
కనుల నింపిన ఆశలు కల్లలాయె
బాస చేసిన విభుడు రాకపోయె
ఏమియందును విధిని యిట్లొనర్ప
ఏమిసేతును మదిని ఊరడింప....
కలికి నీకన్న మేలిమి లేదటంచు
ఒట్టు పెట్టిన మాటను గట్టు పెట్టి
ఎట్టకేగితివయ్య నన్నిట్టు కష్టపెట్టి
మరియాదయే నీకిది మాననీయ....
జాములాయెను నీ జాడ కానరాదు
జాజిమల్లెలు ఎన్నడో వాడిపోయె
జాగుసేయకు యింక నామీద ఆన
జాలి లేదేల నాసామి ఈ దీనపైన...
విడిదిలో వేచిచూచు వరుని పగిది
తొంగిచూచెను చంద్రుడు మోమాటపడుచు
అన్ని నీవంటు నాతోను నమ్మ పలికి
కానరావు నీకిది న్యాయమయ్య....
అలల సవ్వడి లేదు పూవుల ఊసు లేదు
గాలికూడ ఎక్కడ కానరాదు
నీవు వత్తువన్న సత్యమొకటె నన్ను నిలిపె
రాగదయ్య ఇకనైన రాజభోగా......
*************************************
14 వ్యాఖ్యలు:
మనసును గెలిచిన చెలికాడి కోసం ఓ మగువ మనసు పడే ఆరాటాన్ని చాలా చక్కగా అభివర్ణించారు. ఈ కవిత మనసుకు హత్తుకుంది.
జాములాయెను నీ జాడ కానరాదు
జాజిమల్లెలు ఎన్నడో వాడిపోయె
అలల సవ్వడి లేదు పూవుల ఊసు లేదు
గాలికూడ ఎక్కడ కానరాదు
------
వావ్
శ్రీలలిత గారు ,
వావ్ ఎంత బాగా రాసారండి . చాలా చాలా బాగుంది . థాంక్ యు .
చాలా చక్కగా వర్ణించారు
No words..........simply superb........
అద్భుతంగా ఉందండి..ఇక మాటల్లేవు. ఆలస్యంగా వచ్చినందుకు మన్నించాలి.
వావ్! అందరికి అభినందనలు. ఒక చిత్రం ఇన్ని అనుభూతులు కలిగించింది కదా. దేనికదే ప్రత్యేకంగా ఉంది. మీ కవిత చిత్రానికి తగ్గట్టుగా చాలాబావుంది అని చెప్పడం సరికాదేమో అనిపిస్తుంది. ఇంతకంటే మంచి పదం ఉంటే నా తరఫున మీరే చెప్పేసుకోండి..
Naidu garU,
కవిత నచ్చినందుకు ధన్యవాదాలండీ..
Rao S Lakkaraju garu,
మీ కవితాహృదయానికి నా జోహార్లండీ..
మాలా కుమార్ గారూ,
కవిత నచ్చినందుకు ధన్యవాదాలండీ..
అంతా మీ పుణ్యమే కదా..
sharma garU,
ధన్యవాదాలండీ...
అనీల్ గారూ,
థాంక్యూ...
తృష్ణ గారూ,
స్పందించే మనసు ముఖ్యం కాని ముందూ వెనకల దేముందండీ.. అయినా నేను కూడా కాస్త ఆలస్యంగానే రాసేను లెండి. మీకు నచ్చినందుకు నాకు చాలా సంతోషంగా వుంది.
జ్యోతి గారూ,
ధన్యవాదాలండీ..
Post a Comment