skip to main |
skip to sidebar
ఎందుకమ్మా నాకు తెలీలేదు..?
కష్టాలన్నీ నువ్వు పడి సుఖాలనే మా చేతి కిచ్చినప్పుడు
ఎందుకమ్మా నాకు తెలీలేదు..?
అలసటంతా నీపై వేసుకుంటే హాయిగా మేము నవ్వుతున్నప్పుడు
ఎందుకమ్మా నాకు తెలీలేదు..?
మామూలు బతుకుని నువ్వు బతుకుతూ మమ్మల్ని అందలం యెక్కించినప్పుడు
ఎందుకమ్మా నాకు తెలీలేదు..?
పచ్చని నీ బతుకుని పిండి మాకు యెరువుగా వేసి యేపుగా పెంచినప్పుడు
ఎందుకమ్మా నాకు తెలీలేదు..?
అందరం ఒక్కటయిపోయి నిన్నొక్కదాన్నీ చేసి వెక్కిరించినప్పుడు మమ్మల్ని క్షమించి నువ్వు నవ్విన నవ్వు
నా మదిలో ముద్ర పడిపోయింది.
పట్టాలెక్కిన రైలు లాగా మా దోవన మేము పరిగెడుతున్నప్పుడు -
ఎప్పుడైనా నీ గురించి ఆలోచన వస్తే
"అయ్యో.. అమ్మకి ఏమి చేసేము.?"
అనిపిస్తుంది.
అందుకే... అందుకేనమ్మా
ఇన్నాళ్ళ తర్వాత... ఇన్నేళ్ళ తర్వాత
నిన్ను తియ్యదనం లో ముంచెత్తుదామని
లడ్డూ మిఠాయి పంపితే
నువ్వు తీపి తినకూడన్నావు
నీరసంగా వున్నావనిపించి బలమైన ఆహారం ఇవ్వాలని చూస్తే
అలవాటు లేక అరగలేదంటున్నావు
పట్టు చీరెలు తెచ్చి కట్టబెడదామంటే
మెత్తటి నూలుచీరలు తప్ప మరొకటి మొయ్యలేనంటున్నావు
మరేం కావాలమ్మా అంటే...
మీరు రండి చాలు అన్నావు.
నీకు తెలుసు కదమ్మా..
పట్టాలెక్కిన ఈ రైలు గార్డు ఎఱ్ఱజెండా చూపితే తప్ప ఆగదు
ఆ ఎఱ్ఱజెండా చూసి, మేము ఆగి వచ్చేవరకూ నువ్వు కళ్ళల్లో ప్రాణాలు పెట్టుకునుంటావు
ఆ క్షణం కోసం ఒళ్ళంతా కళ్ళు చేసుకుని చూస్తుంటావు
కాని
విప్పలేని బంధాలకు కట్టివున్నాయి మా కాళ్ళు
బంధం బాధ్యతలను పెంచింది
రైలు ముందుకే పరిగెడుతోంది
వెనుతిరిగి చూసే ప్రసక్తే లేకుండా పరిగెడుతోంది
ఇంకెప్పుడమ్మా నీ దగ్గరికి రావడం..?
నిన్ను చూడడం..?
నీ ఒళ్ళో పడుకోవడం..?
పరిగెడుతున్న కాలంలో మాకు తీరిక దొరికి వెనుతిరిగి చూసే సమయానికి
నువ్వు తిరిగిరాని లోకాలకి వెళ్ళిపోయావు.
మరి... నిన్నింక చూడలేమా..?
అమ్మా..,
మేము ఇంత కృతఘ్నులుగా ఎలా మారిపోయామమ్మా..
క్షమించమని అడిగే అర్హత కూడా లేకపోయింది కదమ్మా..
ఎందుకమ్మా ఇలా చేసావు?
సన్నసన్నని వెచ్చని సెగ మాటున
మెల్లగా పిల్లగాలులు చెపుతున్న మాటలు
ఏమిటమ్మా అవి..?
అచ్చంగా చిన్నగా నువ్వు చెవిలో చెపుతున్నట్టే వున్నాయి
ఏమిటమ్మా అవి..?
నన్ను బాధపడవద్దంటావా...
నిన్ను చూసుకోలేక పోయానన్న బాధ
జీవితాంతం గుండెని పిండే ఈ బాధను ఎలా మర్చిపోగలనమ్మా.
మధన పడే ఈ మనసుకి సాంత్వన వుందా.?
వుందా..? నిజంగా వుందా...?
ఏమిటమ్మా అది..? ఎలాగమ్మా నా బాధ తీరేది..?
ఏమిటీ...
నా యింటికో చిన్న పాపవై వస్తావా
నా ముంగిటిలొ దోగాడతావా
నా ఒడిలో మురిపాలు పోతావా
నా ప్రేమనంతా ఒలకబొయ్యమంటావా
ఎంత మంచిదానవమ్మా నువ్వు
నాకెంత అదృష్టం ప్రసాదిస్తున్నావు
అలాగేనమ్మా.. తప్పకుండా
నా ఒడిలో
నా తల్లిని
నా అమ్మను
నా బంగారుతల్లిని
ఎంతో జాగ్రత్తగా
అపురూపంగా
గారాబంగా చూసుకుంటా...
