
సత్యాగ్రహం రోజుల్లో సత్యాగ్రహం కోసమై మహాత్ముని పిలుపునందుకుని ప్రతి ఊరులోను కాంగ్రెసువారు ప్రత్యేకంగా కొంతమంది వాలంటీర్లకు శిక్షణనిచ్చేవారు. వారి పేర్లను నమోదు చేసుకొని, వరుసగా వారికి సత్యాగ్రహం చేయడానికి అవకాశం ఇచ్చేవారు. నూటనలుబది నాల్గవ సెక్షను ధిక్కరించడమనేది సత్యాగ్రహంలో ఒక భాగం. రోజూ ఉదయం పదిగంటలకు కాకినాడలోని మసీదు సెంటరుకు ఐదుగురు వాలంటీర్లు "వందేమాతరం మహాత్మాగాంధీకీ జై !" అంటూ నినాదాలు చేస్తూ వచ్చేవారు. నలుగురికన్న ఎక్కువమంది ఒకచోట సమావేశం కాకూడదనే ఆర్డరును ధిక్కరించేవారు. అప్పటికి అక్కడ సిధ్ధంగా ఉన్న పదిపన్నెండుమంది పోలీసు సిబ్బందీ వాలంటీర్లు సెంటరులోనికి రాగానే తమ లాఠీలతో వారిని కొట్టడం మొదలుపెట్టేవారు. ఆ వాలంటీర్ల శిక్షణ ఎలాంటిదంటే, లాఠీదెబ్బలు వర్షంలా శరీరంపై పడుతున్నప్పటికీ తప్పించుకోవడానికి ప్రయత్నించకూడదు. చెయ్యెత్తి ఆ దెబ్బలను వారించుకోకూడదు. అలా ఆ దెబ్బలను భరిస్తూ ఉండిపోవలసిందే. స్పృహ తప్పి క్రింద పడిపోయేవరకూ "వందేమాతరం" అంటూనే ఉండేవారు. స్పృహ కోల్పోయి రోడ్డుమీద పడిపోయినవారిని ఒక్కొక్కరినీ కాళ్ళు పట్టుకుని రోడ్డు మీద ఈడ్చుకుపోయి ముఱికికాల్వ ప్రక్క పడేసేవారు.
ఆ వాలంటీర్లకు ప్రథమ చికిత్స చేసిన వారిని, మంచినీరు ఇచ్చేవారిని నిర్బంధించి జైలుశిక్ష వేసేవారు. ఆ విధంగా వారు రాత్రివరకూ పడి ఉన్నాక, అర్ధరాత్రి పోలీసులు ఆ స్థలం నుండి కదిలిపోయేక వాలంటీర్లు వచ్చి స్పృహలేనివారిని భుజాలపై వేసుకొని తీసుకొని వెళ్ళేవారు.
ఆ సంఘటన జరిగేటప్పుడు ఆ మెయిన్ రోడ్డు పైనున్న జనం యావత్తూ రెండువైపులనున్న అరుగుల మీదకు పాఱిపోయి కండ్లవెంట నీరు కార్చేవారు. అటువంటి లాఠీచార్జికి గుఱిఅయి చనిపోయినవారు కొందరైతే, అవయవలోపంతో జీవితాంతం బాధపడ్డవారు చాలామంది.
ఈ రీతిగా లాఠీఛార్జికి గురయిన సత్యాగ్రహుల అవస్థ చూసి కూడా, మరునాడు ఉదయం 10 గంటలకు ఇంకొక అయిదుగురు వాలంటీర్లు శాసనోల్లంఘన చేయడానికి ఉద్యుక్తులై వచ్చేవారు. వారు కూడా అదే అవస్థననుభవించేవారు. ఆ రోజులలోని సత్యాగ్రహం, దేశభక్తి, ఉత్సాహం, త్యాగబుధ్ధి అలాంటిది. ఆ త్యాగమూర్తులందరూ కాలగర్భంలో కలిసిపోయారు. వారి పేర్లు కూడా చరిత్రకెక్కకుండా, సత్యాగ్రహసమరంలో ఆహుతి అయినవారు వేనకు వేలున్నారు.
ఎంతమంది నిస్స్వార్ధపరుల త్యాగఫలమో యీ స్వాతంత్ర్యం !
________________________________________________________________________
12 వ్యాఖ్యలు:
అలాంటి నిస్వార్ధపరులు ఎంతమందో ! వారి పేర్లు కూడా మనకు తెలియవు . అలాంటి త్యాగపరులు ఎక్కడో అనామకులుగా వుంటే స్వార్ధపరులు అందలాలు ఎక్కుతున్నారు . ఫ్రీడం ఫైటర్స్ పెన్షన్ అందుకునే వాళ్ళలో ఎంతమంది స్వాతంత్రసమరము లో పాలుగొన్నారు ?
ఔనమ్మా! నిస్వార్థ త్యాగ నిరతులు వారు.
మాలా కుమారిగారు చెప్పినట్టు ఆ త్యాగసంపన్నులు ఈ స్వతంత్ర భారతంలో అనామక అభాగ్యులైపోయారు.
మరి స్వాతంత్ర్య సమర యోధులమని నేడు పెంక్షన్ పొందుతున్నవారి ఆత్మలకే తెలియాలి. ఆ పెంక్షన్కి తానర్హుఁడో కాఁడో నన్న విషయం.
ఇలాంటి వారు ఎంతమంది ఎన్ని రకాల బాధలు, శిక్షలూ అనుభవిస్తే మనం ఈ నాడు స్వాతంత్రాన్నీ అనుభవిస్తున్నమో.. మాలా గారు చెప్పినట్టు అందులో చాలా మంది పేర్లు కూడా తెలియవు మనకి.. అందరికీ పేరు పేరునా వందనాలు చెప్పడమే మనం చెయ్యగలిగినది..
sree lalitha garu mee blog loki ipude pravesam. mottam chadivi comment pedatanu. mimmalni kalavadam na blog dwara ento anamdam ga undi
ఆనాటి త్యాగుల పుణ్య ఫలమే నేటి భారతదేశం
ఈ ఒక్క విషయాన్ని నేటి యువత గుర్తు పెట్టుకుంటే చాలు..
కష్టించి అప్పటి మహనీయులు అందరు మనకు స్వతంత్రం తెచ్చి పెడితే
ఇప్పుడు మనలో చాల మంది దేశాన్ని దోచుకు తినేందుకు పోటి పడుతున్నారు.
విశ్వనేత్రుడుగారూ,
మిరన్నది అక్షరాలా నిజమండీ..
రామకిష్ణరావుగారూ,
అంతేనండీ. వారి ఆత్మసాక్షే వారికి చెప్పాలి.
ప్రసీదగారూ,
అప్పుడప్పుడైనా తలచుకుని వందనాలు అర్పిద్దామనే ఈ ప్రయత్నం.
శైలబాలగారూ,
నాకూ అంతే. మిమ్మల్ని కలవడం ఆనందదాయకంగా ఉంది.
విశ్వనేత్రుడుగారూ,
మీరన్నది అక్షరాలా నిజమండీ..
చాలా బాగా రాశారు>>ఇప్పుడు వారిని చూడండి ఉష్ సిగ్గు సిగ్గు >> త్యాగధనులు వాళ్ళు అనామకులు ఎందరో నిజామీ మాలగారు..
స్వలాభమే తప్ప సమాజసేవా భావం ఎక్కడ>>
Post a Comment