసి తిరిగే తోబుట్టువు లేక
దుఃఖంలో పాలు పంచుకునే దిక్కు లేక
ఒంటికాయ శొంఠికొమ్ములా పెరిగిన నా మనవరాలు
యిప్పుడంటుందీ...
"నాకు పెళ్ళొద్దూ..." అని
ఎందుకనడిగితే స్వేఛ్ఛకి భంగమట
మరొకరి సహవాసం కోసం తన స్వతంత్రాన్ని వదులుకోలేదుట...
అణువు అణువణువై
అణువణువు పరమాణువై
పరమాణువు పెఠిల్లుమంటె
యిక మిగిలేది శూన్యమేనని
తనకెవరు చెపుతారు...!
"రచన--ఇంటింటిపత్రిక" సౌజన్యంతో....
+++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++
అలుపెరుగని ఆలోచనాస్రవంతి...
Pages
Wednesday, May 18, 2011
ఎవరు చెపుతారు...!
మా అమ్మమ్మ చేతి తరవాణి అమృతతుల్యం
నాకింకా గుర్తే...
పెరట్లో పాలేళ్ళు- పొలాల్లో పనివాళ్ళు
యింట్లో పసివాళ్ళు-వీధిలో కుర్రాళ్ళు
పిన్నలు పెద్దలు చుట్టపక్కాలు
ఆ ఊళ్ళో అందరికీ అన్నపూర్ణ మా అమ్మమ్మే.
మరిక మా అమ్మ...
ఉమ్మడి కుటుంబంలో పెద్దకోడలు
అత్తగారు మామగారు మరదులు తోడికోడళ్ళు
ఆదపడుచులూ-యింటి అల్లుళ్ళూ
తన పిల్లలు పరాయిపిల్లలనే తేడాలు లేకుండా
పిన్నా పెద్దా అందరికీ చల్లనితల్లి మా అమ్మే...
ఇక మా సంగతా...
పొట్ట చేత పట్టుకుని ఊళ్ళు పట్టుకు పోయినవాళ్లం
మేమిద్దరం మాకిద్దరూ అనుకున్నవాళ్ళం
యేడాదికో రెండేళ్ళకో కుటుంబాలన్నీ కలిసాయంటే
అది ఒక ఆనందహేల...
సరే మా అమ్మాయి...
ఒక్కతే కూతురితో సరిపెట్టింది
తోడుగా మరొకర్ని కనమంటే
దీనిని బాగా పెంచాలికదా అంటుంది
సంబరంగా కలిసి తిరిగే తోబుట్టువు లేక
దుఃఖంలో పాలు పంచుకునే దిక్కు లేక
ఒంటికాయ శొంఠికొమ్ములా పెరిగిన నా మనవరాలు
యిప్పుడంటుందీ...
"నాకు పెళ్ళొద్దూ..." అని
ఎందుకనడిగితే స్వేఛ్ఛకి భంగమట
మరొకరి సహవాసం కోసం తన స్వతంత్రాన్ని వదులుకోలేదుట...
అణువు అణువణువై
అణువణువు పరమాణువై
పరమాణువు పెఠిల్లుమంటె
యిక మిగిలేది శూన్యమేనని
తనకెవరు చెపుతారు...!
"రచన--ఇంటింటిపత్రిక" సౌజన్యంతో....
+++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++
Categories
- . ప్రొఫెసర్ గారి భార్య (2)
- ఆహ్వానం (1)
- ఉచితసలహాలు (9)
- కథ (1)
- కథావిశ్లేషణ (1)
- పండగలు (12)
- పండుగలు (5)
- పురస్కారం (1)
- పుస్తక ప్రచురణ.. (2)
- పెద్దలు చెప్పిన మాట (1)
- ప్రకటన (1)
- ప్రకృతి అందాలు.. (1)
- ప్రచురణలు (59)
- ప్రార్ధన (6)
- మనసులో మాట (23)
- మా నాన్నగారు... (8)
- విన్న పాట (1)
- శుభాకాంక్షలు... (1)
- శ్రధ్ధాంజలి.. (2)
- సమీక్ష (8)
- సరదాగా (18)
- స్వగతం... (2)
- స్వాగతం (1)
Blog Archive
- July (1)
- October (1)
- September (1)
- August (1)
- July (3)
- June (1)
- May (1)
- April (1)
- March (1)
- February (1)
- January (2)
- December (1)
- November (2)
- October (1)
- September (1)
- August (3)
- July (2)
- June (2)
- April (2)
- March (1)
- February (1)
- January (2)
- December (1)
- November (2)
- October (1)
- September (3)
- August (2)
- April (1)
- March (1)
- November (1)
- October (3)
- September (1)
- August (1)
- July (2)
- June (2)
- May (1)
- March (1)
- November (1)
- October (2)
- September (1)
- February (1)
- December (1)
- November (1)
- October (2)
- May (2)
- April (1)
- January (1)
- December (1)
- October (2)
- September (1)
- August (1)
- July (2)
- June (2)
- March (1)
- February (1)
- January (1)
- November (1)
- April (2)
- March (3)
- February (1)
- January (1)
- December (2)
- November (1)
- October (5)
- August (4)
- April (3)
- February (1)
- January (4)
- December (4)
- November (2)
- October (3)
- September (1)
- July (2)
- June (3)
- May (2)
- April (3)
- March (4)
- February (2)
- January (3)
- December (1)
- November (1)
- September (1)
- August (3)
- July (4)
- June (3)
- May (1)
- March (2)
- February (2)
- January (3)
- December (3)
- November (4)
- October (4)
- September (2)
- August (15)
- July (4)
Followers
Powered by Blogger.
నాగురించి...
