Pages

Wednesday, October 29, 2014

లలితా మహిళామండలి ఇరవైయ్యొకటవ వార్షికోత్సవ సంబరాలు..



    ఈ నెల యేడవ తారీకు మంగళవారం  మా లలితా మహిళామండలి ఇరవైయ్యొకటవ వార్షికోత్సవం చాలా బాగా జరిగింది. ఆరోజు మధ్యాహ్నం పదకొండు గంటలకల్లా మా సభ్యుల్లో ఒకరయిన రాజ్యలక్ష్మిగారింటికి మేమందరం చేరిపోయాం.
ఈవిడే రాజ్యలక్ష్మిగారు.


 
 
 
      ఆ రోజు మా విందుబాధ్యతంతా ఆవిడే తీసుకున్నారు. యెంతైనా పెద్ద మనసులెండి. ఏర్పాట్లన్నీ చాలా బాగా చేసారు.
 
ఈసారి వార్షికోత్సవాలకి మా సభ్యులం అందరం యెవరికి తోచిన ప్రజ్ఞ వాళ్ళు చూపించాలని అనుకున్నాము. ఆ సందర్భంగా
 
  అంతకు ముందే జరిగిన మహాత్మాగాంధీ పుట్టినరోజుని గుర్తు చేస్తూ దుర్గ గాంధీగారి గురించి  కొన్ని విషయాలు
 
సోదాహరణంగా ప్రస్తావించారు.
 
 


                              కమలగారు తరిగొండ వెంగమాంబ జీవితం గురించి ఆసక్తికరంగా వివరించారు.




                                  గాయత్రి పోతన భాగవతంలోని పద్యాల మాధుర్యాన్ని రుచి చూపించారు.




                                                   సీత బలే బలే జోక్స్ చెప్పి నవ్వించారు.




                           శారద తెలంగాణా మాండలికంలో వినాయకచవితి కథ చెప్పి అందరినీ ఆహ్లాదపరిచారు..




                                          రామలక్ష్మి దుర్గాష్టకం చదివి అందరిలో భక్తిభావం కలిగించారు.


    రాజ్యలక్ష్మి  కొన్ని నవీన జీవితసత్యాలను చదివి అందరి కళ్ళూ తెరిపించారు. అందులో మచ్చుకి ఒకటి రెండు చెప్పాలంటే..
పెద్ద పెద్ద ఇళ్ళు-ఒంటరి సంసారాలు
పెరిగిన డిగ్రీలు-తగ్గిన కామన్ సెన్స్
ఎక్కువ జీతం- తగ్గిన మనశ్శాంతి ... లాంటివి. బాగున్నాయి కదూ..




       కళ్యాణి కస్తూరి రంగ రంగా అంటూ చిన్నికృష్ణుని పుట్టుక గురించి యెప్పటిదో పాటని మళ్ళీ అందరికీ అందజేసారు.




   ఉమాసుందరి కోడలు దిద్దిన కాపురం సినిమాలో  "నీ ధర్మం నువు మరవొద్దూ.." అంటూ అందరినీ ప్రగతి పథులని చేసారు.



               విద్యుల్లత "ఊరికే కొలను నీరు ఉలికి ఉలికి పడుతుందీ.." అని పాడి అందరినీ శబరి భక్తిలో ముంచేసారు.



       రత్న శాంతినివాసం సినిమాలో "రాగాలా సరాగాలా హాసాలా విలాసాలా.." పాటను మృదుమథురంగాపాడి అందరినీ సరాగాల ఉయ్యాలలో ఊపేసారు.



                          పద్మామూర్తి కీరవాణిరాగంలో "అంబ వాణి నన్నాదరింపవే.." పాడి వీణాపాణిని స్తుతించారు.


                                                             
                                                           మా మిగిలిన సభ్యులు..లక్ష్మీ ఆచార్య.

 

                                                                       సరస్వతి..




                                                                            సంధ్య

 

            సౌమ్య మా సభ్యురాలు కాకపోయినా మాలాంటి అమ్మమ్మలకోసం పరిదాన మిచ్చితే..పాడి ఆనందపరిచింది.




                          నేనూ, మా చెల్లెలు భారతీ టీవీ ప్రోగ్రాముల గురించి చిన్న వ్యంగ్య నాటిక లాంటిది చేసాము.

 
 
 చెప్పుకోడానికి ఆఖరున చెప్పుకున్నా అయస్కాంతంలా అందరినీ ఆకట్టేసుకుని, నాయకత్వం వహించేసి, మా అందరిచేతా హౌసీ ఆడించేసిన అమేయ సంతోషం చెప్పలేనిది. ఇదిగో అమేయ..
 
 
 
 
 
 ఇన్ని పాటలూ పాడేసుకుని, ఇన్ని కబుర్లూ చెప్పేసుకుని, ఇన్ని ఆటలూ ఆడేసుకుని మరి అసలు సంగతి చెప్పుకోకపోతే యెలా.. అదేనండీ.. విందు భోజనం.. ఇదిగో..
 
 
 
 
 
 
                                అన్నట్టు మీకు ఇంకా ఓపిక వుంటే నేనూ, భారతీ కలిసి చేసిన స్కిట్.. ఇదే..


 
 
                       అందరం కలిసి యెంచక్కా సరదా సరదాగా గడిపి సాయంత్రానికి ఇళ్లకి మరలాము..
 
-------------------------------------------------------------------------------------------------------------------- 
 


 

11 వ్యాఖ్యలు:

మాలా కుమార్ said...

మీరు చాలా ఓపికగా శ్రద్దగా మీ మహిళామండలి నడుపుతున్నారు. అందుకు మీకు మీ సభ్యులకు అందరికీ అభినందనలు.
మీ అందరికీ ఇరవైఒకటవ వార్షికోత్సవ శుభాకాంక్షలు.

Maa Aasaraa for Thalassemic Kids said...

21 years journey wow great going Akka Congrats to all your Mandali Members

psm.lakshmi said...

మీ అందరికీ 21వ వార్షికోత్సవ శుభాకాంక్షలు.
psmlakshmi

భమిడిపాటి సూర్యలక్ష్మి said...

మీకు మీ మహిళా మండలి సభ్యులకు శుభాకాంక్షలు.అభినందనలు. మా దుర్గ వదిన గారికి నమస్కారములు.

Zilebi said...

మొత్తం జిలేబి మయము గా నున్నది !!


లలితా మహిళా మండలి కి
రెండు ఒకట్ల వార్షికోత్సవానికి
శుభాకాంక్షల తో
జిలేబి

శ్రీలలిత said...

మాలగారూ, మీ అభినందనలకు ధన్యవాదాలండీ..

శ్రీలలిత said...


Thank you Madam Dechiraju..

శ్రీలలిత said...


ధన్యవాదాలు లక్ష్మిగారూ..

శ్రీలలిత said...


సూర్యలక్ష్మిగారూ, ధన్యవాదాలండీ. మీ దుర్గ వదినగారికి నమస్కారాలు అందజేస్తానండీ..

శ్రీలలిత said...


జిలేబి యంత మథురమైన పదార్థము వేరే మున్నది. ధన్యవాదములు..

Unknown said...

chaalaa baavumdi akkaa..navvochchimdi.