Pages

Sunday, March 20, 2011

చందురుడు దరిజేరినవేళ.. మార్చ్ 19, 2011....




అప్పుడెప్పుడో చిన్నప్పుడు..
మొట్టమొదటిసారిగా మనిషి చంద్రుని మీద కాలు మోపినప్పుడు...
చంద్రమండలమంతా రాళ్ళూ, రప్పలూ అంటూ అక్కడి మట్టి ఇంత భూమికి తెచ్చినప్పుడు...
అప్పుడు.. అప్పుడప్పుడే జాబిలి అందాల గురించి విరియబోతున్న ఊహలన్నీ ఒక్కసారి తల్లడిల్లిపోయాయి.
హేతువాదానికీ, భావుకతకీ మనసులో జరిగిన వాదులాటలో...
కవుల, రచయితల భావస్ఫూరక వర్ణనలవల్ల,
చల్లని జాబిల్లి అందాలను పాటలతో అలరించడం వల్ల...
ఆ వాదులాటలో హేతువాదం పారిపోయి..
భావుకత్వమే జయించింది.
అదిగో, అప్పట్నించీ ఆ జలతారు జరీపోగుల వెన్నెల జాలువారుతుంటే కలిగే ఆనందం నన్ను పరవశింప చేసేది.
అటువంటి పలకరింతే నిన్న పున్నమినాడు చందురుని నుంచి నాకు చేరింది.
ఆహా.. ఏమి నా భాగ్యమూ... అనుకుంటూ,
చల్లని చంద్రుని వెన్నెల కిరణాల జడిలో ఓలలాడాను..
తనువెల్లా తానమాడ
నిలువెల్లా తడిసిపోయాను..
ఎంతటి హాయి..
ఏది దీనికి మరి సామ్యము.
మది వీణలు మీట,
యెద ఊయల లూగ
చిరుగాలి పాట పాడ,
విరిబాలలు తలలూపి జతకలువ,
స్వర్గము తెచ్చి ఎదుట నిలిపినా తోసి పోనా...
దేవతలు దిగివచ్చి చేరబోయినా కాలదన్ననా..........

చందురుడు దరిజేరినవేళ.. మార్చ్ 19, 2011....


*********************************************************************************

6 వ్యాఖ్యలు:

మాలా కుమార్ said...

మీ మనసులో మాట చాలా బాగుంది .

జయ said...

ఇప్పుడు మనం చంద్రుని మీద కాలు మోపినంత ఉత్సాహంగా ఉంది మీ కవిత చదువుతుంటే శ్రీలలిత గారు.

మరువం ఉష said...

"జలతారు జరీపోగుల వెన్నెల జాలువారుతుంటే "

"స్వర్గము తెచ్చి ఎదుట నిలిపినా తోసి పోనా...
దేవతలు దిగివచ్చి చేరబోయినా కాలదన్ననా.......... "

మీ పరవశాన్ని స్పందనగా బాగా అల్లారు. అభినందనలు.

శ్రీలలిత said...

మాలాగారూ,
నా మనసులో మాట మీకు నచ్చినందుకు సంతోషమండీ...

శ్రీలలిత said...

జయగారూ,
ఎప్పటికైనా ఆ ఉత్సాహం మనందరికీ అలాగే వుండాలని కోరుకుంటున్నాను...

శ్రీలలిత said...

రసాస్వాదన తెలిసిన రసహృదయులు మెచ్చిన పదమే అందం..
కాదంటారా... ఉషా..