రా అమ్మా మరీ
తొందరగా రా
నీ ఋణం కనీసం ఇలాగైనా తీర్చుకోనీ..
ఎప్పుడొస్తున్నావమ్మా...?
************************************************************************
అలుపెరుగని ఆలోచనాస్రవంతి...
Pages
Sunday, May 9, 2010
ఎప్పుడొస్తున్నావమ్మా....
ఎందుకమ్మా నాకు తెలీలేదు..?
కష్టాలన్నీ నువ్వు పడి సుఖాలనే మా చేతి కిచ్చినప్పుడు
ఎందుకమ్మా నాకు తెలీలేదు..?
అలసటంతా నీపై వేసుకుంటే హాయిగా మేము నవ్వుతున్నప్పుడు
ఎందుకమ్మా నాకు తెలీలేదు..?
మామూలు బతుకుని నువ్వు బతుకుతూ మమ్మల్ని అందలం యెక్కించినప్పుడు
ఎందుకమ్మా నాకు తెలీలేదు..?
పచ్చని నీ బతుకుని పిండి మాకు యెరువుగా వేసి యేపుగా పెంచినప్పుడు
ఎందుకమ్మా నాకు తెలీలేదు..?
అందరం ఒక్కటయిపోయి నిన్నొక్కదాన్నీ చేసి వెక్కిరించినప్పుడు మమ్మల్ని క్షమించి నువ్వు నవ్విన నవ్వు
నా మదిలో ముద్ర పడిపోయింది.
పట్టాలెక్కిన రైలు లాగా మా దోవన మేము పరిగెడుతున్నప్పుడు -
ఎప్పుడైనా నీ గురించి ఆలోచన వస్తే
"అయ్యో.. అమ్మకి ఏమి చేసేము.?"
అనిపిస్తుంది.
అందుకే... అందుకేనమ్మా
ఇన్నాళ్ళ తర్వాత... ఇన్నేళ్ళ తర్వాత
నిన్ను తియ్యదనం లో ముంచెత్తుదామని
లడ్డూ మిఠాయి పంపితే
నువ్వు తీపి తినకూడన్నావు
నీరసంగా వున్నావనిపించి బలమైన ఆహారం ఇవ్వాలని చూస్తే
అలవాటు లేక అరగలేదంటున్నావు
పట్టు చీరెలు తెచ్చి కట్టబెడదామంటే
మెత్తటి నూలుచీరలు తప్ప మరొకటి మొయ్యలేనంటున్నావు
మరేం కావాలమ్మా అంటే...
మీరు రండి చాలు అన్నావు.
నీకు తెలుసు కదమ్మా..
పట్టాలెక్కిన ఈ రైలు గార్డు ఎఱ్ఱజెండా చూపితే తప్ప ఆగదు
ఆ ఎఱ్ఱజెండా చూసి, మేము ఆగి వచ్చేవరకూ నువ్వు కళ్ళల్లో ప్రాణాలు పెట్టుకునుంటావు
ఆ క్షణం కోసం ఒళ్ళంతా కళ్ళు చేసుకుని చూస్తుంటావు
కాని
విప్పలేని బంధాలకు కట్టివున్నాయి మా కాళ్ళు
బంధం బాధ్యతలను పెంచింది
రైలు ముందుకే పరిగెడుతోంది
వెనుతిరిగి చూసే ప్రసక్తే లేకుండా పరిగెడుతోంది
ఇంకెప్పుడమ్మా నీ దగ్గరికి రావడం..?
నిన్ను చూడడం..?
నీ ఒళ్ళో పడుకోవడం..?
పరిగెడుతున్న కాలంలో మాకు తీరిక దొరికి వెనుతిరిగి చూసే సమయానికి
నువ్వు తిరిగిరాని లోకాలకి వెళ్ళిపోయావు.
మరి... నిన్నింక చూడలేమా..?
అమ్మా..,
మేము ఇంత కృతఘ్నులుగా ఎలా మారిపోయామమ్మా..
క్షమించమని అడిగే అర్హత కూడా లేకపోయింది కదమ్మా..
ఎందుకమ్మా ఇలా చేసావు?
సన్నసన్నని వెచ్చని సెగ మాటున
మెల్లగా పిల్లగాలులు చెపుతున్న మాటలు
ఏమిటమ్మా అవి..?
అచ్చంగా చిన్నగా నువ్వు చెవిలో చెపుతున్నట్టే వున్నాయి
ఏమిటమ్మా అవి..?
నన్ను బాధపడవద్దంటావా...
నిన్ను చూసుకోలేక పోయానన్న బాధ
జీవితాంతం గుండెని పిండే ఈ బాధను ఎలా మర్చిపోగలనమ్మా.
మధన పడే ఈ మనసుకి సాంత్వన వుందా.?
వుందా..? నిజంగా వుందా...?
ఏమిటమ్మా అది..? ఎలాగమ్మా నా బాధ తీరేది..?
ఏమిటీ...