ఇటీవలి వ్యాఖ్యలు
Categories
- . ప్రొఫెసర్ గారి భార్య (2)
- ఆహ్వానం (1)
- ఉచితసలహాలు (9)
- కథ (1)
- కథావిశ్లేషణ (1)
- పండగలు (12)
- పండుగలు (5)
- పురస్కారం (1)
- పుస్తక ప్రచురణ.. (2)
- పెద్దలు చెప్పిన మాట (1)
- ప్రకటన (1)
- ప్రకృతి అందాలు.. (1)
- ప్రచురణలు (59)
- ప్రార్ధన (6)
- మనసులో మాట (23)
- మా నాన్నగారు... (8)
- విన్న పాట (1)
- శుభాకాంక్షలు... (1)
- శ్రధ్ధాంజలి.. (2)
- సమీక్ష (8)
- సరదాగా (18)
- స్వగతం... (2)
- స్వాగతం (1)
సుస్వాగతం ..
Copyright 2010 Shining Glow . Powered by Blogger
Blogger Templates created by Deluxe Templates Wordpress by thebookish
16 వ్యాఖ్యలు:
బాగా రాశారు . బాగుంది .
చాలా చాలా బాగుంది. మీరు రాసినది రచన పత్రికలో ప్రచురించారాండీ ?
కవిత చాలా బాగుందండి. భవిష్యత్తులో ఇంకా ఎలా ఉంటుందో. మాకంతా 'ఒంటి పిల్లి రాకాసులే ':)
మాలాగారూ,
కవిత నచ్చినందుకు ధన్యవాదాలండీ...
తృష్ణగారూ,
ధన్యవాదాలండీ.
అవునండీ..జూలై, 2004 దీనిని రచన లో ప్రచురించారు.
మొన్న ఇల్లు సర్దుతుంటే తవ్వకాల్లో బయటపడింది. బ్లాగ్ లో పెట్టాను.
గొప్ప అని కాదు కాని సమాచారం కోసమన్నమాట.. నావి కొన్నికథలు, కవితలు రచనలో వచ్చాయి.
అందులో రెండింటికి కథాపీఠం బహుమతి కూడా వచ్చింది. కొన్నింటికి పోటీల్లో బహుమతులు వచ్చాయి.
మిగిలిన పత్రికల్లో కూడా కొన్ని కథలు వచ్చాయి...
హేమిటో.. జీవితం అలా జరిగిపోతోంది.
జయగారూ, కవిత నచ్చినందుకు ధన్యవాదాలండీ..
ఇప్పటి రోజులు అలాగే వున్నాయిలెండి..
very nice.
Not only that, even subatomic particles do not exist alone :)
కొత్తపాళీగారూ,
మీ దగ్గరనుంచి కామెంట్ రావడం నాకు చాలా ఆనందంగా వుందండీ.
కవిత నచ్చినందుకు ధన్యవాదాలు..
అవునా? అండి. కథలు రాయటం ఏమీ సామాన్యమైన విషయం కాదండీ. అందులోనూ బహుమతి పొందటం అంటే really great! మరవన్నీ మా కోసం బ్లాగ్ లో పెట్టారూ?...మేం చదవద్దా మరి? త్వరగా పెట్టాండి...ప్లీజ్...
శ్రీ లలిత గారూ,
'తరవాణి' అన్న మాట చూడగానే సంతోషం కలిగింది.
తరవాణి తయారయ్యే ప్రాసెస్ తెలుసా మీకు?
శ్రీ లలిత గారూ,
'తరవాణి' అన్న మాట చూడగానే సంతోషం కలిగింది.
తరవాణి తయారయ్యే ప్రాసెస్ తెలుసా మీకు?
తృష్ణగారూ,
మీ అభిమానానికి ధన్యవాదాలండీ.
http://www.koumudi.net/Monthly/2011/january/jan_2011_kadhakoumudi_4.pdf
ఇదిగో ఈ లింక్ కి వెళ్ళి కథ చదవండి. తర్వాత నన్ను తిట్టుకోకండేం.
మల్లిగారూ,
"తరవాణి" పేరే నాకు తెలుసండీ. మా అమ్మమ్మగారు చేసేవారు. ఎలా చేస్తారో తెలీదు. యేమనుకోకండేం..
కథ బావుందండీ. కానీ నన్ను తిట్టుకోకూడదు అని ఎందుకన్నారో అర్ధం కాలేదండి...:(
కథ నచ్చినందుకు ధన్యవాదాలండీ.
అలా ఎందుకన్నానంటే...
మాకు తెలిసినవాళ్ళలో ఒకరికి వె్జిటబుల్ కార్వింగ్ అంటే మహా ఇష్టం. నేను దానిని కాస్త హాస్యంగా రాసేసరికి నాలో కళాహృదయం లేనందుకు వాళ్ళు కాస్త ఫీల్ అయ్యారు. నేను వారికి ఎంతగానో నచ్చచెప్పాను... అది ఆ సమయంలో ఆ భార్యాభర్తల మనస్తత్వం గురించి చెప్పాను తప్పితే నాకూ, ఆ భావాలకీ ఏమీ సంబంధం లేదని. ప్చ్.. వినిపించుకోలేదు.
మీరు ఏ కేటగిరీలోకి వస్తారో నాకు తెలీదు కదా.. మీరు రాసినవి చదువుతుంటే మీలో భావుకత్వం కాస్త ఎక్కువగానే కనిపిస్తోంది. అందుకని నన్ను మీరు ఎక్కడ అపార్ధం (పాత సినిమాల్లో హీరోని హీరోయిన్ అపార్ధం చేసుకున్నట్టు) చేసుకుంటారో అని అలా అన్నానన్నమాట..
అమ్మయ్య.. మీకు సరిగ్గానే వివరించానా..?
బాగా రాసారు
Post a Comment