Pages

Monday, April 23, 2012

ఆదివారంనాడు ఆడుతూ పాడుతూ...


ఆదివారంనాడు ఆడుతూ పాడుతూ...       




           ఏప్రిల్..22, మధ్యాహ్నం 11గంటలు...
హైదరాబాదులో ఆకాశంలో విద్యుత్ తరంగాలు ఒకదాని నొకటి ఢీకొంటున్నాయి. ఒకదానితో మరొకటి గుసగుసలాడుతున్నాయి. తొందరగా రండి.. శ్రీనగర్ పోవాలి అంటూ ఒకదానినొకటి తొందరపెడుతున్నాయి. "ఎందుకంత తొందర? ఏముందివాళ అక్కడ?" అని ఒక పిల్ల తరంగం పెద్ద తరంగాన్ని అడిగింది.
"ఇవాళ అక్కడ కొందరు మహిళా బ్లాగర్లు కలవబోతున్నారు. వాళ్ళు ఏమేం వండేసుకున్నారో, ఏమేమి చెప్పేసుకుంటున్నారో మనం వినాలి." అంది పెద్ద తరంగం.
"మామూలుగా వాళ్ళు ఏం చేస్తారు?" అడిగింది పిల్ల తరంగం.
తనకి తెలిసినంతవరకూ చెప్పింది పెద్దతరంగం. ఆ మాటలు విని అవి నిజమో కాదో చూద్దామని ఉత్సాహపడింది పిల్ల తరంగం.
అందులోమొదటిది..
వాళ్లందరూ వేలు వేలు ఖరీదు చెసే చీరలుకట్టుకుని, లక్షలు ఖరీదు చేసే నగలు పెట్టుకుని వచ్చి, అక్కడ వాటిగురించే మాట్లాడుకుంటారు.
అబ్బే.. పిల్ల తరంగానికి అలాంటిదేమీ కనిపించలేదు. పెద్దవాళ్ళందరూ చక్కటి చేనేత చీరల్లోనూ, చిన్నవాళ్ళు నిండుగా పంజాబీడ్రెస్సుల్లోనూ వున్నారు.
అక్కడ అన్నిగంటలు కూర్చున్నా ఒక్కసారి కూడా ఎవ్వరి నోటమ్మటా ఒక చీరమాట కాని, నగ మాట కాని రాలేదు.
రెండోది..
ఇంట్లో మగవాళ్లని వదిలేసి, వీళ్ళు ఇక్కడ విందులు చేసుకుంటున్నారు.
అది కూడా కాదనిపించింది ఆ పిల్లతరంగానికి. ఇంట్లోవారికి వండిపెట్టే వచ్చేరు అక్కడికి ఆడవాళ్ళందరూ. ఇంకా చెప్పాలంటే వెడుతూ, వెడుతూ ఇంట్లోవారి కోసం ఇక్కడి స్పెషల్స్ కూడా తీసికెళ్ళేరు.
పెద్దతరంగం మాటలేవీ పిల్ల తరంగానికి నచ్చలేదు. అందుకే ఆ మహిళా బ్లాగర్లను పరిశీలిస్తూ అక్కడే తచ్చాడింది.
మహిళలందరూ వస్తూ వస్తూ ఏదో ఒకటి తెచ్చారు.
"ఇచ్చుటలో వున్న హాయి...
వేరెచ్చటనూ లేనే లేదనీ.."
అన్నట్టు అందరూ ఏదో ఒకటి అందరికీ ఇవ్వడమే...
ఙ్ఞానప్రసూనగారు ఎంచక్కటి కంప్యూటర్ గ్రాఫిక్ రామాయణం పుస్తకాన్ని ఎంతో ప్రేమగా మాలాకి ఇచ్చారు.
జ్యోతి మంచి హిందీపాటలు, ఆపాతమధురాలైన తెలుగుపాటలు రికార్డ్ చేసిన సిడిలు అందరికీ ఇచ్చారు.
స్వాతి న్యూజిలాండ్ నుంచి దిగుమతి చేయబడిన చాక్లెట్ లతో అందరి నోరూ తీపి చేసింది.
ఇంక వంటల ఘుమఘుమలు సరేసరి.. ఎవరిది వారికే సాటి అన్నట్టున్నాయి.
ఒకరినొకరు ఎంతో హుందాగా పరిచయం చేసుకుని జోక్స్ చెప్పుకున్నారు. వాతావరణమంతా ఆహ్లాదకరంగా తయారయింది. అందరి మొహాల్లోనూ సంతోషం, ఉత్సాహం.
  "మిస్ గెట్ టుగెదర్" బిరుదు  వరూధినిని వరించింది. ప్రసూనగారు ఆ బహుమతి ఆవిడకి అందచేసారు.
అన్ని రుచులూ ఆస్వాదిస్తూ విందారగించారు.
ఆపైన సరదాగా గేమ్ ఆడారు. అందులో ఉమాదేవి గెలిచారు.
ఆ బహుమతి శ్రీలలిత ఉమాదేవికి అందచేసారు.
ఆ తర్వాత తంబోలా ఆడారు. ఆ పైన అంత్యాక్షరి వుండనే వుంది.
అఙ్ఞానిని చూస్తున్నట్టు నిర్వికల్పంగా జ్యోతి నవ్వుతూ చూస్తుంటే నేను ఆవేశంగా అంత్యాక్షరి ఆడేసాను.
ఇంతలో తేనీరు వచ్చేసింది. టీ తాగేసి అందరూ "పోదామా.. ఇక పోదామా" అనుకుంటూ ఇళ్ళకు మరలారు.
ఇదంతా చూసిన పిల్లతరంగం "ఎందుకు నవ్వన్నీ అబధ్ధాలు చెప్పేవ్?" అంటూ పెద్దతరంగాన్ని అడిగింది.
"ఏమో.. నాకేం తెలుసూ.. నేనలా అనుకున్నాను" అంటూ పెద్దతరంగం తన ఊహ నిజం కానందుకు బాధపడుతూ శూన్యంలో కలిసిపోయింది.
ఇదీ మహిళా బ్లాగర్ల సమావేశంలో జరిగినది.
సర్వేజనా స్సుఖినో భవంతు..
సర్వ మహిళా బ్లాగర్ల పునః కలయిక ప్రాప్తిరస్తు...
----------------------------------------------------------------------------------------- 