నా యింటికో చిన్న పాపవై వస్తావా
నా ముంగిటిలొ దోగాడతావా
నా ఒడిలో మురిపాలు పోతావా
నా ప్రేమనంతా ఒలకబొయ్యమంటావా
ఎంత మంచిదానవమ్మా నువ్వు
నాకెంత అదృష్టం ప్రసాదిస్తున్నావు
అలాగేనమ్మా.. తప్పకుండా
నా ఒడిలో
నా తల్లిని
నా అమ్మను
నా బంగారుతల్లిని
ఎంతో జాగ్రత్తగా
అపురూపంగా
గారాబంగా చూసుకుంటా...
రా అమ్మా మరీ
తొందరగా రా
నీ ఋణం కనీసం ఇలాగైనా తీర్చుకోనీ..
ఎప్పుడొస్తున్నావమ్మా...?
************************************************************************
Categories
- . ప్రొఫెసర్ గారి భార్య (2)
- ఆహ్వానం (1)
- ఉచితసలహాలు (9)
- కథ (1)
- కథావిశ్లేషణ (1)
- పండగలు (12)
- పండుగలు (5)
- పురస్కారం (1)
- పుస్తక ప్రచురణ.. (2)
- పెద్దలు చెప్పిన మాట (1)
- ప్రకటన (1)
- ప్రకృతి అందాలు.. (1)
- ప్రచురణలు (59)
- ప్రార్ధన (6)
- మనసులో మాట (23)
- మా నాన్నగారు... (8)
- విన్న పాట (1)
- శుభాకాంక్షలు... (1)
- శ్రధ్ధాంజలి.. (2)
- సమీక్ష (8)
- సరదాగా (18)
- స్వగతం... (2)
- స్వాగతం (1)
Blog Archive
- July (1)
- October (1)
- September (1)
- August (1)
- July (3)
- June (1)
- May (1)
- April (1)
- March (1)
- February (1)
- January (2)
- December (1)
- November (2)
- October (1)
- September (1)
- August (3)
- July (2)
- June (2)
- April (2)
- March (1)
- February (1)
- January (2)
- December (1)
- November (2)
- October (1)
- September (3)
- August (2)
- April (1)
- March (1)
- November (1)
- October (3)
- September (1)
- August (1)
- July (2)
- June (2)
- May (1)
- March (1)
- November (1)
- October (2)
- September (1)
- February (1)
- December (1)
- November (1)
- October (2)
- May (2)
- April (1)
- January (1)
- December (1)
- October (2)
- September (1)
- August (1)
- July (2)
- June (2)
- March (1)
- February (1)
- January (1)
- November (1)
- April (2)
- March (3)
- February (1)
- January (1)
- December (2)
- November (1)
- October (5)
- August (4)
- April (3)
- February (1)
- January (4)
- December (4)
- November (2)
- October (3)
- September (1)
- July (2)
- June (3)
- May (2)
- April (3)
- March (4)
- February (2)
- January (3)
- December (1)
- November (1)
- September (1)
- August (3)
- July (4)
- June (3)
- May (1)
- March (2)
- February (2)
- January (3)
- December (3)
- November (4)
- October (4)
- September (2)
- August (15)
- July (4)
Followers
Powered by Blogger.
నాగురించి...
ఇటీవలి వ్యాఖ్యలు
Categories
- . ప్రొఫెసర్ గారి భార్య (2)
- ఆహ్వానం (1)
- ఉచితసలహాలు (9)
- కథ (1)
- కథావిశ్లేషణ (1)
- పండగలు (12)
- పండుగలు (5)
- పురస్కారం (1)
- పుస్తక ప్రచురణ.. (2)
- పెద్దలు చెప్పిన మాట (1)
- ప్రకటన (1)
- ప్రకృతి అందాలు.. (1)
- ప్రచురణలు (59)
- ప్రార్ధన (6)
- మనసులో మాట (23)
- మా నాన్నగారు... (8)
- విన్న పాట (1)
- శుభాకాంక్షలు... (1)
- శ్రధ్ధాంజలి.. (2)
- సమీక్ష (8)
- సరదాగా (18)
- స్వగతం... (2)
- స్వాగతం (1)
సుస్వాగతం ..
Copyright 2010 Shining Glow . Powered by Blogger
Blogger Templates created by Deluxe Templates Wordpress by thebookish
5 వ్యాఖ్యలు:
happy mothersday anDi.
శ్రీ లలిత గారూ !
మాతృదినోత్సవ శుభాకాంక్షలు
అమ్మ గురించి ప్రతి ఒక్కరి భావాలూ ఇంచుమించు ఇలాగే ఉంటాయేమోనండి. చాలా బాగా రాశారు. మాతృదినోత్సవ శుభాకాంక్షలు.
శ్రీ లలిత గారు, చదువుతూ ఉంటే...ఇంక తట్టుకోలేక ఏడుపొస్తోందండి. ఈ జ్ఞాపకాలు జీవితమంతా వెంటాడేవే...ఆ దేవతను తలపులతోటే పూజించుకోవాలి.
touching.......
Post a Comment