22 వ్యాఖ్యలు:

జ్యోతిర్మయి said...

లలిత గారూ మీదైన శైలిలో ఎంత చక్కగా వివరించారండీ....

మరువం ఉష said...

కనుకా, ఏక తరంగ ధైర్ఘ్యం గల తరుణీమణులను చూసి తరంగాలకే విద్యుద్ఘాతం తగిలి తప్పుకుపోయ్యాయన్నమాట! ;)

సి.ఉమాదేవి said...

లలిత మధురమైన మీ వర్ణనాత్మక అనుభూతుల కలబోత అందమైన కలనేత!

చెప్పాలంటే...... said...

vachinanta santosham gaa vundi mi maatallo....

psm.lakshmi said...

లలితా, మరోసారి ఆదివారం కనులముందు కదలాడింది.
psmlakshmi

psm.lakshmi said...

లలితా, మరోసారి ఆదివారం కనులముందు కదలాడింది.
psmlakshmi

జ్యోతి said...
This comment has been removed by the author.
జ్యోతి said...

ఇంతమంది ఆడవాళ్లు ఒక్క చోట చేరితే ఏం మాట్లాడతారు, లేటెస్ట్ చీరలు, నగలు తప్ప...

మనమెందుకు అలా చేయలేదబ్బా?? లాస్ట్ టైమ్ కూడా ఇలాగే జరిగింది కదా. ఒక్కరంటే ఒక్కరికి ఈ టాపిక్ ఇష్టం లేదా..
Something wrong...

మాలా కుమార్ said...

శ్రీలలిత గారు ,

బాగా రాసారండి .

వనజ తాతినేని/VanajaTatineni said...

చాలా బాగున్నాయి.. మన బ్లాగరుల కలయిక కబుర్లు. కొంచెం సేపు అక్కడ ఉన్నట్లు ఉంది.

జయ said...

మీ అనుభూతిని ఎంత చల్లగా పంచారండి. మీకు హృదయపూర్వక ధన్యవాదాలు.

శ్రీలలిత said...

జ్యోతిర్మయిగారూ,
ధన్యవాదాలండీ...

శ్రీలలిత said...

ఉషా,
అంతేకదా మరి!

శ్రీలలిత said...

ఉమాదేవిగారూ,
ఎంత అందంగా చెప్పారండీ. ధన్యవాదాలు...

శ్రీలలిత said...

చెప్పాలంటేగారూ,
ధన్యవాదాలండీ...

శ్రీలలిత said...

లక్ష్మిగారూ,
అవును కదా...

శ్రీలలిత said...

జ్యోతీ,
నిజమే. ఎక్కడో లోపముంది. అదేమిటో ఈసారి తేల్చేద్దాం..

శ్రీలలిత said...

మాలాగారూ,
ధన్యవాదాలండీ..

శ్రీలలిత said...

వనజవనమాలిగారూ,
మీ ఫీలింగ్ బాగా చెప్పేరండీ...

ధన్యవాదాలు...

శ్రీలలిత said...

జయగారూ,
మీకు నచ్చినందుకు ధన్యవాదాలండీ...

Ramani Rao said...

:)) simply superb..

srinath kanna said...

namaste lalita garu ___/\___

Adutu Paadutu chaalaabaagaa raasaarandii...raayadam kudaa oka kalaye ani mee raatalu niruupinchaayi...

peddalu cheppina maatakudaa chaalaa baavundi

maa naanna gaaru kudaa chadivesaa...annii EXCELLENTT ante nammandi....inkaa migilinavi kaasta teerika chesukoni chadivestaanu...maato mee abhiruchulu...annii share chesukonnanduku..chaalaa dhnyavaadaalu

premato
sunderpriya